HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >Ex Cs Lv Subrahmanyam Fires On Ycp Over Ghee Scam

పొరపాటుగా చేసిన కల్తీ కాదు..కావాలని చేసిన పాపం – ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో జరిగిన కల్తీ కేవలం పొరపాటు కాదు, అది పక్కా ప్రణాళికతో జరిగిన 'నేరపూరిత కుట్ర' అని టీటీడీ పూర్వ ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం సంచలన వ్యాఖ్యలు చేశారు

  • Author : Sudheer Date : 07-02-2026 - 12:05 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
పొరపాటుగా చేసిన కల్తీ కాదు..కావాలని చేసిన పాపం - ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం
పొరపాటుగా చేసిన కల్తీ కాదు..కావాలని చేసిన పాపం - ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం

Ex CS LV Subrahmanyam Fires On YCP Over Ghee Scam : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో జరిగిన కల్తీ కేవలం పొరపాటు కాదు, తిరుమల లడ్డూ ప్రసాదం నెయ్యి కల్తీ వ్యవహారంపై టీటీడీ పూర్వ ఈవో, విశ్రాంత ఐఏఎస్ అధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీలో సంచలనం సృష్టిస్తున్నాయి. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో జరిగిన కల్తీ కేవలం పొరపాటు కాదు, అది పక్కా ప్రణాళికతో జరిగిన ‘నేరపూరిత కుట్ర’ అని టీటీడీ పూర్వ ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం సంచలన వ్యాఖ్యలు చేశారు. సాక్షాత్తూ వేంకటేశ్వర స్వామి వారి ప్రసాదానికి, నైవేద్యాలకు మరియు దీపారాధనకు నెయ్యి పేరుతో రసాయనాలు కలిపిన నూనె లాంటి పదార్థాన్ని వాడటం హిందూ ధర్మానికే జరిగిన మహాపచారమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏ రసాయనం కలిపితే నెయ్యి రంగు, వాసన వస్తుందో వెతికి మరీ ఈ వ్యవహారాన్ని నడిపించారని, ఇది మానవాళికే శాపమని ఆయన హెచ్చరించారు. పరీక్షల్లో కల్తీ అని తేలిన తర్వాత కూడా “జంతు కొవ్వు కలవలేదు, కేవలం రసాయనాలే కలిపాం” అని గత ప్రభుత్వ పెద్దలు వాదించడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు.

ఈ మొత్తం కుట్రలో టీటీడీ ఈవో మరియు ఛైర్మన్‌ల బాధ్యత విస్మరించలేనిదని ఎల్వీ సుబ్రహ్మణ్యం స్పష్టం చేశారు. ఈవో అనే వ్యక్తి కేవలం సాధారణ అధికారి కాదు, ఆయన శ్రీవారికి ‘అనుంగు సేవకుడు’. 2022లోనే నెయ్యి కల్తీ జరుగుతోందని నివేదికలు వచ్చినా, అప్పట్లోనే చర్యలు తీసుకోకుండా అదే కల్తీ నెయ్యిని కొనసాగించడం వెనుక ఉన్న నేర స్వభావాన్ని ఆయన ఎత్తిచూపారు. ఒక్క చుక్క నెయ్యి కూడా లేకుండా సుమారు రూ. 250 కోట్ల బిల్లులు చెల్లించారంటేనే ఇందులో ఎంత పెద్ద అవినీతి జరిగిందో అర్థమవుతోందన్నారు. తప్పులు అడ్డుకోనందుకే అప్పటి అధికారులపై చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని, ఇక్కడ ఛైర్మన్ మరియు ఈవో ఇద్దరూ బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు.

ప్రస్తుత పరిస్థితిపై స్పందిస్తూ, కల్తీ నెయ్యి కుట్రదారులకు కఠిన శిక్ష పడే వరకు హిందువులంతా ఏకమై పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. తప్పు చేసిన వారు తమ సమర్థనలు ఆపేసి, తిరుమలకు వచ్చి స్వామివారి ముందు లెంపలు వేసుకోవాలని, పొర్లుదండాలు పెట్టి ప్రాయశ్చిత్తం చేసుకోవాలని సూచించారు. అప్పటి వరకు బాధ్యులైన వారిని స్వామివారి దర్శనానికి కూడా అనుమతించకూడదని ఆయన డిమాండ్ చేశారు. సిట్ (SIT) నివేదిక ఆధారంగా సుప్రీంకోర్టు దోషులకు సరైన శిక్ష విధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భక్తుల మనోభావాలతో ఆడుకున్న వారికి ప్రజలే బుద్ధి చెబుతారని, వారి ఆగ్రహానికి గురికాకముందే తప్పు ఒప్పుకోవాలని హెచ్చరించారు.

భవిష్యత్తులో ఇలాంటి అపచారాలు జరగకుండా ఉండటానికి ‘అమూల్’ నమూనాను అనుసరించాలని ఎల్వీ సుబ్రహ్మణ్యం ఒక నిర్మాణాత్మక సూచన చేశారు. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోని రైతులకు దేశీ ఆవులను పంపిణీ చేసి, వారి ద్వారా స్వచ్ఛమైన ఆవు పాలను సేకరించి టీటీడీయే నేరుగా నెయ్యిని తయారు చేసుకోవాలని సూచించారు. దీనివల్ల సుమారు 30 వేల రైతు కుటుంబాలకు ఉపాధి లభించడమే కాకుండా, ఎక్కడి నుంచి నెయ్యి వస్తుందో టీటీడీకి పూర్తి నియంత్రణ ఉంటుందని తెలిపారు. ఇలాంటి పటిష్టమైన సొంత వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం ద్వారా మాత్రమే భవిష్యత్తులో శ్రీవారి ప్రసాదం పవిత్రతను కాపాడగలమని ఆయన అభిప్రాయపడ్డారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Ex CS LV Subrahmanyam
  • Ex CS LV Subrahmanyam Fires On YCP Over Ghee Scam :
  • Ghee Scam
  • tirumala
  • tirumala laddu
  • ycp

Related News

APs Development

ఎంత రెచ్చగొట్టిన కాపులు సైలెంట్ గా ఉంటున్నారా ? వైసీపీ ప్లాన్ వర్క్ కావడం లేదా ?

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, ముఖ్యంగా అంబటి రాంబాబు వంటి వారు చేస్తున్న వ్యాఖ్యలు, ముద్రగడ పద్మనాభం రాసిన బహిరంగ లేఖలు కాపు సామాజికవర్గంలో సెగ పుట్టించే ప్రయత్నం చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది

  • Adulterated Ghee Supplied T

    మల్లన్న ప్రసాదం సైతం కల్తీ ..వెలుగులోకి వైసీపీ పాపాలు !!

  • Jagan Babu Pawan

    జగన్ను ‘అష్టదిగ్బంధనం’ చేయబోతున్న బాబు – పవన్ ?

  • CM Chandrababu participated in the parliamentary committees workshop

    పార్టీ నేతలను హెచ్చరించిన చంద్రబాబు

  • Mudragada Letter

    చంద్రబాబు కాపు కులాన్ని టార్గెట్ చేస్తున్నారంటూ ముద్రగడ సంచలన ఆరోపణలు

Latest News

  • ఏపీలో మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పదో తరగతి పరీక్షలు

  • ప్రపంచంలో అత్యధికంగా బంగారాన్ని ఉత్పత్తి చేసే దేశం ఏది?

  • తొలి మ్యాచ్‌లో పాక్ స్టార్ ప్లేయ‌ర్‌ బాబర్ ఆజం ఫ్లాప్!

  • భారత్ చారిత్రాత్మక విజయం.. వైభవ్ సూర్యవంశీ బాధ?

  • తనకన్నా చిన్నవాడితో అక్రమ సంబంధం.. అడ్డుగా ఉందని అత్త హత్య

Trending News

    • పాక్‌కు USA షాక్.. పీఓకే సహా జమ్మూకశ్మీర్‌ భారత్‌దేనంటూ అమెరికా కొత్త మ్యాప్

    • టీ20 ప్రపంచకప్‌కు కౌంట్ డౌన్ స్టార్ట్‌.. రేపట్నుంచి సంద‌డే!

    • ధోనీ త‌ర్వాత వైభ‌వ్ సూర్య‌వంశీనే!

    • సేవ్ అమెరికా చట్టం అంటే ఏమిటి?

    • సైనిక శక్తిని మరింత పటిష్టం చేసుకున్న ఇరాన్‌.. రంగంలోకి సెజ్జిల్-2 బాలిస్టిక్ మిసైల్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd