Mattapally: మట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం.. మట్టపల్లి
పూర్వకాలంలో 11 వ శతాబ్దంలో కృష్ణానదికి మరోవైపునున్న గుంటూరు జిల్లా, దాచేపల్లి మండలంలోని తంగెడ ప్రాంతాన్ని అనుముల మాచిరెడ్డి ప్రభువు పరిపాలించేవాడు.
- By Vamsi Korata Published Date - 06:00 PM, Sun - 5 March 23

పూర్వకాలంలో 11 వ శతాబ్దంలో కృష్ణానదికి మరోవైపునున్న గుంటూరు జిల్లా, దాచేపల్లి మండలంలోని తంగెడ ప్రాంతాన్ని అనుముల మాచిరెడ్డి ప్రభువు పరిపాలించేవాడు. ఒకరోజు రాత్రి మాచిరెడ్డికి కలలో కనిపించిన స్వామి ‘మీ గ్రామానికి సమీపంలో ఉన్న కృష్ణానదికి అటువైపునున్న అడవిలో స్వయంవ్యక్తంగా ఉన్నాను’ అని చెప్పాడు. వెంటనే మాచిరెడ్డి తన పరివారంతో ఆ ప్రాంతమంతా వెతికించినా స్వామి జాడ కనిపెట్టలేకపోయాడు. దాంతో మనస్తాపం చెందిన మాచిరెడ్డి ఒక చెట్టుకింద పడుకొని, నిద్రించాడు. కలలో ‘నిన్ను కనిపెట్టలేని బతుకు వృథా! ఇక్కడే తనువు చాలిస్తాన’ని మాచిరెడ్డి చెప్పగా, స్వామి కరుణించి, ‘ఎదురుగా ఆరె చెట్టుపై ఉన్న గరుడపక్షి, ఎగిరి ఎక్కడ వాలితే అక్కడే తాను ఉన్నానని’ చెప్పాడు. నిద్రలోంచి లేచిన మాచిరెడ్డి, గరుడపక్షి వాలిన చోట గుహను తొలగించగా అందులో లక్ష్మీనరసింహస్వామి కనిపించాడు. అప్పటినుండి ఈ ప్రాంతం మహాక్షేత్రంగా విలసిల్లుతోంది. స్వామిని సామాన్య ప్రజలు కూడా సేవించుకోవడానికి వీలుగా స్వామికి ప్రతి నిత్యమూ సకల సేవలూ జరపటానికీ అన్ని ఏర్పాట్లూ చెయ్యటమేగాక, ముఖ మంటపాన్ని కూడా నిర్మింపచేసి ఆలయాభివృద్ధికి కృషి చేశాడు.
తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లా, మట్టపల్లి (Mattapally) గ్రామంలో ఉన్న దేవాలయం. ఈ దేవాలయం రెండవ యాదగిరిగుట్టగా పేరొందింది. చెంచు లక్ష్మీ తాయర్, రాజ్యలక్ష్మి తాయర్, ప్రహ్లాద సహిత యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ప్రధాన దైవం. వెండితో చేసిన కవచం, మీసాలు కలిగి ఉంటాడు .. గుహ బయల్పడకముందు భరద్వాజాది మహర్షులు స్వామివారికి పూజలు చేసేవారని, ఇప్పటికీ కొంతమంది మహర్షులు సూక్ష్మరూపంలో స్వామివారిని దర్శించుకుంటారని స్థల పురాణం చెబుతోంది. కాలక్రమంలో భక్తుల రద్దీ పెరగడంతో గుహకు ఉత్తరం వైపు మరో ద్వారం ఏర్పాటుచేయబడింది. స్వామివారికి ఆరెపత్రితో పూజలు నిర్వహిస్తారు. అన్ని ప్రధాన హిందూ పండుగలు జరుపబడుతాయి భక్తులకు మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం ఉచితంగా అందించబడుతోంది. దేవాలయంలోని శంఖాన్ని చెవి దగ్గర ఉంచుకుంటే, తారం అని పిలువబడే పవిత్రమైన ప్రణవ శబ్దం దాని నుండి ప్రతిధ్వనిస్తుంది..
మట్టపల్లి (Mattapally) క్షేత్రాన్ని యమ మోహిత క్షేత్రం అని కూడా పిలుస్తారు.. ఇక్కడ 32 సార్లు గిరి ప్రదక్షిణ చేసి వేడుకుంటే నరసింహ స్వామి కోరిన కోర్కెలు భూత గ్రహ బాధలు తీరుస్తారని నమ్మకం..పంచ నరసింహ క్షేత్రాల్లో ఒకటి మట్టపల్లి క్షేత్రం మట్టపల్లి నాధం ప్రణతోస్మి నిత్యం నమహ .. అందరూ ఉచ్చరించే లక్ష్మీ నరసింహ నామం ప్రసిద్దము.. ఇక్కడ మరో దేవాలయం శివాలయం.. కోరిన కోర్కెలు తీర్చే దేవుడిగా మహేశ్వరుడు పార్వతి దేవితో కొలువై ఉన్నాడు.
Also Read: Lokesh Yuvagalam: యువగళం హీట్, పెద్దిరెడ్డి ఇలాఖలో లోకేష్ దూకుడు

Related News

Bhadrachalam History: భద్రాచలం శ్రీ రామచంద్ర స్వామి వారి చరిత్ర..!
భద్రుడు అనే మహర్షి శ్రీ రాముడిని ఒక వరం అడిగాడు.అసలు భద్రుడు, ఎవరు అంటే.. మేరు పర్వత రాజుకి 2 కొడుకులు. ఇద్దరూ అసమాన విష్ణు భక్తులు..