Travancore Temple Board : అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. రూ.5 లక్షల ఉచిత బీమా
Travancore Temple Board : ఈ బీమా పథకం భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న నిర్ణయం. నవంబర్ చివరి నుండి ప్రారంభమయ్యే యాత్రా సీజన్ కోసం బోర్డు అన్ని సన్నాహాలు పూర్తి చేసుకుంది
- By Sudheer Published Date - 10:56 AM, Sun - 3 November 24

శబరిమల(Sabarimala)లో ఈ ఏడాది అయ్యప్ప స్వామిని దర్శించుకునే భక్తులందరికీ (Ayyappa devotees) రూ.5 లక్షల ఉచిత బీమా (Rs.5 lakh free Insurance) అందించాలని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు (Travancore Temple Board) నిర్ణయించింది. ఈ బీమా పథకం భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని తీసుకున్న నిర్ణయం. నవంబర్ చివరి నుండి ప్రారంభమయ్యే యాత్రా సీజన్ కోసం బోర్డు అన్ని సన్నాహాలు పూర్తి చేసుకుంది. భక్తులకు సౌకర్యాలు అందించడానికి సన్నిధానం, పంబ, అప్పచ్చిమేడు, నీలక్కల్ వంటి ప్రదేశాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు. గుండె సంబంధిత అత్యవసర వైద్య చికిత్సలు అందించేందుకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేయబడ్డాయి. యాత్ర సమయంలో భక్తులకు అవసరమైన అన్ని రకాల సేవలు సమకూర్చేందుకు బోర్డు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. భక్తుల ఆరోగ్యం, భద్రతను కాపాడేందుకు ఈ ఉచిత బీమా పథకం ఎంతో ముఖ్యమని ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు భావిస్తోంది.
ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు విషయానికి వస్తే.. కేరళ రాష్ట్రంలోని శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయానికి సంబంధించిన నిర్వహణకు సంబదించిన బోర్డు ఇది. 1950లో ఈ బోర్డు ను స్థాపించారు. ఆలయాన్ని, అర్చకులను, పూజారుల నియామకాన్ని, భక్తులకు అందించే సేవలను నిర్వహించడానికి మరియు అభివృద్ధి చేయడంలో ఈ బోర్డు కీలక పాత్ర పోషిస్తుంది.
బోర్డు యొక్క ప్రధాన విధులు చూస్తే.. ఆలయ యొక్క దినచర్యలను నిర్వహించడం, పూజా కార్యక్రమాలు, పండుగలు, మరియు ఇతర ప్రత్యేక కార్యక్రమాలను అమలు చేయడం. భక్తులకు ఉత్తమ సేవలు అందించడానికి, యాత్రా సీజన్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేయడం, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం వంటి చర్యలు తీసుకుంటుంది. అలాగే భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఉచిత బీమా పథకాలు, ఆరోగ్య పరిరక్షణ పథకాలు వంటి కార్యక్రమాలు ప్రారంభించడం , వాటిని అమలు చేయడం వంటివి చేస్తుంది. అంతే కాకుండా ఆలయ పరిసర ప్రాంతాల్లో మౌలిక వసతులను అభివృద్ధి చేయడం, స్థానిక గ్రామాలకు మద్దతు ఇవ్వడం, ఆలయానికి సంబంధించిన నిధుల సమీకరణ, బహుమతులు, నిధులు మంజూరు చేయడం చేస్తుంటుంది.
Read Also : Yogi Adityanath : ‘బాబా సిద్దిఖీలాగే సీఎం యోగిని చంపేస్తాం’.. బెదిరింపు మెసేజ్ కలకలకం