HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >Just Chant These Mantras According To Your Date Of Birth

Astrology : మీ పుట్టిన తేదీ ప్రకారం ఈ మంత్రాలు జపిస్తే చాలు..!

  • Author : Vamsi Chowdary Korata Date : 17-11-2025 - 6:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mantras
Mantras

దైవిక శక్తుల ఆశీర్వాదం పొందడానికి, మనం ప్రతిరోజూ పూజ చేసే సమయంలో ఆయా దేవునికి అంకితం చేసిన మంత్రాలను పఠిస్తాము. అయితే.. ఏడాదిలో ఏ నెలలో అయినా ఏ తేదీన జన్మించిన వారు ఏ దేవుడి మంత్రాలను పఠించాలి.? పుట్టిన తేదీ ప్రకారం ఏ దేవుడిని పూజించాలి.? ఆ మంత్రాలను పఠించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి వంటి విషయాలను తెలుసుకుందాం..

హిందు సంప్రదాయం ప్రకారం దైవిక మంత్రాలలో అద్భుతమైన శక్తి దాగి ఉంటుందని నమ్మకం. మంత్ర జపం వల్ల మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెరగడం, ఒత్తిడి తగ్గడం, అంతర్గత శక్తితో అనుసంధానం ఇలా అనేక ప్రయోజనాలు ఉంటాయి. అలాగే మంత్రాలను జపించడం ద్వారా అనేక సమస్యల నుంచి బయటపడొచ్చు. అంతే కాకుండా మంత్రాలను జపించడం వల్ల ఇబ్బందులను అధిగమించే శక్తి, ఆత్మవిశ్వాసం, ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయని విశ్వాసం. ఈ క్రమంలో ఆయా పుట్టిన తేదీలను బట్టి ప్రతి రోజూ జపించాల్సిన మంత్రాలు ఏంటో తెలుసుకుందాం..

ఏ సంవత్సరంలో అయినా ఏ నెలలోనైనా 1, 10, 19, 29 తేదీలలో జన్మించినట్లయితే ఆ వ్యక్తికి శివుడి ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఈ నాలుగు తేదీల్లో జన్మించిన వాళ్లు శివుడికి అంకితం చేయబడిన అతి ముఖ్యమైన పంచాక్షర మంత్రం ‘ఓం నమః శివాయ’ అనే మంత్రాన్ని జపించాలి. ఇది శివుడి ఆశీస్సులు ఉండేలా తోడ్పడుతుంది. అలాగే అంతర్గత బలాన్ని, పరివర్తనను ప్రోత్సహించడంలో కూడా సహాయపడుతుంది.

ఏడాదిలో ఏ నెలలోనైనా 2, 11, 20, 29 తేదీల్లో జన్మించినట్లయితే వీళ్లకు లక్ష్మీదేవి ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయట. ఈ తేదీల్లో జన్మించిన వాళ్లు లక్ష్మీదేవిని పూజించాలి. అలాగే లక్ష్మీదేవి మంత్రాలు పఠించాలి. వాటిలో ప్రధానమైన ‘ఓం హ్రీం శ్రీం లక్ష్మీభ్యో నమః’ అనే లక్ష్మీ మంత్రాన్ని ప్రధానంగా జపించాలి. ఈ లక్ష్మీ మంత్రాన్ని జపించడం ద్వారా ఆర్థిక సమస్యలు, కష్టాల నుంచి బయటపడొచ్చు.

ఏడాదిలో ఏ నెలలోనైనా 3, 12, 21, 30 తేదీల్లో జన్మించిన వారికి శ్రీమహావిష్ణువు అనుగ్రహం ఉంటుందట. ఈ తేదీలలో జన్మించిన వాళ్లు శ్రీమహావిష్ణువును పూజించాలి. ఈ తేదీల్లో జన్మించిన వాళ్లు శ్రీమహావిష్ణువు ఆశీర్వాదాలను పొందడానికి ‘ఓం నమో భగవతే వాసుదేవాయ నమః’ అనే విష్ణు మంత్రాన్ని జపించాలి. ఈ విష్ణు మంత్రం జ్ఞానం, ఆధ్యాత్మికతను పెంపొందిస్తుంది.

ఏడాదిలో ఏ నెలలో అయినా 4, 13, 22, 31 తేదీల్లో జన్మించినట్లయితే వాళ్లకు శివుడి ఆశీర్వాదం పొందుతారని చెబుతారు. కాబట్టి ఈ తేదీల్లో జన్మించిన వాళ్లు నిత్యం శివ పూజ చేయాలి. అలాగే శివుడికి ప్రీతికరమైన శివ మహామృత్యుంజయ మంత్రం ‘ఓం త్రయంబకం యజామహే, సుగంధిం పుష్టివర్ధన, ఉర్వారుకమివ బంధనమ్‌, మృత్యోర్ముక్షీయ మామృతాత్’ జపించాలి. ఈ మంత్రం జపించడం వల్ల మంచి ఆరోగ్యం కలుగజేస్తుంది. మృత్యుభయం పోగొడుతుంది.

ఏడాదిలో ఏ నెలలోనైనా 5, 14, 23 తేదీలలో జన్మించినట్లయితే.. వీళ్లు గణేశుడిని ఎక్కువగా పూజించాలి. ముఖ్యంగా బుధవారం రోజు వినాయకుడి పూజ చేయాలి. ఈరోజున వినాయకుడి గరిక సమర్పించడం కూడా అత్యంత శుభప్రదం. అలాగే.. గణేశ్‌ మంత్రాలను జపించాలి. ప్రధానంగా ‘ఓం గం గణపతయే నమః’ అనే గణేశ మంత్రాన్ని జపించడం శుభ ఫలితాలను ఇస్తుంది.

ఏడాదిలో ఏ నెలలోనైనా 6, 15, 24 తేదీల్లో పుట్టిన వాళ్లకి శ్రీకృష్ణుడి ఆశీస్సులు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి వీళ్లు శ్రీకృష్ణుడికి పూజ చేయడాలి. అలాగే శ్రీకృష్ణుడి మంత్రాలను నిత్యం జపించాలి. వీళ్లు శ్రీకృష్ణుడిని ప్రసన్నం చేసుకోవడానికి ‘ఓం క్లీం కృష్ణాయ నమః’ అనే మంత్రాన్ని జపించాలి. ఈ శ్రీకృష్ణుడి శక్తివంతమైన మంత్రాన్ని జపించడం వల్ల అంతర్గత శక్తి, ఆధ్యాత్మిక చింతన, జీవితంలో సానుకూలత పెరుగుతుంది.

ఏడాదిలో ఏ నెలలో అయినా 7, 16, 25 తేదీల్లో జన్మించిన వ్యక్తులకు కూడా వినాయకుడి ఆశీస్సులు లభిస్తాయి. ఈ తేదీల్లో జన్మించిన వారిపై గణేశుడి ఆశీస్సులు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. కాబట్టి వీళ్లు గణపతి మంత్రాలను నిత్యం జపించాలి. ముఖ్యంగా ‘ఓం శ్రీ గణేశాయ నమః’ అనే విఘ్నేశ్వరుడి మంత్రాన్ని జపించాలి. ఈ మంత్రాన్ని ఏదైనా కొత్త పని ప్రారంభించే ముందు, పూజ చేసే సమయంలో పఠించాలి. ఈ మంత్రం జపించడం వల్ల పనిలో ఎదురయ్యే అడ్డంకులు తొలగించి.. విజయం, శ్రేయస్సు లభిస్తాయని విశ్వాసం.

ఏడాదిలో ఏ నెలలో అయినా 8, 17, 26 తేదీలలో జన్మించిన వాళ్లు హనుమంతుని భక్తులు. వీళ్లకు ఆంజనేయ స్వామి ఆరాధ్య దైవం. ఈ తేదీలలో జన్మించిన వాళ్లు నిత్యం ఆంజనేయ స్వామిని పూజించాలి. అలాగే ఆంజనేయ స్వామి మంత్రాలను కూడా జపించాలి. ముఖ్యంగా ఈ 3 తేదీలలో జన్మించిన వాళ్లు ‘ఓం హాం హనుమతే నమః’ అనే శక్తివంతమైన ఆంజనేయ స్వామి మంత్రాన్ని జపించాలి. ఈ మంత్రాన్ని జపించడం వల్ల బలం, ధైర్యం పెంపొందుతాయి. ఈ మంత్రాన్ని సూర్యోదయం లేదా సూర్యాస్తమయం సమయంలో జపించడం శుభప్రదం.

ఏడాదిలో ఏ నెలలోనైనా 9, 18, 27 తేదీలలో జన్మించిన వాళ్లు శ్రీరాముని అనుగ్రహం పొందుతారు. కాబట్టి వీళ్లు నిత్య పూజా విధానంలో శ్రీరాముడిని పూజించే అలవాటును కూడా పెంపొందించుకోవాలి. అలాగే శ్రీరాముడికి అంకితం చేయబడిన అతి ముఖ్యమైన ‘ఓం శ్రీ రామాయ నమః’ అనే మంత్రాన్ని కూడా జపించాలి. ఈ రామ మంత్రాన్ని జపించడం వల్ల శాంతి, ఆనందరం కలుగుతాయని ధైర్యం పెరుగుతుందని.. శ్రీరాముడి నుంచి రక్షణ లభిస్తుందని నమ్మకం.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • astrology
  • health benefits
  • mantras

Related News

What are antioxidants? How do they work?

యాంటీఆక్సిడెంట్లు అంటే ఏమిటి? అవి ఎలా పనిచేస్తాయి?

ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల్య ఆహారం తప్పనిసరి. శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకాల్లో యాంటీఆక్సిడెంట్లు కూడా ఒకటి. ఇవి శరీరంలో ఏర్పడే హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను ఎదుర్కొని, కణాలను రక్షించే శక్తివంతమైన అణువులు.

  • Lucky Zodiac Sign

    కొత్త సంవ‌త్స‌రం.. ఈ రాశుల వారికి అదృష్టం!

  • Meena

    2026లో మీనరాశి జాతకంలో చేయాల్సిన పరిహారాలు ఇవే !

  • Kumbha

    2026లో కుంభరాశి జాతకంలో చేయాల్సిన పరిహారాలు ఇవే !

  • Makara

    2026లో మకరరాశి జాతకంలో చేయాల్సిన పరిహారాలు ఇవే !

Latest News

  • శ్రేయస్ అయ్యర్‌కు మరోసారి ఎదురుదెబ్బ !

  • తైవాన్‌పై చైనా దూకుడు.. అమెరికా ఎందుకు తలదూర్చుతోంది?

  • అమరావతి రెండో దశ ల్యాండ్ పూలింగ్ షురూ

  • అశ్విన్ షాకింగ్ కామెంట్స్.. టీ20 వరల్డ్ కప్ 2026 ఎవడూ చూడడు

  • ఏపీకి సోనియా గాంధీ, రాహుల్

Trending News

    • గోరఖ్‌పుర్‌ నుంచి మంచిర్యాలకు.. రైలు ఇంజిన్‌పై దాక్కుని ప్రయాణిస్తున్న ఓ యువకుడు

    • యూట్యూబర్ నా అన్వేష్‌కు ఉగ్రెయిన్ మహిళ వార్నింగ్..

    • రవితేజ-వివేక్ ఆత్రేయ కాంబోలో హారర్ థ్రిల్లర్?

    • కొత్త సంవ‌త్స‌రం రోజే అమెరికాకు బిగ్ షాక్‌!!

    • ఫిబ్ర‌వరి 1 నుండి భారీగా పెర‌గ‌నున్న ధ‌ర‌లు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd