Hanuman : సర్వపాపాలను తొలగించే హనుమ నామస్మరణ గురించి తెలుసా..!!
మనలో ఎక్కువ మంది ఇష్టంగా పూజించే దేవుళ్లలో ఆంజనేయస్వామి ఒకరు. వేర్వేరు రూపాల్లో ఆంజనేయస్వామి దర్శనమిస్తాడు.
- By hashtagu Published Date - 06:00 AM, Tue - 7 June 22

మనలో ఎక్కువ మంది ఇష్టంగా పూజించే దేవుళ్లలో ఆంజనేయస్వామి ఒకరు. వేర్వేరు రూపాల్లో ఆంజనేయస్వామి దర్శనమిస్తాడు. హనుమంతుని అనుగ్రహం కలగడంతోపాటు మనం చేసిన పాపాలు తొలగిపోవాలని అనుకుంటే…సుందరకాండ పారాయణం చేయడం మంచిది. ఈ పారాయణం వల్ల కోరిన కోరికలు నెరవేరడంతోపాటు శుభ ఫలితాలు కలుగుతాయి.
హనుమంతుని యంత్రంను ఇంట్లో ఉంచి పూజిస్తే…మనతోపాటు మన కుటుంబ సభ్యులు కూడా సంతోషంగా ఉంటారు. సుందరకాండ పారాయణం చదివిన వాళ్లు ఆరోగ్యంగా ఉండటంతోపాటు ఏవైనా మానసిక సమస్యలు ఉంటే ఆ సమస్యలు కూడా దూరం అవుతాయి. ఇంట్లో తప్పనిసరిగా ఆంజనేయస్వామి విగ్రహం లేదా ఫోటో ఉంటే అనుకూల ఫలితాలు కలుగుతాయి.
విద్యార్థులు హనుమంతుని పూజిస్తే…వారిపై ఆశీస్సులు ఉంటాయి. మంగళవారం హనుమంతుడి దేవాలయాన్ని సందర్శించడం వల్ల శుభఫలితాలు కలుగుతాయి. తులసీదాస్ రచించిన హనమాన్ చాలీసాను రోజూ ఉదయం సాయంత్రం స్మరించినట్లయితే మంచి ఫలితాలను పొందవచ్చు. హనుమంతుని ముందు మట్టి ప్రమీదలో దీపం వెలిగించినట్లయితే కుటుంబంలో మనశ్శాంతి ఉంటుంది.
సీతాదేవి హనుమంతుడు ఉన్న ప్రతిచోటా సమస్త భోగభాగ్యాలు కలుగుతాయని వరం ఇచ్చిందట. ఎవరైతే ఆంజనేయస్వామిని పూజిస్తారో…వారికి భూతప్రేత బాధలు, పిశాచాల బాధలు కూడా తొలగిపోతాయి. భక్తితో హనుమంతుడిని పూజిస్తే…కోరిన కోరికలు నెరవేరుతాయి.