HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Devotional
  • >Do You Know The Glory Of Sri Rama Raksha Stotra

Sri Rama Raksha Stotra: శ్రీ రామ రక్షా స్తోత్ర మహిమ తెలుసా!

శ్రీరామచంద్రస్వామికి సంబందించి ఎన్నో రకాల స్త్రోత్రాలు పురాణాల్లో వున్నాయి.. ఈ స్తోత్రాలన్నింటిలో రామరక్షా స్తోత్రానికి ఒక ప్రత్యేక స్థానం..

  • By Vamsi Chowdary Korata Published Date - 06:00 AM, Thu - 30 March 23
  • daily-hunt
Do You Know The Glory Of Sri Rama Raksha Stotra!
Do You Know The Glory Of Sri Rama Raksha Stotra!

Sri Rama Raksha Stotra : శ్రీ రామచంద్ర స్వామికి సంబందించి ఎన్నో రకాల స్త్రోత్రాలు పురాణాల్లో వున్నాయి.. ఈ స్తోత్రాలన్నింటిలో రామరక్షా స్తోత్రానికి ఒక ప్రత్యేక స్థానం
ఈ రామ రక్షా స్తోత్రాన్ని శ్రీ బుధ కౌశిక ముని విరచించారు.!!

ఈ స్తోత్రంలో 38 శ్లోకాలు కలవు. శ్రీరాముని మనసారా భక్తి యుక్తులతో ధ్యానించి పూజించేవారు, తమకు రక్షణ నివ్వమని కోరుకునే ఈ స్తోత్రం మనస్ఫూర్తిగా నమ్మి పఠించినవారు, ఆ శ్రీరాముని దయకు పాత్రులవుతారు. శ్రీరామరక్షా స్తోత్ర జపం భక్తి శ్రద్ధలతో చేసిన వారికి పాపాలు నశించడమే గాక, శరణాగతి వేడుకొన్న వారికి శ్రీరామరక్ష ఎల్లవేళలా వెన్నంటి ఉండి కాపాడుతూ ఉంటుంది. ఈ స్తోత్రం చేసిన వారికి మానసిక ప్రశాంతత, జీవితంలో సుఖశాంతులు మరియు సంతోషము కలుగుతాయనడంలో ఏమాత్రము సందేహము అవసరం లేదు మన జీవితంలోని ఎన్నో సమస్యలను అధిగమించడానికి తగు ఆత్మస్థైర్యాన్ని ప్రసాదించే అత్యంత సులువైన భక్తి మార్గం రామరక్షాస్తోత్రం. ఎవరికైతే సమస్యలను అధిగమించాలనే సంకల్పం కలుగుతుందో, వారు నిత్యం అత్యంత భక్తి శ్రద్ధలతో రోజు పదకొండు సార్లు(11) ఈ రామరక్షా స్తోత్ర పారాయణ చేయాలి.!!

నిరుద్యోగులు, శత్రుభయం కలిగినవారు, అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నవారు, కోర్టు వ్యాజ్యాలు నడుస్తున్నవారు, ఏదైనా ఉద్యోగ లేదా వ్యాపార పరమైన సమస్యలలో చిక్కుకుని సతమతమవుతున్నవారు, మానసిక ఒత్తిడులకు గురవుతున్నవారు అందరు జీవితంలో ఇబ్బంది పడే ఎటువంటి సమస్యనుండైనా బయటపడాలంటే సంపూర్ణమైన భక్తి విశ్వాసాలతో ఈ రామరక్షా స్తోత్ర పారాయణ చేసి, రాముని శరణు వేడితే తప్పక బయట పడి జీవితము సాఫల్యతవైపు నడుచుటకు మార్గము కనపడుతుంది.!!

శ్రీ రామ రక్షా స్త్రోత్రం (Sri Rama Raksha Strotram):

అస్య శ్రీరామరక్షాస్తోత్రమంత్రస్య | బుధకౌశిక ఋషిః | శ్రీసీతారామచంద్రో దేవతా | అనుష్టుప్ ఛందః | సీతా శక్తిః | శ్రీమాన్ హనుమాన్ కీలకమ్ | శ్రీరామచంద్రప్రీత్యర్థే
శ్రీ రామరక్షాస్తోత్రజపే వినియోగః ||
ధ్యానమ్
ధ్యాయేదాజానుబాహుం ధృతశరధనుషం బద్ధపద్మాసనస్థమ్
పీతం వాసో వసానం నవకమలదళస్పర్ధినేత్రం ప్రసన్నమ్ |
వామాంకారూఢ సీతాముఖకమలమిలల్లోచనం నీరదాభమ్
నానాలంకారదీప్తం దధతమురుజటామండలం రామచంద్రమ్ ||

