Shiva Kanchi: శివ కంచి లోని ఈ మామిడి చెట్టు విశిష్టత మీకు తెలుసా?
కంచిలో ఉన్న ఏకాంబరేశ్వర దేవాలయం పంచభూత క్షేత్రాలలో ఒకటి. ఏకామ్ర. ఆమ్ర మామిడి; అంబర వస్త్రం, ఆకాశం అని నానార్థాలు.
- By Vamsi Korata Published Date - 07:00 AM, Mon - 6 March 23

కంచిలో ఉన్న ఏకాంబరేశ్వర దేవాలయం పంచభూత క్షేత్రాలలో ఒకటి. ఏకామ్ర, ఆమ్ర మామిడి; అంబర వస్త్రం, ఆకాశం అని నానార్థాలు. ఏకాంబరేశ్వర స్వామి ఆంటే ఒక్క మామిడి చెట్టు కైంద వెలసిన స్వామి అని అర్థం. ఏకాంబరేశ్వరుడు భూమిని సూచిస్తాడు. ఈ క్షేత్రం యొక్క పురాణగాథను ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఎడమ వైపున చిత్రాలలో తిలకించవచ్చు.ఈ దేవాలయంలోని ప్రధాన దైవం శివుడు (Shiva). ఆలయంలో నాలుగు వైపులా నాలుగు గాలి గోపురాలు ఉన్నాయి. ఒక్కొక్క గాలి గోపురం ఎత్తు 57 మీటర్లు. దేవాలయం లోపలి మండపంలో వెయ్యి స్తంభాలు ఉన్నాయి. ఆలయంలో 1,008 శివలింగాలు ప్రతిష్ఠించబడి ఉన్నాయి. ఈ దేవాలయంలో ఉన్న 3,500 సంవత్సరాల వయస్సు కల మామిడి వృక్షంలోని నాలుగు కొమ్మలు నాలుగు రకాల రుచిగల పళ్ళు కాస్తాయి. సంతానంలేని దంపతులు ఈ చెట్టు క్రిందపడే పండు పట్టుకొని ఆ పండుని సేవిస్తే సంతానం కలుగుతుందని ఇక్కడి ప్రజల నమ్మకం.
అయితే ఇంతటి ప్రాశస్త్యం కలిగిన ఈ మామిడి వృక్షం యొక్క కాండం మాత్రమే చూడగలం ప్రస్తుతం. ఈ మామిడి వృక్షం యొక్క కాండాన్ని అద్దాల పెట్టెలో ఉంచి దేవాలయంలో భద్రపరిచారు. ఇప్పుడు పురాతన మామిడి వృక్షం స్థానంలో, దేవస్థానం వారు కొత్తగా మరో మామిడి వృక్షం నాటారు. మరో ఆసక్తికరమైన విశేషం ఏమిటంటే, ఈ మామిడి వృక్షం క్రింద పార్వతీపరమేశ్వరులు, పార్వతీదేవి కుమారస్వామిని ఒడిలో కూర్చోపెట్టుకొని వధూవరులుగా దర్శనమిస్తారు. ఇక్కడే మనం తపోకామాక్షిని కూడా దర్శించవచ్చు. ఈ క్షేత్రం 108 వైష్ణవ దివ్యక్షేత్రాలలో ఒకటి. తిరునిలథింగల్ తుండం అనే మహా విష్ణువు సన్నిధి ఉన్నది.
ఇతిహాసం ప్రకారం పార్వతీదేవి ఇక్కడ ఉన్న మామిడి వృక్షం క్రింద తపస్సు చేసిందని, శివుడు (Shiva) పార్వతిని పరీక్షించదలచి అగ్ని ని పంపాడని, అప్పుడు పార్వతి విష్ణువు ను ప్రార్థించగా విష్ణువు అగ్నిని చల్లార్చడానికి శివుని తలమీద ఉన్న చంద్రుని చల్లని కిరణాలు ప్రసరింపజేశాడని కథ. తరువాత శివుడు (Shiva) పార్వతి మీదకు గంగ ను ప్రవహింప జేయగా, పార్వతి గంగను ప్రార్థించి, వారిద్దరు శివుడి భార్యలని చెప్పగా గంగ పార్వతికి హాని జరపలేదు. అమ్మవారి ఆలింగనస్పర్శ చేత పులకాంకితుడైన పరమేశ్వరుడు అమ్మవారికి సాక్షాత్కరించి అనుగ్రహించినట్లు స్థల పురాణము.. ఇక్కడ ఉన్న విష్ణువు ను వామనమూర్తిగా పూజిస్తారు.
Also Read: Lokesh Yuvagalam: యువగళం హీట్, పెద్దిరెడ్డి ఇలాఖలో లోకేష్ దూకుడు

Related News

Baldness: మీ వేళ్లు అలా ఉన్నాయా? అయితే బట్టతల వస్తుంది..
ఎంతోమంది పురుషులు బట్టతల సమస్యతో బాధపడుతుంటారు. చాలామంది చిన్న వయస్సులోనే తలపై జుట్టును కోల్పోతారు. ఉంగరపు వేలు కంటే చూపుడు వేలు