Newlyweds: కొత్తగా పెళ్లి అయినవారు హోలీ వేళ ఈ తప్పులు చేయొద్దు..
ఇటీవల పెళ్లి చేసుకున్న అమ్మాయిలు హోలికా దహన్‌ను చూడకూడదు. ఇలా చేస్తే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితిలో, కొత్తగా పెళ్లయిన వారు
- By Vamsi Korata Published Date - 08:00 AM, Mon - 6 March 23

ఇటీవల పెళ్లి చేసుకున్న అమ్మాయిలు హోలికా దహన్‌ను చూడకూడదు. ఇలా చేస్తే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితిలో, కొత్తగా పెళ్లి అయినవారు (Newlyweds) హోలీ రోజున గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే పండుగ హోలీ. హోలీ ఆడటానికి ఒకరోజు ముందు హోలికా దహన్ జరుగుతుంది. ఈసారి మార్చి 7న హోలికా దహన కార్యక్రమం ఉంది. హోలికా దహన మంటలను కొత్తగా పెళ్లి అయినవారు (Newlyweds) చూడకూడదని అంటారు. వారు ఆ రోజు ఇంకా ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం..
ఏ రంగు బట్టలు
కొత్త వధువులు హోలీ రోజున నల్లని బట్టలు ధరించడం మానుకోవాలి. ఎందుకంటే ఇది అశుభం. నలుపు రంగు అనేది ప్రతికూల శక్తులను ఆకర్షిస్తుందని నమ్ముతారు. ఎందుకంటే హోలాష్టక్ రోజున ప్రతికూల శక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రంగును ధరించడం మానుకోవాలి. అంతే కాకుండా పెళ్లయిన తర్వాత తొలిసారి హోలీ జరుపుకునే స్త్రీలు తెల్లని బట్టలు ధరించకూడదు. వాటికి బదులుగా కొత్త వధువు పసుపు లేదా ఎరుపు రంగు దుస్తులు ధరించవచ్చు.
అత్తమామల ఇంట్లో హోలీ జరుపుకోవద్దు
మత విశ్వాసాల ప్రకారం, పెళ్లి తర్వాత మొదటి హోలీని కొత్త జంటలు తమ అత్తమామల ఇంట్లో జరుపుకోకూడదు. ఇది ఇంటి ఆనందం మరియు శాంతిని ప్రభావితం చేస్తుందని నమ్ముతారు. నూతన వధూవరులు తమ అత్తమామల ఇంట్లో మొదటి హోలీ ఆడటం అశుభకరం. ఇలా చేయడం ద్వారా మీ సంబంధం కూడా చెడిపోతుంది.ఇది కాకుండా, మీకు మరియు మీ భాగస్వామికి ఏదైనా అశుభం జరగవచ్చు.
పెళ్లి సామాన్లు ఎవరికీ ఇవ్వొద్దు
ఇటీవల వివాహమైన స్త్రీలు తమకు వివాహంలో కానుకగా, కటినంగా లభించిన వస్తువులను ఎవరికీ దానం చేయకూడదు. హోలికా దహనం రోజున తంత్ర-మంత్రం ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంటారు. అందుకే ఆ టైంలో వస్తువులు ఇతరులకు ఇవ్వడం వల్ల నెగెటివ్ ఎఫెక్ట్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది.
Also Read: WhatsApp Feature: వాట్సాప్ లో తెలియని నంబర్ల కాల్స్ ను మ్యూట్ చేసే ఫీచర్!

Related News

Vishnu Matsya Avatara: మత్స్య జయంతి, విష్ణువు మత్స్యావతార విశేషాలు
ధర్మరక్షణ కోసం శ్రీమహావిష్ణువు దశావతారములు ఎత్తాడు. వీటిలో మొట్టమొదటి అవతారం ఈ మత్స్యావతారం. కొందరు మత్స్యావతారాన్ని జలావిర్భావానికి సూచికగా చెబుతారు.