WhatsApp Feature: వాట్సాప్ లో తెలియని నంబర్ల కాల్స్ ను మ్యూట్ చేసే ఫీచర్!
త్వరలో మరో కొత్త ఫీచర్ ను తెచ్చేందుకు వాట్సాప్ రెడీ అవుతోంది. వాట్సాప్ లో తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్ ను మ్యూట్ చేయడమే ఈ కొత్త ఫీచర్ ప్రత్యేకత.
- By Maheswara Rao Nadella Published Date - 07:30 PM, Sun - 5 March 23

త్వరలో మరో కొత్త ఫీచర్ ను తెచ్చేందుకు వాట్సాప్ (WhatsApp) రెడీ అవుతోంది. వాట్సాప్ లో తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్ ను మ్యూట్ చేయడమే ఈ కొత్త ఫీచర్ ప్రత్యేకత. ప్రస్తుతం ఇది ఇంకా డెవలప్మెంట్ స్టేజ్ లో ఉంది. వాట్సాప్ (WhatsApp) సెట్టింగ్స్ సెక్షన్ లో ఇందుకు సంబంధించిన ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్ సైలెన్స్ అయిపోతాయి. అయితే అవి కాల్స్ లిస్ట్, నోటిఫికేషన్ సెంటర్‌లో కనిపిస్తూనే ఉంటాయి. ఈ ఆప్షన్ వల్ల స్పామ్ కాల్‌లకు చెక్ పడుతుంది. ఇటీవల కాలంలో స్పామ్ కాల్‌లు పెద్ద సమస్యగా మారాయి .ఇన్ స్టాంట్ మెసేజింగ్ యాప్‌లు దీనికి మినహాయింపు కాదు.
‘చాట్ ట్రాన్స్‌ఫర్’ ఫీచర్..
చాట్ బ్యాకప్ కష్టాలను కూడా వాట్సాప్ తొలగించనుంది. సులువుగా చాట్ హిస్టరీని ట్రాన్స్‌ఫర్ చేసుకునే అవకాశాన్ని కల్పించనుంది. త్వరలోనే ‘చాట్ ట్రాన్స్‌ఫర్’(Chat Transfer) అనే ఫీచర్‌ని అందించేందుకు సిద్ధమవుతోంది. దీని ద్వారా వినియోగదారులు సులువుగా మెసేజ్‌లను స్టోర్ చేసుకోవచ్చు. యూజర్లు తమ చాట్ హిస్టరీని ఒక ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి మరో ఆండ్రాయిడ్ ఫోన్‌లోకి సులువుగా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. కేవలం లోకల్ నెట్‌వర్క్ ద్వారానే ఈ టాస్క్ కంప్లీట్ చేయవచ్చు. క్యూఆర్(QR Code) ద్వారా చాట్ హిస్టరీని ట్రాన్స్‌ఫర్ చేయగలిగేలా ఫీచర్‌ని ఎనేబుల్ చేయనుంది. యూజర్లు తమ డేటాని ఏ స్మార్ట్‌ఫోన్‌కి సెండ్ చేయాలని అనుకుంటున్నారో.. ఆ డివైజ్‌లో క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేయాలి. దీంతో ప్రస్తుతం వినియోగిస్తున్న డివైజ్ నుంచి చాట్ హిస్టరీ కొత్త డివైజ్‌లోకి బదిలీ అవుతుంది. దీనికి ఎలాంటి క్లౌడ్ సర్వీసును వినియోగించాల్సిన అవసరం లేదు. కొత్త ఫోన్‌ని కొనుగోలు చేసినప్పుడు, వేరే ఫోన్‌లో వాట్సప్ లాగిన్ అయినప్పుడు ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది.
ట్యాప్ అండ్ హోల్డ్ కి గుడ్ బై..
వాట్సాప్ లో ఇప్పటి వరకూ వినియోగదారుడు ఏదైనా వీడియో రికార్డ్ చేయాలంటే ట్యాప్ అండ్ హోల్డ్ బటన్ వినియోగించేవారు. అయితే ఇప్పుడు దీనిని వాట్సాప్ పూర్తిగా అప్ డేట్ చేసి కొత్త ఫీచర్ ను తీసుకొచ్చింది. ట్యాప్ అండ్ హోల్డ్ స్థానంలో ప్రత్యేకంగా వీడియో మోడ్ ను ఆవిష్కరించింది. దీని కోసం కొన్ని బగ్ లను యాప్లో ఫిక్స్ చేసింది. దీని ద్వారా వాట్సాప్ కాల్ నుంచి వీడియో మోడ్ కు ఎలా స్విచ్ అవుతున్నారో ఫోటో నుంచి వీడియో కి ఇలా స్విచ్ అయ్యే వెసులుబాటు కలుగుతోంది.ఈ ఫీచర్ ను మీరు పొందుకోవాలంటే గూగుల్ ప్లే స్టోర్ కి వెళ్లి మీ వాట్సాప్ ను అప్ డేట్ చేసుకోవాలి.
Also Read: Chandrababu: ఈ చిన్న లాజిక్ గమనిస్తే చంద్రబాబే సీఎం

Related News

Create your Avatar in WhatsApp: వాట్సాప్‌లో అవతార్‌ను ఎలా క్రియేట్ చేయాలి? దాన్ని ప్రొఫైల్ పిక్ లా ఎలా ఉపయోగించాలి?
అవతార్‌ను పంపడం అనేది స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో భావాలను పంచుకోవడానికి వేగవంతమైన మరియు ఆహ్లాదకరమైన మార్గం. వాట్సాప్‌లో మీ ప్రొఫైల్ ఇమేజ్‌ని..