TTD: తిరుపతిలోని రహదారులకు మహనీయుల పేర్లతో ఆధ్యాత్మిక వాతావరణం
- Author : Balu J
Date : 18-02-2024 - 5:16 IST
Published By : Hashtagu Telugu Desk
TTD: తిరుపతిలో ఓక వైపు అభివృద్ది దిశగా, మరోవైపు ఆధ్యాత్మిక వాతావరణం వెల్లు విరిసేలా ముందుకెల్లుతున్నదని టీటీడీ చైర్మెన్, తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి అన్నారు. తిరుపతి ఇస్కాన్ రోడ్డును కలుపుతూ చెన్నారెడ్డి కాలనీ వైపు నుండి నిర్మించిన నూతన కనెక్టవిటీ రోడ్డును టీటీడీ చైర్మెన్, తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి ముఖ్య అతిథిగా, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అదితి సింగ్, డిప్యూటీ మేయర్లు భూమన అభినయ్ కాలనీలో ముద్రనారాయణ, తిరుపతి ఇస్కాన్ టెంపుల్ నిర్వాహకులు రేవతి రమణదాస్ చేతుల మీదుగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా భూమన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ నేడు ప్రారంభిస్తున్న ఈ నూతన రహదారికి ఇస్కాన్ టెంపుల్స్ వ్యవస్థాపకులైన అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి పేరును ఈ మార్గానికి నామకరణం చేయడం చాలా సంతోషంగా వుందన్నారు. తిరుపతిలోని నూతన రహదారులకు మహనీయుల పేర్లను పెట్టడం వలన ఆధ్యాత్మిక వాతావరణం వెల్లి విరుస్తున్నదన్నారు. రహదారి ప్రారంభోత్సవ అనంతరం చెన్నారెడ్డి కాలనీలో నిర్మిస్తున్న ఊటగుంటను భూమన కరుణాకర రెడ్డి పరిశీలిస్తూ పూరతనమైన ఈ ఊటగుంట ఆనాడు తిరుమలకి వెల్లే యాత్రికులకు త్రాగునీరు అందించేదని, అటు తరువాత గాలిగోపురం దగ్గర, కాలిబాటలోని లక్ష్మీ నరసింహ ఆలయం దగ్గర వుండే ఊటు గుంటలు భక్తులకు త్రాగునీరు అందించేవని, ఈ మూడు పూర్తిగా పాడైపోవడంతో తిరిగి పునః నిర్మిస్తున్నట్లు తెలిపారు.
మునిసిపల్ కార్పొరేషన్ నిధులతో చెన్నారెడ్డి కాలనీలో అతి సుందరంగా, ఆధ్యాత్మిక వాతావరణం వెల్లి విరిసేలా నిర్మిస్తున్న ఈ కుంటను ప్రారంభించిన తరువాత ఇస్కాన్ టేంపుల్ ఆధ్వర్యంలో నిర్వహణ భాధ్యతలు చేపడుతామని తిరుపతి ఇస్కాన్ టెంపుల్ నిర్వాహకులు రేవతి రమణదాస్ ప్రకటించడాన్ని టీటీడీ చైర్మెన్ భూమన కరుణాకర రెడ్డి అభినందించారు.