HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >Rules Of Ramakoti Full Details Here

Rules Of Ramakoti : రామకోటి రాస్తున్నారా? ఈ నియమాలు తప్పక పాటించాల్సిందే.!!

రామకోటి..రాస్తున్నారా..? అయితే అది మంచి ఆలోచన..!! రామకోటి రాయడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు..!!

  • Author : hashtagu Date : 29-08-2022 - 6:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Srirama
Srirama

రామకోటి..రాస్తున్నారా..? అయితే అది మంచి ఆలోచన..!! రామకోటి రాయడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు..!! కానీ రామకోటిని రాయడానికి ముందు కొన్ని నియమాలు తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. ఎలాపడితే అలా..ఎక్కడబడితే అక్కడ రామకోటి రాయడానికి వీల్లేదు. భక్తిశ్రద్ధలతో ఒక క్రమబద్ధమైన ప్రణాళికను ఏర్పరుచుని రాయాల్సి ఉంటుంది. ఇలా రాస్తేనే అంతా మంచి జరుగుతుంది.

రామకోటి రాయడానికి ఎలాంటి నియమాలు అనుసరించాలి..?

రామకోటిని సాధారణంగా పెద్దలు రాస్తుంటారు. వయస్సు మీదపడినవారు రామా…రామా అంటూ రామకోటిని రాయడం ప్రారంభిస్తారు. కానీ నిజానికి అది చిన్ననాటి నుంచే రాస్తే ఎన్నో అద్భుతమైన ఫలితాలు వస్తాయి. రామకోటి రాయడానికి ఎలాంటి నియమాలు అనుసరించాలో తెలుసుకుందాం. మీకు రామకోటి రాయాలన్న ఆలోచన ఉంటే…ముందుగా మీరు భక్తితో దేవుడి వద్ద సంకల్పం తీసుకోవాలి. అప్పుడు మానసికంగా, ఎలాంటి ఒత్తిళ్లకు లోనవ్వకుండా హాయిగా ఉంటుంది.

-శ్రీరామ…అనే పదం రాయసేందుకు వీలుగా ఉండే కోటి గళ్లున్న పుస్తకాన్ని తెచ్చుకోవాలి. అలా కుదరకుంటే…మీరే ఒక తెల్లకాగితాలతో ఒక పుస్తకాన్ని తయారు చేసుకోవాలి. అందులో కోటి గళ్లు చేసుకుని రాయడం మొదలు పెట్టవచ్చు.

-రామకోటి మొదలుపెట్టే ముందు శాస్త్రాల ప్రకారం ఒక మంచి సమయం, రోజును కేటాయించుకోవాలి. మీరు రాయాల్సిన పుస్తకానికి పసుపు, కుంకుమరాసి…దేవుని సన్నిధిలో శ్రీరామ అష్టోత్తరశతనామావళితో పూజా చేయాలి. ఆ తర్వాత పుస్తకంలో రాయడం ప్రారంభించాలి.

-రామకోటి పుస్తకం రాస్తున్నప్పుడు మనస్సులో ఎలాంటి చెడు ఆలోచనలు పెట్టుకోవద్దు. మనస్సు ప్రశాంతంగా…హాయిగా ఉంచుకోవాలి. ఎలాంటి చింతలు పెట్టుకోకూడదు. దేవుని మీద భక్తితో, ఏకాగ్రతతో మనస్సును కేంద్రీకరించి రామా రామా అంటూ మనస్సులో అనుకుంటూ రాయాలి. పుస్తకం రాస్తున్నప్పుడు మధ్యలో ఏదైనా అవసరం ఉంటే…సరిసంఖ్యలో పుస్తకాన్ని ఆపివేయాలి. తిరిగి ప్రారంభించే ముందు కాళ్లు, చేతులు శుభ్రంగా కడుక్కోని మళ్లీ రాయడం మొదలు పెట్టాలి.

-రామకోటి రాసే కలాన్ని ప్రత్యేకంగా పెట్టుకోవాలి. ఎక్కడపడితే అక్కడ పెట్టకూడదు. అదేవిధంగా పుస్తకంలో ఎలాంటి ఇతర విషయాల గురించి రాయకూడదు. ముఖ్యంగా రామకోటి రాసినతర్వాత ఆరోజు ఆ పుస్తకాన్ని దేవుడి సన్నిధిలోనే ఉంచడం మంచిది. ఇక రామకోటిని మనస్సు పూర్తిగా రాయాలి..బలవంతంగా రాయకూడదు. మీకు రాయాలనే సంకల్పం కలిగినప్పుడే దానిని పూర్తి చేయాలి. అలా రాయడానికి ప్రత్యేక సమయం అంటూ ఏమీ ఉండదు. కానీ పవిత్రత మాత్రం తప్పకుండా పాటించాలి.

-రామకోటి రాస్తున్న పుస్తకంలో ప్రతి లక్ష నామాలకు ప్రత్యేక పూజలు నిర్వహించాలి. నివేదన చేసుకుంటే మంచిది. తర్వాత అందరికీ ప్రసాదాన్ని పంచిపెట్టాలి. రామకోటి పుస్తకం రాయడం పూర్తయిన తర్వాత పూజ నివేదనలు సమర్పించి ఆరాధన చేసుకోవాలి. ఇలా చేస్తే మీరు ఆశించిన ఫలితాలను పొందుతారు.

-ఈ విధంగా రామకోటి పుస్తకం రాయడం పూర్తయిన తర్వాత ఏదైన రామునిగుడిలో ఆధ్యాత్మిక వ్యక్తికి అప్పగించాలి. ఈ విషయాలు తప్పకుండా పాటించాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • devotional
  • ramakoti
  • rules of ramakoti
  • write

Related News

srikalahasti brahmotsavam 2026 dates

ఈ నెల 10 నుంచి శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

Sri Kalahasti Brahmotsavams  ప్రముఖ శైవ క్షేత్రం శ్రీకాళహస్తిలో ఈ నెల 10 నుంచి 23 వరకు శివరాత్రి సందర్భంగా నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు ఆలయ ట్రస్ట్ బోర్డు ప్రత్యేకంగా ఆహ్వానం అందజేసింది. బుధవారం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ కొట్టే సాయిప్రసాద్ పవన్ కళ్యాణ్‌ను కలిసి అధికారిక ఆహ్వాన పత్రికతో పాటు స్వామి వారి ప్రసాదాలన

    Latest News

    • రైతు భరోసా వారికీ మాత్రమే తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

    • ఏపీలో ‘కల్తీ’ రాజకీయాలు!

    • కస్టమర్లకు షాక్ ఇచ్చిన SBI

    • ఒంటరిగా ఉన్నప్పుడు గుండెపోటు వస్తే ఏం చేయాలి?

    • భారీ బూట్ స్పేస్‌ను అందించే కార్ల జాబితా ఇదే!

    Trending News

      • టీ20 ప్రపంచకప్‌కు కౌంట్ డౌన్ స్టార్ట్‌.. రేపట్నుంచి సంద‌డే!

      • ధోనీ త‌ర్వాత వైభ‌వ్ సూర్య‌వంశీనే!

      • సేవ్ అమెరికా చట్టం అంటే ఏమిటి?

      • సైనిక శక్తిని మరింత పటిష్టం చేసుకున్న ఇరాన్‌.. రంగంలోకి సెజ్జిల్-2 బాలిస్టిక్ మిసైల్!

      • ఈనెల‌లో బ్యాంకులు ప‌ని చేసేది ఎన్ని రోజులంటే?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd