Shani Dev: ఆ టీ తాగితే జాతకంలో శని దోషం తొలగిపోతుందట.. నిజమేమిటంటే?
సాధారణంగా ప్రతి ఒక్కరూ కూడా శని దేవుని కోపానికి కారకులు కాకూడదని,అలాగే శని దేవుని యొక్క దోషాలు కూడా ఉండకూడదు అని దేవుళ్లను ప్రార్థిస్తూ అందుకు తగిన విధంగా పూజలు పునస్కారాలు కూడా చేస్తూ ఉంటారు.
- By Nakshatra Published Date - 05:00 PM, Sun - 2 October 22
సాధారణంగా ప్రతి ఒక్కరూ కూడా శని దేవుని కోపానికి కారకులు కాకూడదని,అలాగే శని దేవుని యొక్క దోషాలు కూడా ఉండకూడదు అని దేవుళ్లను ప్రార్థిస్తూ అందుకు తగిన విధంగా పూజలు పునస్కారాలు కూడా చేస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా జాతకంలో శని దోషం తొలగిపోవడం కోసం అనేక రకాల పరిష్కారాలను పాటిస్తూ ఉంటారు. అయితే జాతకంలో శని దోషం తొలగించుకోవాలి అనుకున్న వారు టీ తాగడం లేదంటే ఆ టీ ని ఇతరులకు ఇవ్వడం ద్వారా మీ జాతకంలో శని దోషం తొలగిపోయి అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుందట.
ఏంటి టీ తాగడం వల్ల జాతకంలో సంతోషం తొలగిపోతుందా అని ఆశ్చర్యపోతున్నారా? మీరు విన్నది నిజమే..మరి శని దోషానికి, టీకి గల సంబంధం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కాగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, జాతకంలో శని స్థానం బలహీనంగా ఉంటే, ఆ వ్యక్తి టీ తాగడం మానేసి ఇతరులకు టీ ఇవ్వాలి. మీరే టీ తయారు చేసుకుని తాగితే అది శనిగ్రహం యొక్క చెడు ప్రభావాన్ని తగ్గిస్తుంది. ఎలాంటి టీ తాగాలి? అన్న విషయానికి వస్తే..జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పాలు ఎక్కువ వేసుకుని టీ తాగే వారి జీవితం ఆనందం మరియు ఐశ్వర్యం తో నిండి ఉంటుందట.
అలాంటి వారికి ప్రైవేట్ లో లేదా ప్రభుత్వ రంగంలో ఏదైనా రంగంలో ఉన్నత స్థానం అలాగే గౌరవం లభిస్తాయట. బ్లాక్ టీ అనేది మేధావుల ఎంపిక అని చెప్పవచ్చు. ఈ వ్యక్తులు చాలా వరకు కీర్తిని పొందుతారు. మసాలా చాయ్ ఇష్టపడే వ్యక్తులు జీవితంలో చాలా కష్టాలను ఎదుర్కొంటారు, కానీ చివరికి వారు గొప్ప విజయాన్ని సాధిస్తారు. కాబట్టి జాతకంలో శని దోషం తొలగిపోవాలి అనుకున్న వారు పాలు ఎక్కువగా ఉన్న టిని తాగడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి.
Related News
Shani Dev Worship: శని దోషంతో ఇబ్బంది పడేవారు ఇలా చేస్తే చాలు.. సమస్యలు పరార్!
మాములుగా చాలామంది జీవిత కాలంలో ఏలినాటి శని, అర్ధష్టమ శని, సాడేసాతి వంటి దోషాలతో బాధపడుతుంటారు. అయితే వీటి నుంచి బయట పడటం కోసం ఎన్నెన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉంటారు. అయితే ఈ సమయంలో శనిదేవుడు జీవితంలో భరించలేని కష్టాలను పెడుతుంటాడు. ముఖ్యంగా శని దేవుడికి కర్మలకు అధిపతి అంటారు. అంటే ఆయన మనం చేసే పనులను బట్టి మనకు ఫలితాలను ఇస్తుంటాడు. మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు, కావాల