TTD: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, అర్జిత సేవ టికెట్లు విడుదల
జనవరి నెలలో అంగప్రదక్షిణ కోటా టోకెన్‌లను ఈ నెల 23వ తేదీ ఉదయం 20 గంటలకు విడుదల చేయనున్నారు.
- By Balu J Published Date - 02:46 PM, Wed - 18 October 23

TTD: తిరుమల శ్రీవారి అర్జిత సేవలను జనవరి నెలలో నిర్వహించుకోవాలని వేచి చూస్తున్న భక్తులకు తితిదే శుభవార్త చెప్పింది. సుప్రభాతం, తోమాల, అర్జన, అష్టదళ పాదపద్మారాధన తదితర ఆర్జిత సేవలకు రిజిస్ట్రేషన్ సేవలు ప్రారంభమయ్యాయి. నేటి నుంచి 20వ తేదీ వరకు 9.59 గంటల వరకు ఈ ఆర్జిత సేవాల కోసం తమ పేర్లను ఆధార్ నంబరు సాయంతో బుక్ చేసుకోవచ్చు. టీటీడీ దేవస్థానమ్స్ యాప్ నుంచి కానీ, తితిదే అధికారిక బుకింగ్ పోర్టల్ నుంచి కానీ బుక్ చేసుకోవచ్చు.
లక్కీడీప్‌లో ఎంపికైన భక్తులకు 20వ తేదీ సమాచారం వస్తుంది. ఎంపికైన భక్తులు 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల్లోపు ఫీజులు చెల్లించాల్సి తమ ఆర్జిత సేవలను ఖరారు చేసుకోవాలి. ఇక జనవరి నెలకు సంబంధించి కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవల కోసం ఈ నెల 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు.
జనవరి నెలలో అంగప్రదక్షిణ కోటా టోకెన్‌లను ఈ నెల 23వ తేదీ ఉదయం దాదాపు 10 గంటలకు విడుదల చేయనున్నారు. ఇక జనవరి నెలకు సంబంధించి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లను ఈ నెల 24వ తేదీ ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. వృద్ధులు, దివ్యాంగులు కోటా దర్శన టిక్కెట్లను 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి బుక్ చేసుకోవచ్చు.