Internet Banned In Manipur : మణిపూర్‌లో ఐదురోజులు ఇంటర్నెట్ బ్యాన్.. మూడు జిల్లాల్లో కర్ఫ్యూ
ద్వేషపూరిత వీడియోలు, ఫొటోలు, మెసేజ్‌లను షేర్ చేయడం/పోస్ట్ చేయడం ద్వారా హింసాకాండను పురికొల్పకుండా సంఘ విద్రోహ శక్తులను అడ్డుకునే లక్ష్యంతో ఇంటర్నెట్ బ్యాన్‌ను అమలు చేస్తున్నట్లు రాష్ట్ర సర్కారు(Internet Banned In Manipur) తెలిపింది.
- By Pasha Published Date - 05:34 PM, Tue - 10 September 24

Internet Banned In Manipur : ఉగ్రవాదుల వరుస దాడుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. మణిపూర్‌లో ఐదు రోజుల పాటు తాత్కాలికంగా ఇంటర్నెట్ బ్యాన్ విధిస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట్రంలోని ఇంఫాల్ ఈస్ట్, ఇంఫాల్ వెస్ట్, థౌబాల్ జిల్లాల్లో కర్ఫ్యూ విధిస్తున్నట్లు వెల్లడించింది. హింసాత్మక ఘటనలను కట్టడి చేసి, శాంతిని పునరుద్ధరించేందుకు ఈ చర్యలను చేపట్టినట్లు తెలిపింది. కర్ఫ్యూ అమల్లో ఉన్న జిల్లాల్లో ప్రజలు తమ ఇళ్ల నుంచి బయటికి రావొద్దని కోరింది.
Also Read :Centre Notifies GPS Based Toll System : శాటిలైట్ ఆధారిత టోల్ పద్ధతి అమల్లోకి.. కేంద్రం నోటిఫికేషన్.. ఏమిటిది ?
మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి ఆదివారం వరకు రాష్ట్రంలో లీజ్ లైన్‌లు, వీశాట్‌లు, బ్రాడ్‌బ్యాండ్‌లు, వీపీఎన్ సహా ఇంటర్నెట్, మొబైల్ డేటా సేవలు తాత్కాలికంగా నిలిచిపోతాయని మణిపూర్ ప్రభుత్వ హోం శాఖ పేర్కొంది. ఈమేరకు ఒక ఉత్తర్వును ఇవాళ మధ్యాహ్నం విడుదల చేేసింది. ద్వేషపూరిత వీడియోలు, ఫొటోలు, మెసేజ్‌లను షేర్ చేయడం/పోస్ట్ చేయడం ద్వారా హింసాకాండను పురికొల్పకుండా సంఘ విద్రోహ శక్తులను అడ్డుకునే లక్ష్యంతో ఇంటర్నెట్ బ్యాన్‌ను అమలు చేస్తున్నట్లు రాష్ట్ర సర్కారు(Internet Banned In Manipur) తెలిపింది. రాష్ట్రంలో మత సామరస్యాన్ని, శాంతి భద్రతలను కాపాడే లక్ష్యంతో ఈ చర్యలు చేపట్టాల్సి వస్తోందని స్పష్టం చేసింది.
Also Read :Jackals Terror : నక్కను 15 అడుగుల దూరం విసిరి పారేశాడు.. అసలు ఏమైందంటే ?
కర్ఫ్యూ అమల్లో ఉన్న జిల్లాల్లో వైద్యసేవలు, విద్యుత్ సేవలు, మున్సిపల్ సేవలు, మీడియా సేవలు, కోర్టు విధులకు మినహాయింపు ఉంటుందని తెలిపారు. ఆల్ థౌబాల్ అపున్బా స్టూడెంట్ సంస్థ ఈనెల 9న నిర్వహించిన ర్యాలీలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో థౌబాల్ జిల్లా మెజిస్ట్రేట్ కోర్టు ప్రొహిబిటరీ ఆర్డర్స్‌ను జారీ చేసింది. ఎవరూ ఆయుధాలు చేతిలో పట్టుకొని తిరగొద్దని స్పష్టం చేసింది. గుంపులు గుంపులుగా ఏర్పడి నిరసన కార్యక్రమాలను నిర్వహించొద్దని కోరింది. ఈ ఆదేశాలను ఉల్లంఘించే వారిపై భారీ జరిమానాలు విధిస్తామని హెచ్చరించింది. అత్యవసర సేవలు మినహా మిగతా కార్యకలాపాలను థౌబాల్ జిల్లాలో ఆపేస్తున్నట్లు కోర్టు పేర్కొంది.
కేంద్రానికి మణిపూర్ సీఎం డిమాండ్లు
మరోవైపు మణిపూర్ సీఎం ఎన్. బీరేన్ సింగ్‌కు బీజేపీ హైకమాండ్ మధ్య గ్యాప్ పెరిగింది. మణిపూర్ రాష్ట్ర శాంతిభద్రతల వ్యవహారాలను ప్రస్తుతం కేంద్ర హోంశాఖ, ఆర్మీ సంయుక్తంగా పర్యవేక్షిస్తున్నాయి. ఆ బాధ్యతలను సీఎంగా తనకే అప్పగించాలని ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ డిమాండ్ చేస్తున్నారు. ఇటీవలే ఆయన దీనిపై గవర్నర్‌కు ఒక లేఖను అందించారు. ఈ తరుణంలో మణిపూర్‌లో ఇంటర్నెట్ బ్యాన్ అమల్లోకి రావడం గమనార్హం.