Shani Jayanti 2023 : శనిదేవుడిని బర్త్ డే రోజు.. ఇలా ఇంప్రెస్ చేయండి
సూర్య భగవానుడి కుమారుడే శని దేవుడు (Shani Jayanti 2023). ఆయన ఆశీర్వాదం పొందిన వ్యక్తి ఒక చిన్నస్థాయి నుంచి కూడా రాజుగా ఎదుగుతాడని అంటారు. ఇక ఎవరిపై అయినా శని దేవుడి వక్రదృష్టి పడితే.. రాజు నుంచి బిచ్చగాడిగా మారిపోతాడని చెబుతారు.
- By Pasha Published Date - 04:53 PM, Tue - 9 May 23
సూర్య భగవానుడి కుమారుడే శని దేవుడు (Shani Jayanti 2023). ఆయన ఆశీర్వాదం పొందిన వ్యక్తి ఒక చిన్నస్థాయి నుంచి కూడా రాజుగా ఎదుగుతాడని అంటారు. ఇక ఎవరిపై అయినా శని దేవుడి వక్రదృష్టి పడితే.. రాజు నుంచి బిచ్చగాడిగా మారిపోతాడని చెబుతారు. జాతకచక్రంలో శని దోషం కలిగిన వ్యక్తి తన జీవితంలో అసమ్మతిని, బాధలను ఎదుర్కోవాల్సి వస్తుంది. శనిదేవుడి జయంతి (Shani Jayanti 2023) ఈసంవత్సరం మే 19న వస్తోంది. ఏటా వైశాఖ మాసం అమావాస్య రోజున శనిదేవుడి పుట్టినరోజు (Shani Jayanti 2023) జరుపుకుంటారు. ఈ రోజున చేసే శని పూజకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది.
తడి బట్టలలో నిలబడి.. గిన్నెలో నూనె వేసి..
ప్రత్యేకించి కుండలిలో శని దోషం ఉన్నవారు మే 19న (Shani Jayanti 2023) శని దేవుడిని పూజించి ప్రసన్నం చేసుకోవచ్చు. ఇందుకోసం శని దేవుడికి ఆవాల నూనెను సమర్పించాలి. ఈరోజున స్నానం చేసిన తర్వాత తడి బట్టలలోనే నిలబడి ఒక గిన్నెలో నూనె వేసి, దానిలో ముఖాన్ని చూసుకోవాలి. ఆ తరువాత ‘ఓం శన్ శనైశ్చరాయ నమః’ అనే మంత్రాన్ని జపిస్తూ పూర్తి భక్తి విశ్వాసంతో ఆవాల నూనెను శని దేవుడికి సమర్పించి ఏడు సార్లు ప్రదక్షిణలు చేయాలి. ఈ పరిహారం చేయడం ద్వారా శనిదోషం వల్ల వెంటాడుతున్న కష్టాలు, ఏలినాటి శని వలన కలిగే బాధలు త్వరగా తొలగిపోతాయని.. శని దేవుడి అనుగ్రహం కురుస్తుందని నమ్ముతారు. అనంతరం శనీశ్వరుడు తండ్రి అనగా సూర్యదేవుడిని పూజిస్తూ రాగి పాత్రతో ఆయనకు అర్ఘ్యం సమర్పించండి.
also read : Stay Away From These Habits : ఈ 6 అలవాట్లు అంటే శని దేవుడికి కోపం.. వీటికి దూరంగా ఉండండి
ఆలయానికి వెళ్లి..
ఈరోజున శనిదేవుడిని దర్శించుకుంటే ఇంకా మంచిది. శని దేవుడి ఆలయానికి వెళ్లి ఆవాల నూనె, నీలం పువ్వులు, నల్ల నువ్వులను సమర్పించండి. శని దేవుడికి ఆవాల నూనె దీపం వెలిగించి ‘ఓం శన్ శనైశ్చరాయ నమః’ మంత్రాన్ని జపించండి. వీలైతే మన దేశంలోని పవిత్ర శని ధామాన్ని సందర్శించి పూజలు చేయండి. మహారాష్ట్రలోని శని శింగనాపూర్ ఆలయం, తమిళనాడులోని తిరునల్రు ఆలయం, ఉత్తరప్రదేశ్లోని మధురలో ఉన్న కోకిలవన్ ధామ్ శని దర్శనానికి చాలా పవిత్రమైనవిగా భావిస్తారు.
శనిదోషం రాకుండా ఉండాలంటే ..
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని దోషాన్ని నివారించడానికి ఒక వ్యక్తి శనివారం నాడు బూట్లు, చెప్పులు కొనకూడదు. అలాగే ఎవరి నుంచి కూడా చెప్పులను బహుమతిగా తీసుకోకూడదు. శని ఆగ్రహానికి గురికాకుండా ఉండాలంటే.. పొరపాటున కూడా ఏ బలహీనుడిని వికలాంగుడిని హింసించకూడదు.
Related News
Lord Shani: స్త్రీలు శని దేవుడికి పూజ చేసేటప్పుడు పొరపాటున కూడా ఈ తప్పులు అస్సలు చేయకండి?
నవగ్రహాలలో ఒకటైన శని గ్రహం గురించి మనందరికీ తెలిసిందే. శని దేవుడిని న్యాయానికి ప్రత్యేకగా భావిస్తారు. అంటే మనం చేసే మంచి చెడుపనులను బట్టి మం