Vastu Shastra Tips: సాయంత్రం పూట అలాంటి పనులు చేస్తున్నారా.. అయితే కష్టాలను ఏరికోరి మరి తెచ్చుకున్నట్టే!
సాయంత్రం సమయంలో తెలిసి తెలియకుండా కూడా కొన్ని రకాల తప్పులు అస్సలు చేయకూడదని పండితులు చెబుతున్నారు.
- By Anshu Published Date - 05:30 PM, Sun - 18 August 24

మామూలుగా చాలామంది ఉదయం సాయంకాలం సమయంలో తెలిసి తెలియక చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారు. వాటి వల్ల చాలా రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అని హెచ్చరిస్తున్నారు పండితులు. ముఖ్యంగా సూర్యాస్తమయం అనగా సాయంకాలం సమయంలో కొన్ని రకాల పనులు చేయకూడదట. మరి ఎలాంటి పనులలో చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అయితే వాస్తుశాస్త్రం ప్రకారం సాయంకాలం వేళ కొన్ని పనులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదట. వాస్తు శాస్త్రం ప్రకారం, సాయంకాలం వేళ ఆడవారిని అస్సలు అవమానించకూడదట చెబుతున్నారు.
కేవలం ఇంట్లోనే కాదు, ఆఫీసులలో, భయట ఎక్కడ కూడా సాయంకాలం వేళ మహిళల్ని వేధించడం, నిందించడం లాంటివి చేస్తే లక్ష్మీదేవికి చాలా కోపం వస్తుందట. ఆ తల్లికి అలా ఒక్కసారి కోపం వస్తే అది ఎప్పటికీ వెళ్లిపోదట. ఆ తర్వాత మీరు ఎన్ని పూజలు, పునస్కారాలు చేసిన ఫలితం ఉండదని అందుకే ఎన్ని గొడవలు వచ్చినా సాయంత్రం వేళలో ఆడవారితో గొడవ పడకుండా ప్రశాంతంగా ఉండటం మంచిదని పండితులు చెబుతున్నారు. చాలామందికి సాయంత్రం సమయంలో నిద్ర పోయే అలవాటు ఉంటుంది. వారి పని పరిస్థితులను బట్టి చాలా మంది సాయంకాలం వేళ నిద్రపోతుంటారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా సాయంకాలం వేళ నిద్ర పోకూడదట.
అలా నిద్రపోయే వారి ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు నివసించదట. కాబట్టి ఆ సమయంలో ఎంత నిద్ర వచ్చినా ఆపుకోవడానికి ప్రయత్నించాలని, దానివల్ల మీకే మంచి జరుగుతుంది అని పండితులు చెబుతున్నారు. సాయంకాలం సమయంలో మీ ఇంటిని శుభ్రం చేసుకునేందుకు చీపురును అస్సలు వాడకూడదట. అంటే ఆ సమయంలో మీ ఇంటిని అస్సలు శుభ్రం చేసుకోవద్దని కాదు. ఒకవేళ మీరు సాయంత్రం వేళలో చీపురుతో ఇంటిని శుభ్రం చేస్తే మీ ఇంట్లో మంచి అంతా బయటకు వెళ్లిపోతుందని పండితులు చెబుతున్నారు. అదే సమయంలో లక్ష్మీదేవి కూడా వెళ్లిపోతుందట. కాబట్టి సాయంకాలం లోపు చీపరుతో మీ ఇంటిని శుభ్రం చేసుకుంటే సరిపోతుందని చెబుతున్నారు. సాయంత్రం వేళలో తులసి మొక్కకు నీరు పోయకూడదట. అదే విధంగా తులసి మొక్క ఆకులు, పువ్వులు, కాయలను కోయడం వంటి పనులను అస్సలు చేయకూడదట. ఇలా చేసినా కూడా లక్ష్మీదేవి ఇంట్లో నుండి వెళ్లిపోతుందట. సాయంత్రం సమయంలో తులసి ఆకులను తుంచడం కోయడం వంటివి కూడా చేయకూడదట.