Animals In Dream : కలలో ఈ జంతువులను చూశారా ? వాటి పరమార్థం ఇదిగో
జాబ్ ప్రమోషన్, కొత్త పదవి, ధన ప్రాప్తి, ఏదైనా సక్సెస్ మీ తలుపు తట్టబోతోంది అనేందుకు కలలో కనిపించే సింహమే(Animals In Dream) సాక్ష్యం.
- By Pasha Published Date - 06:51 PM, Tue - 10 September 24

Animals In Dream : మనలో చాలామందికి రాత్రి నిద్రలో కలలు వస్తుంటాయి. ఒక్కోసారి ఒక్కో విధమైన కలలు వస్తుంటాయి. కొన్ని సార్లు జంతువులు, పక్షులు, పశువులు కూడా కలలో కనిపిస్తాయి. అలాంటప్పుడు ఆ కలకు అర్థమేంటో తెలియక జనం సతమతం అవుతుంటారు. స్వప్నశాస్త్రం ఇలాంటి కథలకు సరైన, సవ్యమైన సమాధానం ఇస్తుంది. ఆవివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.
Also Read :Yogesh Bairagi Vs Vinesh Phogat : రెజ్లర్ వినేష్ ఫోగట్‌పై పోటీకి యోగేశ్ బైరాగి.. ఎవరాయన ?
- కొందరికి కలలో సింహం కనిపిస్తుంది. అది కనిపిస్తే కంగారుపడొద్దు. ఎందుకంటే మీకు మంచి రోజులు రాబోతున్నాయి. జాబ్ ప్రమోషన్, కొత్త పదవి, ధన ప్రాప్తి, ఏదైనా సక్సెస్ మీ తలుపు తట్టబోతోంది అనేందుకు కలలో కనిపించే సింహమే(Animals In Dream) సాక్ష్యం.
- కొంతమందికి కలలో ఆవు కనిపిస్తుంది. ఇది కనిపించినా మీకు లక్ దక్కబోతోందని అర్థం చేసుకోవాలి. మీరు చేయబోయే పనుల్లో సక్సెస్ ఎదురు కాబోతోంది అనే దానికి కలలో కనిపించే ఆవు సూచిక లాంటిది.
- కొందరికి కలలో ఏనుగు కనిపిస్తుంది. ఇది కనిపించినా టెన్షన్ పడొద్దు. ఎందుకంటే మీకు నెక్ట్స్ పట్టబోయేది రాజయోగమే. మీ సంపద పెరగబోతోంది అనేందుకు ఏనుగు సూచిక.
- పలువురికి కలలో పాము కనిపిస్తుంటుంది. పాములను కలలో చూసిన వాళ్లు హైరానా పడిపోతుంటారు. తమకు శత్రువుల బెడద ఉందని భావిస్తారు. వాస్తవానికి పాము కలలో కనిపిస్తే మీ కోరికలు తీరుతాయని అర్థం. నల్లరంగు పాము కనిపిస్తే మీరు మరింత లక్కీ. డబ్బుతో పాటు మీకు ఫేమ్ కూడా దక్కబోతోంది అనేందుకు నల్లపాము సూచిక.
Also Read :Internet Banned In Manipur : మణిపూర్‌లో ఐదురోజులు ఇంటర్నెట్ బ్యాన్.. మూడు జిల్లాల్లో కర్ఫ్యూ
- పలువురికి కలలో గుడ్లగూడ కనిపిస్తుంది. దీన్ని చూసినా మీరు లక్కీయే. గుడ్లగూబ మామూలుది కాదు. అది లక్ష్మీదేవి వాహనం. దీన్ని కలలో చూస్తే మీకు సడెన్‌గా ధనలాభం కలుగుతుంది.
- కొందరికి కలలో దున్నపోతు కనిపిస్తుంది. ఇది కనిపిస్తే కొంత అలర్ట్ కావాలి. అలా అని భయపడొద్దు. దున్నపోతు కలలో కనిపిస్తే మృత్యువు సమీపించిందని అర్థం చేసుకోవాలి. ప్రయాణాలలో, ఆరోగ్యపరమైన అంశాలలో అలర్ట్‌గా ఉండాలి. గొడవలకు దూరంగా ఉండాలి.
Also Read :Centre Notifies GPS Based Toll System : శాటిలైట్ ఆధారిత టోల్ పద్ధతి అమల్లోకి.. కేంద్రం నోటిఫికేషన్.. ఏమిటిది ?
గమనిక : కొందరు నిపుణులు చెప్పిన, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా పైన ఉన్న సమాచారాన్ని అందించాం. దీనికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని రీడర్స్ గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగత విషయం.