Dreams: కలలో పాములు, ఒంటెలు, గుర్రాలు కనిపిస్తే ఏం జరుగుతుందో, వాటి అర్థం ఏంటో తెలుసా?
మామూలుగా నిద్రపోతున్నప్పుడు కలలు రావడం అన్నది సహజం. అందులో కొన్ని మంచి కలలు వస్తే మరి కొన్ని చెడ్డ కలలు మరికొన్ని పీడకలలు వస్తూ ఉంటాయి. చాలా
- By Anshu Published Date - 08:00 PM, Tue - 23 January 24

మామూలుగా నిద్రపోతున్నప్పుడు కలలు రావడం అన్నది సహజం. అందులో కొన్ని మంచి కలలు వస్తే మరి కొన్ని చెడ్డ కలలు మరికొన్ని పీడకలలు వస్తూ ఉంటాయి. చాలామంది కలలో కొన్నింటిని చూసినప్పుడు ఏం జరుగుతుందో ఏమవుతుందో అని టెన్షన్ పడుతూ ఆందోళన చెందుతూ ఉంటారు. అయితే సాధారణంగా కలలో పక్షులు జంతువులు మనుషులు రకరకాల సంఘటనలు వస్తూ ఉంటాయి. అయితే మీకు కలలు ఎప్పుడైనా పాములు ఒంటెలు గుర్రాలు వంటివి కనిపించాయి. ఒకవేళ అలాంటివి కనిపించి ఉంటే వాటి అర్థం ఏమిటి? అలా అవి కలలో కనిపించడం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఒకవేళ కలలో ఏనుగు కనిపిస్తే.. కలలో ఏనుగు కనిపించడం ఎంతో పవిత్రంగా భావిస్తారు. కలలో ఏనుగు కనిపిస్తే మీ ఇంటికి లక్ష్మీదేవి వచ్చే అవకాశం ఉన్నట్టు. ఎందుకంటే ఏనుగులను లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. అలాగే కలలో ఏనుగుల గుంపు మీకు కనిపిస్తే మీ సంపద పెరుగుతుందని అర్థం వస్తుంది. అలాగే కలలో గుర్రాలు కనిపిస్తే.. కలలో గుర్రం కనిపించడం కూడా చాలా చాలా మంచిది. శుభప్రదం కూడా. ఎందుకంటే ఇది మీ అదృష్టాన్ని సూచిస్తుంది. మీ కలలో గుర్రాలు పరిగెత్తితే అది మీ పురోగతికి సంకేతం. అలాగే మీ కలలో గుర్రపు పాదం కనిపిస్తే అది కూడా మంచిదని భావిస్తారు. మీరు కలలో గుర్రపు స్వారీ చేస్తుంటే ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు.
ఈ కల మీకు త్వరలోనే మీకు సంపద పెరుగుతుందని సూచిస్తుంది. అదేవిధంగా కలలో ఒంటెలు కనిపిస్తే.. భవిష్యత్తులో మీరు మీ కెరీర్లో మంచి పురోగతి సాధించే అవకాశాలు ఉన్నాయని అర్థం. దీనితో పాటుగా మీరు డబ్బును కూడా పొందే అవకాశం ఉంది. కలలో పాములు కనిపిస్తే.. మీరు కలలో పాములను చూసినా,వాటిని పట్టుకున్నా దీన్ని ఎంతో పవిత్రంగా భావించాలి. ఈ కల రాబోయే కాలంలో మీరు డబ్బును బాగా పొందుతారని అర్థం. అలాగే ఈ కల త్వరలోనే మీ సమస్యలన్నీ పోతాయని సూచిస్తుంది.