HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >Important Vastu Tips For House

Devotional: ఏంటి.. మనం చేసే ఈ చిన్న తప్పులే పేదరికానికి కారణం అవుతాయా?

మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు తప్పులే మనం ఎదురుకునే పేదరికానికి కారణం కావచ్చు అంటున్నారు పండితులు. మరి ఎలాంటి తప్పులు చేయకూడదు అన్న విషయానికొస్తే..

  • Author : Anshu Date : 23-01-2025 - 10:40 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Devotional
Devotional

ప్రతి ఒక్కరూ వాస్తు విషయాలను పాటించడం తప్పనిసరి. ఎందుకంటే వాస్తు విషయాలను పాటించకపోతే అవి మనిషి జీవితంపై చాలా ప్రభావాన్ని చూపిస్తాయి.. మనం ఎదుర్కొనే ఆర్థిక ఇబ్బందులు మానసిక ఇబ్బందులకు కొన్ని కొన్ని సార్లు వాస్తు విషయాలు కూడా కారణం కావచ్చు. అందుకే వాస్తు విషయాలను తూచా తప్పకుండా పాటించాలని పండితులు చెబుతూ ఉంటారు.. కొంతమంది ప్రతి ఒక విషయంలోనూ వాస్తు విషయాన్ని నమ్ముతూ ఉంటారు. ఎలాంటి పని మొదలుపెట్టినా కూడా వాస్తు విషయాలను ఫాలో అవుతూ ఉంటారు.

స్థలం కొనుగోలు చేయడం నుంచి ఇంట్లో చెప్పుల స్టాండ్ అమరిక వరకు ప్రతి ఒక్క విషయంలో వాస్తు విషయాలను పాటిస్తూ ఉంటారు. అయితే తెలియక చేసే కొన్ని తప్పిదాలు వాస్తు దోషానికి దారి తీస్తాయట. చాలా మంది ఇళ్లలో పనికిరాని వస్తువులను అలాగే ఉంచుతుంటారు. ఇలా ఉంచడం వల్ల ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ వస్తుందట. జీవితంలో ఎన్నో అడ్డంకులు వస్తాయి. అవి ఎప్పటికీ తీరవట. ఒకదాని వెనక మరొకటి అవరోధం మనస్సును అశాంతి, నిరాశతో నింపుతాయట. అలాంటప్పుడు ఇంటి వాస్తుపై శ్రద్ధ పెట్టడం మంచిది. ఇంటి వంటగది కుటుంబ సభ్యుల ఆరోగ్యం, ఆర్థిక స్థితికి సంబంధించినది.

గ్యాస్ స్టవ్‌ ను ఎప్పుడూ మురికిగా ఉంచకూడదట. ఇలా ఉంచడం వల్ల ఆర్థిక సమస్యలు ఎదురుకావచ్చని చెబుతున్నారు. అలాగే ఇంట్లో అగరబత్తిని వెలిగించడం ద్వారా గదుల నుండి ప్రతికూల శక్తిని తొలగించవచ్చట. వాస్తు ప్రకారం ఇలా చేయడం వల్ల మంచి నిద్ర వస్తుందట. అలాగే వాస్తు ప్రకారం కిటికీలు లేదా తలుపులపై సెలెనైట్ రాళ్లను ఉంచడం వల్ల ఇంట్లో బయటి నుండి వచ్చే ప్రతికూల శక్తిని ఆపుతాయట. ఇంట్లో అనవసరమైన వస్తువులు ప్రతికూల శక్తిని సృష్టిస్తాయి. కాబట్టి ఇంట్లో ఉంచిన ఉపయోగించని వస్తువులను తొలగించడం మంచిది. ఇంటికి ఈశాన్య దిక్కు చాలా శుభప్రదం. ఈ దిక్కున దేవుడు కొలువై ఉంటాడని అంటారు. వాస్తు ప్రకారం, ఈశాన్య కోణం నుండి బరువైన వస్తువులను తొలగించండం మంచిది. అదేవిధంగా ఇంట్లో తుప్పు పట్టిన వస్తువులు, జంక్ వస్తువులను తొలగించాలి. తుప్పు పట్టిన పదార్థాలు ప్రతికూల శక్తిని వేగంగా ఆకర్షిస్తాయి.ఆగిపోయిన గడియారం , విరిగిన పాత్ర మొదలైనవి ఉంటే వెంటనే ఇంట్లో నుంచి తీసివేయండి. ఎందుకంటే వాస్తు ప్రకారం, ఆగిపోయిన గడియారం లేదా ఇంట్లో ఉంచిన విరిగిన పాత్రలు ఇంటికి ఆర్థిక సమస్య లేదా పేదరికాన్ని తెస్తాయని చెబుతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • devotional
  • Poor
  • Spirtual
  • Vasthu Tips

Related News

Hanuman Jayanti 2026

Hanuman Jayanti: హనుమంతుడిని పూజిస్తే అన్ని విజయాలే!

ఆంజనేయుని బలం అనంతం. ఆయన శక్తికి, ధైర్యానికి మారుపేరు. ఆపద సమయంలో ఆంజనేయుని స్మరిస్తే చింతలు, సమస్యలు సమసిపోతాయి. ఆంజనేయుని నమ్ముకుంటే మనసు నిబ్బరంగా ఉంటుంది. దెయ్యాలు, భూతాలు లాంటి భయాలు, భ్రమలు కలిగినప్పుడు హనుమంతుని నామం తలచుకుంటే సత్వర ఫలితం ఉంటుంది. కొన్ని ఆలయాలలో రామునితో పాటు హనుమంతుడు కూడా కొలువై భక్తులను అనుగ్రహిస్తుంటాడు. హనుమంతుని వీరాంజనేయుడు, యోగాంజనేయు

  • PM Modi at Somnath Amrut Mahotsav

    Somnath Temple: సోమనాథ్ అమృత్ మహోత్సవంలో ప్రధాని మోదీ

  • Rudraksha

    Rudraksha: జీవితంలో కష్టాల నుంచి బయటపడేందుకు మీ రాశి ప్రకారం ఏ రుద్రాక్ష ధరించాలో తెలుసుకోండి?

Latest News

  • Cm Vijay: స్టాలిన్‌ ఇంటికి CM విజయ్‌!

  • Keerthana: సర్టిఫికెట్ మర్చిపోయిన మంత్రి కీర్తన.. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం వాయిదా..

  • Chandrababu Naidu: కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌తో కీలక భేటీ : చంద్రబాబు

  • CM Vijay: సీఎంగా విజయ్ నెల జీతం ఎంతో తెలుసా?

  • POCSO Case: బండి భ‌గీర‌థ్‌ కేసుపై సీఎం రేవంత్ సీరియస్

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd