spirituality: అప్పుల బాధ నుంచి విముక్తి పొందాలంటే ఈ పరిహారం పాటించాల్సిందే?
ఈ రోజుల్లో ప్రతీ పదిమందిలో 8 మంది ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న విషయం తెలిసిందే. ఈ ఆర్థిక సమస్యల కారణంగా మానసిక సమస్యలు, అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతూ ఉంటాయి.
- Author : Anshu
Date : 22-07-2024 - 4:45 IST
Published By : Hashtagu Telugu Desk
ఈ రోజుల్లో ప్రతీ పదిమందిలో 8 మంది ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న విషయం తెలిసిందే. ఈ ఆర్థిక సమస్యల కారణంగా మానసిక సమస్యలు, అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతూ ఉంటాయి. అయితే కొంతమంది ఎంత కష్టపడి డబ్బులు సంపాదించినా కూడా చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలకపోగా అదనంగా అప్పులు చేయాల్సి వస్తోంది అని బాధపడుతూ ఉంటారు. ఇక అందులో బాగంగానే అప్పుల బాధ నుంచి విముక్తి పొందడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు.
రకరకాల పూజలు పరిహారాలు పాటించడంతో పాటు దానధర్మాలు సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు. అయితే మీరు కూడా అలా అప్పుల బాధలతో సతమతమవుతుంటే అలాంటప్పుడు ఎలాంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అప్పుల బాధలతో సతమతమయ్యేవారు లక్ష్మి దేవిని భక్తిశ్రద్ధలతో ప్రత్యేకంగా పూజించాలి. ప్రతి శుక్రవారం అమ్మవారికి ఇష్టమైన పువ్వులను నైవేద్యాన్ని సమర్పించి పూజ చేయాలి. అదేవిధంగా శుక్రవారం రోజు మాంసం మధ్యాహ్నం వంటి వాటికి దూరంగా ఉండటం మంచిది.
ఇక అమావాస్య అంటే అమ్మవారికి ఎంతో ఇష్టం. ఈ అమావాస్య రోజున అమ్మవారిని ప్రత్యేకంగా పూజించడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే తప్పకుండా అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని చెబుతున్నారు పండితులు. అలాగే శుక్రవారం రోజున ఇంట్లో ఐశ్వర్య కాళీ దీపాన్ని వెలిగించడం వల్ల కూడా లక్ష్మీ అనుగ్రహాన్ని పొందవచ్చు. లక్ష్మీదేవికి ఎల్లప్పుడూ కూడా ఎరుపు రంగు పుష్పాలనే సమర్పించాలి. ఇక శుక్రవారం రోజున ఇంట్లో ఉండే స్త్రీలను పెద్దలను ఆ గౌరవ పరచడం, అవమానించే విధంగా మాట్లాడడం కొట్టడం తిట్టడం లాంటివి అసలు చేయకూడదు.. ఇలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. అయితే పైన చెప్పిన విషయాలు పాటించడం ద్వారా లక్ష్మి అనుగ్రహం కలగడంతో పాటు ఆర్థిక సమస్యల నుంచి ఈజీగా బయటపడవచ్చని చెబుతున్నారు పండితులు.