స్తోత్రం:

చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరమ్ |
ఏకైకమక్షరం పుంసాం మహాపాతకనాశనమ్ ||
ధ్యాత్వా నీలోత్పలశ్యామం రామం రాజీవలోచనమ్ |
జానకీలక్ష్మణోపేతం జటామకుటమండితమ్ ||
సాసితూణధనుర్బాణపాణిం నక్తంచరాంతకమ్ |
స్వలీలయా జగత్రాతుం ఆవిర్భూతం అజం విభుమ్!!
రామరక్షాం పఠేత్ప్రాజ్ఞః పాపఘ్నీం సర్వకామదామ్ |
శిరో మే రాఘవః పాతు ఫాలం దశరథాత్మజః!!
కౌసల్యేయో దృశౌ పాతు విశ్వామిత్రప్రియః శ్రుతీ |
ఘ్రాణం పాతు మఖత్రాతా ముఖం సౌమిత్రివత్సలః ||
జిహ్వాం విద్యానిధిః పాతు కంఠం భరతవందితః |
స్కంధౌ దివ్యాయుధః పాతు భుజౌ భగ్నేశకార్ముకః ||
కరౌ సీతాపతిః పాతు హృదయం జామదగ్న్యజిత్ |
మధ్యం పాతు ఖరధ్వంసీ నాభిం జాంబవదాశ్రయః ||
సుగ్రీవేశః కటీ పాతు సక్థినీ హనుమత్ప్రభుః |
ఊరూ రఘూత్తమః పాతు రక్షఃకుల
వినాశకృత్ !!
జానునీ సేతుకృత్పాతు జంఘే దశముఖాంతకః |
పాదౌ విభీషణశ్రీదః పాతు రామోఖిలం వపుః!
ఏతాం రామబలోపేతాం రక్షాం యః సుకృతీ పఠేత్ |
స చిరాయుః సుఖీ పుత్రీ విజయీ వినయీ భవేత్
పాతాళభూతలవ్యోమచారిణశ్ఛద్మచారిణః |
న ద్రష్టుమపి శక్తాస్తే రక్షితం రామనామభిః ||
రామేతి రామభద్రేతి రామచంద్రేతి వా స్మరన్ |
నరో న లిప్యతే పాపైః భుక్తిం ముక్తిం చ విందతి ||
జగజ్జైత్రైకమంత్రేణ రామనామ్నాభిరక్షితమ్ |
యః కంఠే ధారయేత్తస్య కరస్థాః సర్వసిద్ధయః ||
వజ్రపంజరనామేదం యో రామకవచం స్మరేత్ !
అవ్యాహతాజ్ఞః సర్వత్ర లభతే జయ మంగళమ్ ||
ఆదిష్టవాన్యథా స్వప్నే రామరక్షాంమిమాం హరః |
తథా లిఖితవాన్ప్రాతః ప్రభుద్ధో బుధకౌశికః!!
ఆరామః కల్పవృక్షాణాం విరామః సకలాపదామ్ |
అభిరామస్త్రిలోకానాం రామః శ్రీమాన్ స నః ప్రభుః ||
తరుణౌ రూపసంపన్నౌ సుకుమారౌ మహాబలౌ |
పుండరీక విశాలాక్షౌ చీరకృష్ణాజినాంబరౌ ||
ఫలమూలాశినౌ దాంతౌ తాపసౌ బ్రహ్మచారిణౌ |
పుత్రౌ దశరథస్యైతౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ ||
శరణ్యౌ సర్వసత్త్వానాం శ్రేష్ఠౌ సర్వధనుష్మతామ్ |
రక్షః కులనిహంతారౌ త్రాయేతాం నో రఘూత్తమౌ ||
ఆత్తసజ్యధనుషావిషుస్పృశావక్షయాశుగనిషంగసంగినౌ |
రక్షణాయ మమ రామలక్ష్మణావగ్రతః పథి సదైవ గచ్ఛతామ్ ||
సన్నద్ధః కవచీ ఖడ్గీ చాపబాణధరో యువా |
గచ్ఛన్మనోరథాన్నశ్చ రామః పాతు సలక్ష్మణః!
రామో దాశరథిః శూరో లక్ష్మణానుచరో బలీ |
కాకుత్థ్సః పురుషః పూర్ణః కౌసల్యేయో రఘూత్తమః ||
వేదాంతవేద్యో యజ్ఞేశః పురాణపురుషోత్తమః |
జానకీవల్లభః శ్రీమాన్ అప్రమేయ పరాక్రమః ||
ఇత్యేతాని జపన్నిత్యం మద్భక్తః శ్రద్ధయాన్వితః |
అశ్వమేధాధికం పుణ్యం సంప్రాప్నోతి న సంశయః ||
రామం దుర్వాదలశ్యామం పద్మాక్షం పీతవాససమ్ |
స్తువంతి నామభిర్దివ్యైః న తే సంసారిణో నరః!
రామం లక్ష్మణపూర్వజం రఘువరం సీతాపతిం సుందరమ్ |
కాకుత్థ్సం కరుణార్ణవం గుణనిధిం విప్రప్రియం ధార్మికమ్ |
రాజేంద్రం సత్యసంధం దశరథతనయం శ్యామలం శాంతమూర్తిమ్ |
వందే లోకాభిరామం రఘుకులతిలకం రాఘవం రావణారిమ్ ||
రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే |
రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః |!
శ్రీరామ రామ రఘునందన రామ రామ |
శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ |
శ్రీరామ రామ రణకర్కశ రామ రామ |
శ్రీరామ రామ శరణం భవ రామ రామ |!
శ్రీరామచంద్రచరణౌ మనసా స్మరామి |
శ్రీరామచంద్రచరణౌ వచసా గృణామి |
శ్రీరామచంద్రచరణౌ శిరసా నమామి |
శ్రీరామచంద్రచరణౌ శరణం ప్రపద్యే ||
మాతా రామో మత్పితా రామచంద్రః |
స్వామీ రామో మత్సఖా రామచంద్రః |
సర్వస్వం మే రామచంద్రో దయాళుః |
నాన్యం జానే నైవ జానే న జానే ||
దక్షిణే లక్ష్మణో యస్య వామే చ జనకాత్మజా |
పురతో మారుతిర్యస్య తం వందే రఘునందనమ్ ||
లోకాభిరామం రణరంగధీరం రాజీవనేత్రం రఘువంశనాథమ్ |
కారుణ్యరూపం కరుణాకరం తం శ్రీరామచంద్రం శరణం ప్రపద్యే ||
మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠమ్ |
వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే !!
కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరమ్ |
ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలమ్
ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదామ్ |
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్ ||
భర్జనం భవబీజానామర్జనం సుఖసంపదామ్ |
తర్జనం యమదూతానాం రామ రామేతి గర్జనమ్ |
రామో రాజమణిః సదా విజయతే రామం రమేశం భజే |
రామేణాభిహతా నిశాచరచమూ రామాయ తస్మై నమః |
రామాన్నాస్తి పరాయణం పరతరం రామస్య దాసోస్మ్యహమ్ |
రామే చిత్తలయ సదా భవతు మే భో రామ మాముద్ధర |!
శ్రీ రామ రామేతి రామేతి రమే రామే మనోరమే !
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే |!
ఇతి శ్రీ బుదకౌశికమహాముని విరచిత
శ్రీరామరక్షాస్త్రోత్రము సంపూర్ణం!!
శ్రీరామచంద్రపరబ్రహ్మణేనమః!

Also Read:  EV Stations: దేశవ్యాప్తంగా 7,432 పబ్లిక్ ఫాస్ట్ ఛార్జింగ్ EV స్టేషన్లు.. 800 కోట్లు మంజూరు..


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cultural heritage
  • Devi Sita
  • devotion
  • devotional literature
  • divine worship
  • Hindu customs
  • Hindu mythology
  • lord rama
  • mantras
  • mythological significance
  • religious beliefs
  • religious practices
  • sacred texts
  • Sanskrit chants
  • spirituality
  • Sri Rama Navami 2023
  • Sri Rama Raksha Stotra

Related News

    Latest News

    • MMTS Trains: రైల్వే ప్ర‌యాణికుల‌కు గుడ్ న్యూస్‌.. ఉద‌యం 4 గంట‌ల వ‌ర‌కు రైళ్లు!

    • Gautam Gambhir: టీమిండియాలో జోష్ నింపిన గౌతం గంభీర్‌.. ఏం చేశారంటే?

    • Bullet 350: జీఎస్‌టీ రేట్లలో మార్పులు.. ఈ బైక్‌పై భారీగా త‌గ్గుద‌ల‌!

    • GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

    • PM Modi: మ‌రో దేశ అధ్యక్షుడితో ప్ర‌ధాని మోదీ చ‌ర్చ‌లు.. ఎందుకంటే?

    Trending News

      • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd