Eating Food: భోజనం చేసేటప్పుడు ఎలాంటి నియమాలను పాటించాలో మీకు తెలుసా?
ప్రతి ఒక్కరూ భోజనం చేసేటప్పుడు తప్పకుండా కొన్ని రకాల నియమాలను పాటించాలని లేదంటే అన్నపూర్ణాదేవికీ కోపం వస్తుందని చెబుతున్నారు. మరి భోజనం చేసేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి అన్న విషయానికి వస్తే..
- By Anshu Published Date - 03:03 PM, Fri - 28 March 25

మామూలుగా భోజనం చేసేటప్పుడు కొంతమంది కింద నేలపై కూర్చొని తింటే మరికొందరు డైనింగ్ టేబుల్ పై ఇంకొందరు మంచంపై ఇలా ఒక్కొక్కరు ఒక్కో ప్రదేశంలో కూర్చుని తినడం తింటూ ఉంటారు. కాళ్లు చాపుకుని తినడం లేదంటే మంచం మీద కూర్చొని కాళ్లు ఊపుతూ తినడం ఇలా చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారు. వాటి వల్ల అన్నపూర్ణ దేవికి కోపం వస్తుందని చెబుతున్నారు పండితులు. అందుకే భోజనం చేసేటప్పుడు తప్పకుండా కొన్ని నియమాలను పాటించాలని చెబుతున్నారు. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ప్రతిరోజు రెండుసార్లు మాత్రమే భోజనం చేయాలి అని పురాణాలు చెబుతున్నాయి. రెండుసార్లు కూడా ఎటువంటి ఆహారం తీసుకోకపోతే అది ఉపవాస ఫలం కిందకు వస్తుందని చెబుతున్నారు. అలాగే ఎప్పుడూ కూడా భోజనం చేసేటప్పుడు తూర్పు వైపుకు తిరిగి భోజనం చేయాలట. పడమర దిక్కుగా కూర్చుని భోజనం చేయకూడదని చెబుతున్నారు. తూర్పు వైపుకు తిరిగి భోజనం చేయడం వల్ల ఆయుర్ధామం కలుగుతుందట. ఇక ఉత్తర వైపుకు తిరిగి భోజనం చేయడం వల్ల కోరికలు ఫలిస్తాయట.
పడమర దిక్కుతోపాటు దక్షిణం దిక్కు వైపు కూర్చుని భోజనం చేయకూడదని చెబుతున్నారు. అలాగే ఆకుల మీద ఇనుప పీటల మీద కూర్చుని భోజనం చేయకూడదట. భోజనానికి కూర్చున్నప్పుడు అన్నం వడ్డించుకుని భోజనానికి కూర్చోవాలని అలా కాకుండా భోజనం తగ్గించిన తర్వాత కొద్దిసేపటి వరకు రాకుండా అలాగే ఉండకూడదని చెబుతున్నారు. అంటే మనం కంచంలో ఉన్న భోజనం కోసం ఎదురు చూడాలి తప్ప, మనకోసం కంచంలో ఉన్న భోజనం ఎదురు చూడకూడదట. ఇది అన్నపూర్ణ దేవికి కోపం తెప్పిస్తుందని చెబుతున్నారు.