HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >Is It Mandatory To Receive The Holy Water And Offerings At The Temple

గుడిలో తీర్థ ప్రసాదాలు తప్పనిసరిగా తీసుకోవాలా ?

  • Author : Vamsi Chowdary Korata Date : 21-12-2025 - 4:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Temple
Temple

Theertham : గుడికి వెళ్లి దైవదర్శనం చేసుకున్న తరువాత, తీర్థప్రసాదాలు కళ్లకి అద్దుకుని స్వీకరించడం జరుగుతుంది. తీర్థప్రసాదాలు తీసుకోవడం వల్లనే ఆలయ దర్శనం యొక్క ఫలితం పరిపూర్ణంగా లభిస్తుందని భావిస్తుంటారు. తీర్థప్రసాదాలు అనేవి ఆయా ప్రాంతాలను బట్టి మారుతూ వుంటాయి.

కొన్ని ప్రాంతాల్లో తులసినీరు … కోనేటినీరు … పాలు … పానకం … అభిషేకం చేయబడిన పంచామృతాలు తీర్థంగా ఇస్తుంటారు. ఇక గురువాయూర్ లో నువ్వుల నూనెను తీర్థంగా ఇస్తుంటారు. ఇక తిరుమల … శ్రీ కాళహస్తి … శిరిడీ … పూరీ … శబరిమలై వంటి క్షేత్రాల్లో ప్రసాదం ప్రత్యేకతను సంతరించుకుని వుంటుంది.

ఇలా ప్రాంతాలు దాటుకుని వెళుతున్నాకొద్ది అక్కడి పద్ధతిని అనుసరిస్తూ తయారు చేయబడిన తీర్థప్రసాదాలు కొత్తగా అనిపిస్తూ వుంటాయి. అయితే కొందరు ఆ తీర్థ ప్రసాదాలను అదోలా చూడటం … వాటిని తీసుకోకుండానే రావడం చేస్తుంటారు. ఇంకొందరు అయిష్టంగా తీర్థం తీసుకుని … పరిచయంలేని రుచి కావడం వలన ప్రసాదాలను కొంచెం తిని మిగతాది పారేస్తుంటారు.

ఈ విధంగా చేయడం ఆ క్షేత్రాన్ని … అక్కడి దైవాన్ని అవమానపరిచినట్టు అవుతుంది. అలా వ్యవహరించినందుకు దోషాన్ని మూటగట్టుకో వలసి వస్తుంది. అందువలన తీర్థ ప్రసాదాల విషయంలో ఆయా ప్రాంతాల పద్ధతులను దృష్టిలో పెట్టుకుని, భక్తి శ్రద్ధలతో స్వీకరించడం చేయాలి. అప్పుడే భగవంతుడు అనుగ్రహిస్తాడు … తన దర్శన ఫలితాన్ని అందజేస్తాడు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hindutemple
  • temple
  • Temple Theertham
  • theertham

Related News

    Latest News

    • మరో ఉద్యమానికి బిఆర్ఎస్ సిద్ధం అవుతుందా ?

    • నేడే పల్స్ పోలియో..తల్లిదండ్రులు అస్సలు నిర్లక్ష్యం చేయకండి

    • వచ్చే ఏడాది ఇళ్ల ధరలు 5+ శాతం పెరిగే ఛాన్స్!

    • ప్రమాదానికి గురైన బాలీవుడ్ హాట్ బ్యూటీ

    • అసిడిటీకి యాంటాసిడ్స్‌నే పరిష్కారమా? వైద్యుల హెచ్చరికలు ఇవే..!

    Trending News

      • అభిషేక్ శర్మ రికార్డు బద్దలు కొట్టిన పాండ్యా!

      • 10 గ్రాముల బంగారం ధర రూ. 40 ల‌క్ష‌లా?!

      • ఆ కార్యక్రమంలో అవినీతి.. ప్రధాని మోదీపై జగన్ ఆరోపణలు!

      • అధిక ఐక్యూ ఉన్న వ్యక్తుల 5 ముఖ్యమైన అలవాట్లు ఇవే!

      • ఆర్‌బీఐ అన్‌లిమిటెడ్ నోట్లను ముద్రిస్తే ఏమ‌వుతుందో తెలుసా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd