HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >Over %e2%82%b923 Crore Was Donated At Shirdi Sai Baba Temple On New Years Day

కాసుల వర్షం.. కొత్త ఏడాది కానుకగా రూ. 23.29 కోట్ల విరాళాలు!

ఈ విరాళాలను సాయిబాబా ఆసుపత్రి, సాయినాథ్ ఆసుపత్రి నిర్వహణకు ప్రసాదాలయంలో ఉచిత భోజన వసతికి, విద్యా సంస్థల నిర్వహణకు, భక్తుల సౌకర్యార్థం చేపట్టే వివిధ సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగిస్తామని సిఈఓ గాడిల్కర్ తెలిపారు.

  • Author : Gopi Date : 03-01-2026 - 10:14 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Shirdi Sai Baba
Shirdi Sai Baba

Shirdi Sai Baba: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా షిర్డీలోని శ్రీ సాయిబాబా సంస్థాన్‌కు భక్తులు భారీగా విరాళాలు సమర్పించారు. క్రిస్మస్ సెలవులు, పాత ఏడాది వీడ్కోలు, కొత్త ఏడాది స్వాగత వేడుకల సందర్భంగా భక్తులు తమ మొక్కులను చెల్లించుకోవడంతో కేవలం కొద్దిరోజుల వ్యవధిలోనే సుమారు రూ. 23.29 కోట్ల ఆదాయం సమకూరినట్లు సంస్థాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గోరక్ష గాడిల్కర్ వెల్లడించారు.

విరాళాల పూర్తి వివరాలు

సంస్థాన్ తెలిపిన గణాంకాల ప్రకారం వివిధ మార్గాల ద్వారా అందిన ఆదాయం ఇలా ఉంది. హుండీల ద్వారా రూ. 22.02 కోట్లు, డొనేషన్ కౌంటర్ల ద్వారా రూ. 3.22 కోట్లు, పి.ఆర్ టోల్ పాస్ ద్వారా రూ. 2.42 కోట్లు అందినట్లు తెలిపారు. డెబిట్/క్రెడిట్ కార్డులు, ఆన్‌లైన్ విరాళాలు, చెక్కులు, డిడిల ద్వారా రూ. 10.18 కోట్లు సమకూరాయి. ప్రపంచవ్యాప్తంగా 26 దేశాల నుండి వచ్చిన భక్తులు విదేశీ కరెన్సీ రూపంలో రూ. 16.83 లక్షలు సమర్పించారు. భక్తులు సుమారు రూ. 36.38 లక్షల విలువైన 293.91 గ్రాముల బంగారం, రూ. 9.49 లక్షల విలువైన సుమారు 6 కిలోల వెండిని కానుకగా ఇచ్చారు.

Also Read: విజ‌య్ చివ‌రి మూవీ ట్రైల‌ర్ విడుద‌ల‌.. భ‌గ‌వంత్ కేస‌రి రీమేకే?

వైభవంగా వజ్రాల కిరీటం

నూతన సంవత్సర తొలిరోజున ఒక భక్తుడు సాయిబాబా పాదాల చెంత అత్యంత విలువైన బంగారు-వజ్రాల కిరీటాన్ని సమర్పించారు. 655 గ్రాముల బరువున్న ఈ కిరీటం విలువ సుమారు రూ. 80 లక్షలుగా అంచనా వేస్తున్నారు. ఇందులో 585 గ్రాముల స్వచ్ఛమైన బంగారం, 153 క్యారెట్ల ఖరీదైన వజ్రాలు పొందుపరిచారు.

అన్నప్రసాదం- లడ్డూల విక్రయం

ఈ ఉత్సవాల సమయంలో సాయిబాబా ప్రసాదాల పంపిణీ కూడా భారీ స్థాయిలో జరిగింది. సుమారు 6 లక్షల మందికి పైగా భక్తులు సాయి ప్రసాదాలయంలో ఉచిత భోజనం స్వీకరించగా, లక్ష మందికి పైగా ఫుడ్ ప్యాకెట్లను పొందారు. సుమారు 7.67 లక్షల లడ్డూ ప్రసాదం ప్యాకెట్ల విక్రయం ద్వారా రూ. 2.30 కోట్ల ఆదాయం వచ్చింది. అలాగే 5.76 లక్షల మంది భక్తులకు ఉచితంగా బూందీ ప్రసాదం పంపిణీ చేశారు.

విరాళాల వినియోగం

ఈ విరాళాలను సాయిబాబా ఆసుపత్రి, సాయినాథ్ ఆసుపత్రి నిర్వహణకు ప్రసాదాలయంలో ఉచిత భోజన వసతికి, విద్యా సంస్థల నిర్వహణకు, భక్తుల సౌకర్యార్థం చేపట్టే వివిధ సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగిస్తామని సిఈఓ గాడిల్కర్ తెలిపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • devotional
  • devotional news
  • donations
  • Maharashtra
  • Shirdi Sai Baba
  • Shirdi Temple

Related News

Do you know the history of Venkateswara Suprabhatam?

Venkateswara Suprabhatam: వేంకటేశ్వర సుప్రభాతం చరిత్ర తెలుసా?

తొలివేకువన వినిపించే సుప్రభాత గీతం శ్రీవారికి అదే మేల్కొలుపు గానం భక్తులకు హృదయనాదం ఆ దివ్యమంగళ ధ్వనికి స్వామివారి కళ్లు విచ్చుకుంటాయి ఆయన చల్లని చూపులు లోకం మీద ప్రసరిస్తాయి అదే శ్రీవేంకటేశ్వర సుప్రభాత గీతం.   ఇంతకీ ఈ సుప్రభాతాన్ని మొదట ఎవరు ఆలపించారో తెలుసా? స్వామిని మేల్కొలిపే సంప్రదాయానికి నాంది ఎక్కడ పడిందో తెలుసా? చదవండి..   తొలివేకువ కిరణాలు పవిత్ర తిరుమల క

    Latest News

    • Meta : ‘మెటా’ నుంచి సరికొత్త పేరంటల్ అలర్ట్స్!

    • TS EAPCET 2026: తెలంగాణలో నేటి నుంచి ఇంజినీరింగ్ కౌన్సెలింగ్

    • Anupama Singh: కాశ్మీర్ జోలికొస్తే ఊరుకోం.. ఐరాసలో పాకిస్థాన్‌కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్

    • Sreesanth: ఆమె లేకపోతే నేను ఆత్మహత్య చేసుకునేవాడిని : శ్రీశాంత్‌

    • Lakshmi Devi: ఈ వస్తువులను మీ ఇంట్లోని పూజ గదిలో పెడితే చాలు.. లక్ష్మీ అనుగ్రహం కలగడం ఖాయం!

    Trending News

      • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

      • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd