HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >Kumbhotsavam Tomorrow In Srisailam

Srisailam: రేపు శ్రీశైలంలో కుంభోత్సవం.. జరిగే పూజలివే

  • By Balu J Published Date - 06:52 PM, Thu - 25 April 24
  • daily-hunt
Srisailam
Srisailam

Srisailam: శ్రీశైలంలో శుక్రవారం భ్రమరాంబాదేవికి కుంభోత్సవం జరుగనున్నది. ప్రతీ సంవత్సరం చైత్రమాసంలో అమ్మవారికి సాత్వికబలిని సమర్పించేందుకు పౌర్ణమి తరువాత వచ్చే మంగళ లేదా శుక్రవారాలలో (ఏరోజు ముందుగా వస్తే ఆ రోజున) ఈ ఉత్సవం నిర్వహించబడుతోంది. ఈ కుంభోత్సవాన్ని పురస్కరించుకుని ప్రాత కాలపూజల అనంతరం శ్రీ అమ్మవారికి ఆలయ అర్చకులు నవావరణపూజ, త్రిశతి, ఖడ్గమాల, అష్టోత్తర శతనామ కుంకుమపూజలను జపపారాయణలను నిర్వహిస్తారు. ఆచారాన్ని అనుసరించి ఈ పూజలన్నీ ఎప్పటివలనే ఏకాంతంగానే జరిపించబడుతాయి.

ఈ పూజాదికాల తరువాత శ్రీభ్రమరాంబాదేవి అమ్మవారికి కొబ్బరికాయలు, నిమ్మకాయలు, గుమ్మడికాయలు మొదటి వాటితో సాత్వికబలిగా సమర్పించబడుతాయి. ఈ సందర్భంగానే హరిహరరాయగోపురద్వారం వద్ద గల మహిషాసురుమర్థిని అమ్మవారికి: కోటమ్మవారికి ప్రత్యేకపూజాదికాలను జరిపించి సాత్మికబలిగానే కొబ్బరికాయలను సమర్పించడం జరుగుతుంది. ఈ ఉత్సవాలలో భాగంగానే సాయంకాలం శ్రీ మల్లికార్జునస్వామివారికి ప్రదోషకాలపూజల అనంతరం అన్నాభిషేకం జరిపించబడుతుంది. ఆనంతరం శ్రీస్వామివారి ఆలయద్వారాలు మూసివేయబడుతాయి.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • devotees
  • karnool
  • special puja
  • srisailam

Related News

Haritha Hotel Srisailam

Srisailam : శ్రీశైలం వెళ్లే భక్తులకు అలర్ట్..ఆ హోటల్ వెబ్‌సైట్‌ ఫేక్?

సైబర్ నేరగాళ్లు శ్రీశైలం హరిత హోటల్ పేరుతో నకిలీ వెబ్‌సైట్‌ను సృష్టించారు. ఈ నకిలీ వెబ్‌సైట్‌ను నమ్మి బెంగళూరుకు చెందిన ఓ పర్యాటకుడు రూ. 15,950 మోసపోయాడు. సైబర్ మోసగాళ్లు ఇచ్చిన ఫేక్ రశీదుతో హోటల్‌కు వెళ్లగా.. సిబ్బంది అది నకిలీది అని చెప్పారు. దీంతో కంగుతున్న పర్యాటకుడు హోటల్ మేనేజర్‌ను కలిశాడు. అయితే ఈ ఫేక్‌ వెబ్‌సైట్‌పై శ్రీశైలం పోలీసులకు ఫిబ్రవరిలోనే ఫిర్యాదు చేసినట

    Latest News

    • IND vs SA : మీరు ఉన్నప్పుడే కదా వైట్‌వాష్ ..అశ్విన్‌కు సునీల్ గవాస్కర్ అదిరిపోయే కౌంటర్!

    • Telangana Global summit 2025 : 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా సీఎం మాస్టర్ ప్లాన్

    • Grama Sarpanch Nomination : తొలిరోజు నామినేషన్లు ఎన్నో తెలుసా?

    • Hyderabad Book Fair : పుస్తక ప్రియులకు గుడ్ న్యూస్.. ‘పుస్తకాల పండుగ’ మళ్లీ వచ్చేస్తోంది

    • ACE Unit : కుప్పంలో రూ.305 కోట్లతో ACE యూనిట్

    Trending News

      • Cricket Matches: 2030 కామన్వెల్త్ క్రీడలు.. క్రికెట్ మ్యాచ్‌లకు వేదిక ఇదేనా?!

      • Biggest Wins In Test Cricket: టెస్ట్ క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజ‌యాలివే!

      • Fibernet Case Against Chandrababu Closed : చంద్రబాబుపై ఫైబర్ నెట్ కేసు క్లోజ్.!

      • Impress Your Crush: మీ క్రష్‌ను ఇంప్రెస్ చేయడం ఎలా?

      • Gautam Gambhir: గౌతమ్ గంభీర్ కోచింగ్‌లో టీమిండియా టెస్ట్ ఫ‌లితాలీవే!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd