HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Devotional
  • >Dussehra Sharannavaratri Mahotsavam At Vijayawada

Dussehra:గాయత్రిదేవిగా అమ్మ‌వారు.. నైవేద్యం ఏం చేయాలంటే..?

విజ‌య‌వాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. మూడో రోజు మంత్రాలకు మూలశక్తి అయిన గాయత్రిదేవిగా అమ్మ‌వారు భక్తులకు దర్శనమిస్తున్నారు.

  • Author : Hashtag U Date : 28-09-2022 - 1:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Durga Temple
Durga Temple

విజ‌య‌వాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. మూడో రోజు మంత్రాలకు మూలశక్తి అయిన గాయత్రిదేవిగా అమ్మ‌వారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ముక్త, విద్రుమ, హేమ, నీల ధవళ వర్ణాలు కలిగిన ఐదు ముఖాలతో, శంఖం, చక్రం, గద, అంకుశం ధరించి దర్శనమిస్తుండడంతో భక్తులు అమ్మవారి ఆలయానికి పోటెత్తారు. గాయత్రి ఉపాసనతో మంత్రసిద్ధి, బ్రహ్మజ్ఞానం కలుగుతాయని భక్తుల నమ్మకం. ప్రాతఃకాలంలో గాయత్రిగానూ, మధ్యాహ్న కాలంలో సావిత్రిగా, సాయంసంధ్యలో సరస్వతిగానూ ఉపాసకులతో పరమేశ్వరి ఆరాధనలు అందుకుంటుంది. నేడు శ్రీ గాయత్రీదేవి అమ్మవారికి గచ్చకాయ రంగు చీరతో అలంకరణ చేస్తారు.

ఈ రూపంలో అమ్మవారి స్వ‌రూపం చంద్రబింబం వలె ఆమె నుదిటిని అలంకరించబడి ఉంటుంది. అమ్మవారి తెల్లటి పూలతో పూజిస్తారు. గాయత్రి దేవి అనుగ్రహంతో జీవితంలో అన్నపానాలను ఎటువంటి ఢోకా ఉండదని భక్తుల నమ్మకం. ఈరోజు అమ్మవారికి కొబ్బరి అన్నం, పాయసం, అల్లపు గారెలు నేవెద్యంగా స‌మ‌ర్పిస్తారు. గాయత్రి స్వరూపంగా వేదం చదువుకున్న బ్రాహ్మణులకు అర్చన చేసి, గాయత్రీ స్తోత్రాలు పారాయణ చేయాలి.

గాయత్రీ మాత ముఖంలో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖపై రుద్రుడు కొలువు ఉంటారని మ‌న పురాణాలు పేర్కొన్నాయి. గాయత్రి ఉపాసన వల్ల బుద్ధి తేజోవంతం అవుతుంది. గాయత్రీ మంత్రజపం చతుర్వేద పారాయణ ఫలితాన్ని ఇస్తుంది. ‘‘ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్యసధీమహి ధియో యోనః ప్రచోదయాత్‌’’ అనే మంత్రాన్ని జపిస్తూ అమ్మను ధ్యానిస్తే అంతా మంచే జరుగుతుందని భ‌క్తులు న‌మ్మ‌కం.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • dussehra
  • Sharan navaratri mahotsavam
  • vijayawada

Related News

Illegal Affair

వివాహితను ట్రాప్.. గదికి పిలిపించి యువకుడు.. వామ్మో !

Illegal Affair  విజయవాడలో ఓ వివాహితను యువకుడు ట్రాప్ చేశాడు. ఆమెను భర్త నుంచి దూరం చేసి వేధింపులు మొదలు పెట్టాడు. పెళ్లి చేసుకుంటానంటూ యువతి వెంటపడ్డాడు.. మొదట ఆమె ఒప్పుకోలేదు. ఆమెకు మాయ మాటలు చెప్పి నమ్మించి హైదరాబాద్ నుంచి విజయవాడ రప్పించాడు. అక్కడ ఆ యువతి మరో యువకుడితో మాట్లాడుతుందని తెలుసుకుని గొడవకు దిగాడు. ఆ కోపంలో యువతి నోట్లో పురుగుల మందు పోశాడు. యువతి ఫిర్యాదుతో పోలీసుల

  • YS Jagan Visit Jogi Ramesh House Ibrahimpatnam Vijayawada

    జోగి రమేష్ ఇంటికి వైసీపీ అధినేత వైఎస్ జగన్

Latest News

  • కేసీఆర్ వల్లే అజహరుద్దీన్ కు మంత్రి పదవి – హరీష్ రావు

  • భారత్-పాక్ మ్యాచ్ బహిష్కరణ.. పీసీబీ నిర్ణయంపై గంగూలీ విస్మయం!

  • భారత్-పాక్ మ్యాచ్‌పై సందిగ్ధత.. బహిష్కరణ నిర్ణయంపై పీసీబీ స్పష్టత!

  • సిరాజ్ ‘బిర్యానీ’ తింటూ వచ్చి వికెట్లు తీశాడు: మాజీ క్రికెట‌ర్‌

  • వారంలో భారీగా తగ్గిన పసిడి ధరలు

Trending News

    • విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్‌!

    • అంతరిక్షంలో చైనా ఆధిపత్యం పెరుగుతుందా?

    • టీమిండియాకు చెమ‌టలు ప‌ట్టించిన యూఎస్ఏ!

    • టీ20 వరల్డ్ కప్‌.. తొలి మ్యాచ్‌కు ఈ ఆట‌గాళ్లు ఎందుకు దూర‌మ‌య్యారు?

    • ప్రపోజ్ డే కోసం రొమాంటిక్ టిప్స్ ఇవే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd