Makar Sankranti : మకర సంక్రాంతి జనవరి 14వ తేదీనా? 15వ తేదీనా?
ఈసారి మకర సంక్రాంతిని ఏ రోజున జరుపుకుంటారు? జనవరి (January) 14వ తేదీనా ? లేదా 15వ తేదీనా ?
- Author : Vamsi Chowdary Korata
Date : 10-01-2023 - 9:50 IST
Published By : Hashtagu Telugu Desk
ఈసారి మకర సంక్రాంతిని (Makar Sankranti) ఏ రోజున జరుపుకుంటారు? జనవరి 14వ తేదీనా ? లేదా 15వ తేదీనా ? అనే దానిపై ఇప్పుడు హాట్ డిస్కషన్ నడుస్తోంది. వివరాల్లోకి వెళితే.. గ్రహాల రాజు అయిన సూర్యుడు ఈ సంవత్సరం జనవరి 14న మధ్యాహ్నం 2.53 గంటలకు ధనుస్సు రాశిని వదిలి మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. కాబట్టి ఉదయ తిథి ప్రకారం మకర సంక్రాంతిని ఈసారి జనవరి 15న ఆదివారం జరుపుకుంటారు. జనవరి 15న మధ్యాహ్నం వరకు సంక్రాంతి ఉంటుంది. మకర సంక్రాంతి (Makar Sankranti) నాడు సూర్య భగవానుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి వెళ్తాడు. దీనితో దేవతల రోజు ప్రారంభమవుతుంది ఖర్మలు ముగుస్తాయి. శుభ కార్యాలు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతాయి.
సంక్రాంతి (Sankranti) వేళ ఏం చేయాలంటే:
🍯 జనవరి 15న సంక్రాంతిని పురస్కరించుకుని మధ్యాహ్నం వేళ దానం వల్ల ప్రత్యేక పుణ్యం లభిస్తుంది.
🍯 ఈ రోజున ఉదయించే సూర్యుడికి అర్ఘ్యం సమర్పించే సంప్రదాయం ఉంది.
🍯 మకర సంక్రాంతి రోజున, పవిత్ర నదులలో స్నానమాచరించే సంప్రదాయం ఉంది. స్నానం చేసిన తర్వాత, సూర్యుడికి అర్ఘ్యం సమర్పిస్తారు.
🍯 ఈ రోజున ఉదయం 7:15 నుంచి సాయంత్రం 5:46 వరకు శుభ ముహూర్తాలు ఉంటాయి. ఈ ముహూర్తంలో దానధర్మాలు చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు.
🍯 స్నానం చేసిన తర్వాత ఈ రోజు దానం చేస్తే, అది అనేక విధాల ఫలితాలను ఇస్తుంది.
🍯 ఈ రోజు చాలా పవిత్రమైనది. ఎందుకంటే సూర్యుడు తన కుమారుడైన శనిని కలుస్తాడు.
🍯 ఈ రోజున శుక్ర గ్రహం కూడా ఉదయిస్తుంది.
🍯 ఈ రోజున స్నానం చేసేటప్పుడు నల్ల నువ్వులలో గంగాజలం కలపడం శుభప్రదంగా భావిస్తారు. వీటివల్ల జాతకంలో ఉన్న గ్రహదోషాలు కూడా ముగుస్తాయి.
శని దోషం పోవాలంటే:
🌞 ఈ రోజున సూర్యపూజతో పాటు, శని బాధలు తొలగిపోవడానికి కొన్ని చర్యలు తీసుకోవాలి.
🌞 ఈ రోజున మినప పప్పు శని దేవుడికి సంబంధించినదిగా పరిగణించబడుతుంది. శని దోషం నుంచి విముక్తి పొందాలంటే మకర సంక్రాంతి రోజున మినప పప్పును దానం చేయాలి.
🌞 నువ్వులను దానం చేయడం ద్వారా శని దోషం కూడా తొలగిపోతుందని నమ్మకం.
🌞 దుప్పటిని దానం చేయడం కూడా ఫలవంతంగా పరిగణించ బడుతుంది. ఇది రాహు దోషాన్ని తొలగిస్తుంది.
Also Read: Sankranti Bommala Koluvu 2023 : సంక్రాంతికి బొమ్మల కొలువు ఎందుకు పెడతారు?