విజయ్ చివరి మూవీ ట్రైలర్ విడుదల.. భగవంత్ కేసరి రీమేకే?
కొద్దిసేపటి క్రితమే మేకర్స్ ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. దీనిని బట్టి ‘జన నాయగన్’ ఖచ్చితంగా బాలయ్య నటించిన ‘భగవంత్ కేసరి’ చిత్రానికి రీమేక్ అని స్పష్టమైంది.
- Author : Gopichand
Date : 03-01-2026 - 10:04 IST
Published By : Hashtagu Telugu Desk
Jana Nayagan Trailer: దళపతి విజయ్ ఆఖరి చిత్రం ‘జన నాయగన్’ జనవరి 9న గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు సిద్ధమైంది. హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటించగా మమితా బైజు, బాబీ డియోల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా నందమూరి బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’కి అధికారిక రీమేక్ అని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.
కొద్దిసేపటి క్రితమే మేకర్స్ ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. దీనిని బట్టి ‘జన నాయగన్’ ఖచ్చితంగా బాలయ్య నటించిన ‘భగవంత్ కేసరి’ చిత్రానికి రీమేక్ అని స్పష్టమైంది. అయితే దర్శకుడు ఇందులో చిన్న మార్పులు (ట్విస్ట్) చేసినట్లు కనిపిస్తోంది. ‘భగవంత్ కేసరి’ ప్రధానంగా మహిళా సాధికారత, క్లిష్ట పరిస్థితుల్లో ఆత్మవిశ్వాసంతో ఉండటం అనే అంశంపై సాగగా.. విజయ్ చిత్రం ఆ మూల కథను అలాగే ఉంచి కొత్త హంగులను జోడించింది.
Also Read: వెనిజులాలో అర్ధరాత్రి వైమానిక దాడులు… అసలు మదురోపై ట్రంప్ ఎందుకు పగబట్టారు?
ఈ సినిమాలో రాజకీయాలు, రోబోటిక్ అంశాలను అదనంగా చేర్చినట్లు తెలుస్తోంది. ప్రతినాయకుడి పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు విజయ్ రాజకీయ ప్రవేశానికి తగ్గట్టుగా ఇందులో పొలిటికల్ సెటైర్లు కూడా ఉన్నట్లు సమాచారం. ట్రైలర్లో గ్రాండ్ విజువల్స్ మరియు నిర్మాణ విలువలు హైలైట్‌గా నిలిచాయి. దళపతి విజయ్ తన స్క్రీన్ ప్రెజెన్స్, మాస్ మూమెంట్స్‌తో ఆకట్టుకున్నారు.
గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాష్ రాజ్, సునీల్, ప్రియమణి ఇతర సహాయక పాత్రల్లో నటించారు. కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ ఈ చిత్రాన్ని నిర్మించగా.. అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం తెలుగులో ‘జన నాయకుడు’ పేరుతో హిందీలో ‘జన్ నేత’ పేరుతో విడుదల కానుంది.