HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
Telugu
  • English
  • हिंदी
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat
  • Trending
  • # IPL 2023
  • # Sri Rama Navami 2023
  • # Pavan Kalyan
  • # Movie Reviews

  • Telugu News
  • ⁄Devotional
  • ⁄Shiva Tandava Stotram

Shiva Tandava Stotram: శివ తాండవ స్తోత్రం

పరమ శివుడిని భక్తితో మనసారా పూజిస్తే కోరిన కోరికలు తీరుస్తాడు. అందుకే శివుడిని బోలా శంకరుడు అని అంటారు. పురాణాల ప్రకారం దేవతలకే కాకుండా రాక్షసులకు కూడా

  • By Vamsi Korata Published Date - 05:00 AM, Mon - 6 March 23
Shiva Tandava Stotram: శివ తాండవ స్తోత్రం

పరమ శివుడిని భక్తితో మనసారా పూజిస్తే కోరిన కోరికలు తీరుస్తాడు. అందుకే శివుడిని బోలా శంకరుడు అని అంటారు. పురాణాల ప్రకారం దేవతలకే కాకుండా రాక్షసులకు కూడా శివుడు వరాలు ఇచ్చేవాడు. ఎందుకంటే రాక్షసులు కూడా వరాల కోసం శివుడిని భక్తితో కొలిచే వారు. పరమ శివుడి కి అభిషేకం అంటే చాలా ఇష్టం. అందుకే శివుడిని అభిషేక ప్రియుడు అని అంటారు. శివుడిని పూజించడం యే కాకుండా శివ తాండవ స్తోత్రం చదవడం వల్ల అనారోగ్యం తో బాధపడేవారికి నయం అవుతుంది. అంతేకాకుండా ఆర్థిక సంస్థలు కూడా తొలగిపోతాయి.

రావణాసురుడు కూడా పరమ శివుడికి గొప్ప భక్తుడు. శివుడి ప్రత్యక్షం కావడం కోసం రావణాసురుడు కూడా శివ తాండవ స్తోత్రాన్ని జపించాడు. శివ తాండవ స్తోత్రం అంటే పరమ శివుడి కి చాలా ఇష్టం. శివ తాండవ స్తోత్రం (Shiva Tandava Stotram) ని జపించడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. శివ తాండవ స్తోత్రం ని జపించడం వల్ల సంపద చేకూరుతుంది. అంతేకాకుండా వైవాహిక జీవితం కూడా సంతోషం గా ఉంటుంది. పిల్లలు లేని వారు శివుడి కి పూజ చేసి అనంతరం శివ తాండవ స్తోత్రం చదివితే పిల్లలు కలుగుతారు.

శివ తాండవ స్తోత్రం (Shiva Tandava Stotram) ని చదివే ముందు మనసులో ఎలాంటి చెడు ఆలోచనలు ఆలోచించకుండా శివ తాండవ స్తోత్రం ని చదవాలి. అంతేకాకుండా శివ తాండవ స్తోత్రం చదివేటప్పుడు మధ్యలో మాట్లాడం చేయకూడదు. నెమ్మదిగ భక్తి శ్రద్ధలతో చదవాలి. స్తోత్రాన్ని జపించేటప్పుడు మీరు శివుడి ముందు కూర్చుని జపించాలి. శివ తాండవ స్తోత్రం ని జపించేటప్పుడు ఎలాంటి గ్రామర్ మిస్టేక్ లేకుండా , ఉచ్ఛారణ సరిగా ఉండేలా చూసుకోండి. గ్రహణ సమయంలో ఈ శివ తాండవ స్తోత్రం ను చదివితే జపం లేదా ధ్యానం చేయడం ద్వారా కలిగే ప్రయోజనాల కంటే వంద రెట్లు ఎక్కువ ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా తెల్లవారు జామున లేదా సంధ్యా సమయం లో ఈ శివ తాండవ స్తోత్రం ని చదివితే ఇంట్లో ఎవరూ అనారోగ్యాల భారిన పడకుండా మరియు దారిద్ర్యం తొలగిపోతుంది.

శివ తాండవ స్తోత్రం (Shiva Tandava Stotram):

జటాటవీగలజ్జలప్రవాహపావితస్థలే
గలేవలంబ్య లంబితాం భుజంగతుంగమాలికామ్ |
డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం
చకార చండతాండవం తనోతు నః శివః శివమ్ || ౧ ||

జటాకటాహసంభ్రమభ్రమన్నిలింపనిర్ఝరీ-
-విలోలవీచివల్లరీవిరాజమానమూర్ధని |
ధగద్ధగద్ధగజ్జ్వలల్లలాటపట్టపావకే
కిశోరచంద్రశేఖరే రతిః ప్రతిక్షణం మమ || ౨ ||

ధరాధరేంద్రనందినీవిలాసబంధుబంధుర
స్ఫురద్దిగంతసంతతిప్రమోదమానమానసే |
కృపాకటాక్షధోరణీనిరుద్ధదుర్ధరాపది
క్వచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని || ౩ ||

జటాభుజంగపింగళస్ఫురత్ఫణామణిప్రభా
కదంబకుంకుమద్రవప్రలిప్తదిగ్వధూముఖే |
మదాంధసింధురస్ఫురత్త్వగుత్తరీయమేదురే
మనో వినోదమద్భుతం బిభర్తు భూతభర్తరి || ౪ ||

సహస్రలోచనప్రభృత్యశేషలేఖశేఖర
ప్రసూనధూళిధోరణీ విధూసరాంఘ్రిపీఠభూః |
భుజంగరాజమాలయా నిబద్ధజాటజూటక
శ్రియై చిరాయ జాయతాం చకోరబంధుశేఖరః || ౫ ||

లలాటచత్వరజ్వలద్ధనంజయస్ఫులింగభా-
-నిపీతపంచసాయకం నమన్నిలింపనాయకమ్ |
సుధామయూఖలేఖయా విరాజమానశేఖరం
మహాకపాలిసంపదేశిరోజటాలమస్తు నః || ౬ ||

కరాలఫాలపట్టికాధగద్ధగద్ధగజ్జ్వల-
ద్ధనంజయాధరీకృతప్రచండపంచసాయకే |
ధరాధరేంద్రనందినీకుచాగ్రచిత్రపత్రక-
-ప్రకల్పనైకశిల్పిని త్రిలోచనే మతిర్మమ || ౭ ||

నవీనమేఘమండలీ నిరుద్ధదుర్ధరస్ఫురత్-
కుహూనిశీథినీతమః ప్రబంధబంధుకంధరః |
నిలింపనిర్ఝరీధరస్తనోతు కృత్తిసింధురః
కళానిధానబంధురః శ్రియం జగద్ధురంధరః || ౮ ||

ప్రఫుల్లనీలపంకజప్రపంచకాలిమప్రభా-
-విలంబికంఠకందలీరుచిప్రబద్ధకంధరమ్ |
స్మరచ్ఛిదం పురచ్ఛిదం భవచ్ఛిదం మఖచ్ఛిదం
గజచ్ఛిదాంధకచ్ఛిదం తమంతకచ్ఛిదం భజే || ౯ ||

అగర్వసర్వమంగళాకళాకదంబమంజరీ
రసప్రవాహమాధురీ విజృంభణామధువ్రతమ్ |
స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం
గజాంతకాంధకాంతకం తమంతకాంతకం భజే || ౧౦ ||

జయత్వదభ్రవిభ్రమభ్రమద్భుజంగమశ్వస-
-ద్వినిర్గమత్క్రమస్ఫురత్కరాలఫాలహవ్యవాట్ |
ధిమిద్ధిమిద్ధిమిధ్వనన్మృదంగతుంగమంగళ
ధ్వనిక్రమప్రవర్తిత ప్రచండతాండవః శివః || ౧౧ ||

దృషద్విచిత్రతల్పయోర్భుజంగమౌక్తికస్రజోర్-
-గరిష్ఠరత్నలోష్ఠయోః సుహృద్విపక్షపక్షయోః |
తృష్ణారవిందచక్షుషోః ప్రజామహీమహేంద్రయోః
సమం ప్రవర్తయన్మనః కదా సదాశివం భజే || ౧౨ ||

కదా నిలింపనిర్ఝరీనికుంజకోటరే వసన్
విముక్తదుర్మతిః సదా శిరఃస్థమంజలిం వహన్ |
విముక్తలోలలోచనో లలాటఫాలలగ్నకః
శివేతి మంత్రముచ్చరన్ సదా సుఖీ భవామ్యహమ్ || ౧౩ ||

ఇమం హి నిత్యమేవముక్తముత్తమోత్తమం స్తవం
పఠన్స్మరన్బ్రువన్నరో విశుద్ధిమేతిసంతతమ్ |
హరే గురౌ సుభక్తిమాశు యాతి నాన్యథా గతిం
విమోహనం హి దేహినాం సుశంకరస్య చింతనమ్ || ౧౪ ||

పూజావసానసమయే దశవక్త్రగీతం యః
శంభుపూజనపరం పఠతి ప్రదోషే |
తస్య స్థిరాం రథగజేంద్రతురంగయుక్తాం
లక్ష్మీం సదైవ సుముఖిం ప్రదదాతి శంభుః || ౧౫ ||

Also Read:  Pawan Kalyan: జగన్ పై మారిన పవన్ మనసు, విశాఖ సదస్సుపై ట్వీట్ దుమారం

Telegram Channel

Tags  

  • devotional
  • god
  • Lord
  • shiva
  • stotram
  • Tandava
https://d31dai02dmgobf.cloudfront.net/wp-content/uploads/2022/03/divis-ad.jpeg

Related News

TTD News: మెట్ల మార్గంలో వచ్చే భక్తులకు టీటీడీ శుభవార్త!

TTD News: మెట్ల మార్గంలో వచ్చే భక్తులకు టీటీడీ శుభవార్త!

తిరుమల దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ గొప్ప శుభవార్త చెప్పింది. నడక దారిలో వచ్చే భక్తులకు దివ్య దర్శన టోకెన్లు ఇస్తునట్లు తెలిపింది.

  • Ramayanam: రామాయణ అద్భుత ఘట్టం.. నేను లేకపోతే? ఏమయ్యేదొ అనుకోవద్దు..

    Ramayanam: రామాయణ అద్భుత ఘట్టం.. నేను లేకపోతే? ఏమయ్యేదొ అనుకోవద్దు..

  • Horoscope 2023: బృహస్పతి అస్తమిస్తే.. ఈ 4 రాశుల వారి ఎదుట సమస్యల క్యూ

    Horoscope 2023: బృహస్పతి అస్తమిస్తే.. ఈ 4 రాశుల వారి ఎదుట సమస్యల క్యూ

  • Glory of Sri Rama: శ్రీరామ నామ మహిమ

    Glory of Sri Rama: శ్రీరామ నామ మహిమ

  • Ramayanam: రామాయణం విశేషాలు

    Ramayanam: రామాయణం విశేషాలు

Latest News

  • Philippine Ferry Fire: ఫిలిప్పీన్స్ ఫెర్రీలో భారీ అగ్నిప్రమాదం.. 31 మంది మృతి

  • Jagan Delhi : ముగిసిన జ‌గ‌న్ ఢిల్లీ చ‌క్కర్లు, అసెంబ్లీ ర‌ద్దు?

  • Bird Flu: చిలీలో కలకలం.. మనుషుల్లో మొట్టమొదటి బర్డ్ ఫ్లూ కేసు..!

  • Power Strike: మెరుపు సమ్మెకు సిద్ధమవుతున్న విద్యుత్ ఉద్యోగులు.. డెడ్ లైన్ ఫిక్స్!

  • America:అమెరికాలోని కేతుంకిలో ఢీకొన్న రెండు ఆర్మీ హెలికాప్టర్లు. 6గురు సైనికులు మృతి

Trending

    • Business Idea : మీ ఊరిలో ఖాళీ స్థలం ఉందా, ఈ పండ్ల తోటతో నెలకు రూ. 1 లక్ష పక్కా…పెట్టుబడి అవసరం లేదు…!

    • Kuno National Park: 70 ఏళ్ల తరువాత జరిగిన అద్భుతం..4గురు పిల్లలకు తల్లి అయిన సియా..అసలు కథ ఇదే..

    • UPI Payment is Free: అంతా ఏప్రిల్ ఫూల్…యూపీఐ చార్జీల విషయంలో జరిగింది ఇదే…

    • UPI Payments: ఇకపై UPI ద్వారా పేమెంట్స్ చేస్తే మన జేబులు ఖాళీ అవ్వాల్సిందే..!

    • ISRO Recruitment 2023: నిరుద్యోగులకు గుడ్‎న్యూస్ ఇస్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..జీతం రూ. 40వేలకే పైనే

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: