Rajya Sabha Polls: రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి ఓటేసిన బీజేపీ ఎమ్మెల్యే
కర్ణాటకలో రాజ్యసభ ఎన్నికల వేళ బీజేపీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్యే ఎస్టీ సోమశేఖర్ క్రాస్ ఓటింగ్ చేశారు. బీజేపీ చీఫ్ విప్ దొడ్డనగౌడ. ఎస్టీ సోమశేఖర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటు వేశారని తెలుస్తుంది.
- Author : Praveen Aluthuru
Date : 27-02-2024 - 7:27 IST
Published By : Hashtagu Telugu Desk
Rajya Sabha Polls: కర్ణాటకలో రాజ్యసభ ఎన్నికల వేళ బీజేపీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ ఎమ్మెల్యే ఎస్టీ సోమశేఖర్ క్రాస్ ఓటింగ్ చేశారు. బీజేపీ చీఫ్ విప్ దొడ్డనగౌడ. ఎస్టీ సోమశేఖర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటు వేశారని తెలుస్తుంది.
కర్ణాటకలోని నాలుగు రాజ్యసభ స్థానాలకు ఓటింగ్ జరిగింది. రాజ్యసభ ఎన్నికల వేళ బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బిజెపి ఎమ్మెల్యే సోమశేఖర్ రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటు వేశారు.ఎస్టీ సోమశేఖర్ క్రాస్ ఓటింగ్ వేసినట్లు బీజేపీ చీఫ్ విప్ పాటిల్ తెలిపారు. క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన ఎమ్మెల్యేపై పార్టీ దృష్టికి తీసుకెళ్లి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.ఓటింగ్‌కు ముందు బీజేపీ ఎమ్మెల్యే ఎస్టీ సోమశేఖర్ మాట్లాడుతూ నా నియోజక వర్గంలో నీరు, ఇతరత్రా నిర్వహణకు డబ్బులు ఇస్తానన్న భరోసా, నమ్మకం కలిగించే వారికే ఓటేస్తానని అన్నారు.ఈ నేపథ్యంలోనే ఆయన తన ఓటును కాంగ్రెస్ కు గుద్దినట్లు తెలుస్తుంది.
కర్ణాటకలోని నాలుగు రాజ్యసభ స్థానాలకు ఐదుగురు అభ్యర్థులు ఉన్నారు. అజయ్ మాకెన్, సయ్యద్ నసీర్ హుస్సేన్ మరియు జి.సి. చంద్రశేఖర్, నారాయణ్ బండే, కుపేంద్ర రెడ్డి పోటీలో ఉన్నారు. కర్ణాటకలో ముగ్గురు కాంగ్రెస్ ఎంపీలు, ఒక బీజేపీ ఎంపీ పదవీ విరమణ చేయడం గమనార్హం.కర్ణాటక అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్య 224. కర్ణాటక అసెంబ్లీలో ప్రతి రాజ్యసభ అభ్యర్థికి కనీసం 45 ఓట్లు అవసరం. 135 మంది ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్ ముగ్గురు అభ్యర్థులను నిలబెట్టగా, 66 మంది ఎమ్మెల్యేలున్న బీజేపీ ఇద్దరు అభ్యర్థులను బరిలోకి దింపింది.
Also Read: Potato Papads: ఎప్పుడైనా బంగాళదుంప అప్పడాలు తిన్నారా.. అయితే సింపుల్గా ఇంట్లోనే చేసుకోండిలా?