Lakshmi Devi: రాత్రిపూట అలాంటి పని చేస్తున్నారా.. అయితే లక్ష్మీ ఇల్లు వదిలి వెళ్ళడం ఖాయం!
మామూలుగా ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని, సంతోషకరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటూ, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండకూడదని కోరుకుంటూ ఉంటారు.
- By Anshu Published Date - 02:30 PM, Thu - 18 July 24

మామూలుగా ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని, సంతోషకరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటూ, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండకూడదని కోరుకుంటూ ఉంటారు. వీటితో పాటుగా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని సంపాదించిన డబ్బులు చేతిలో మిగలాలనీ కోరుకుంటూ ఉంటారు. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే మనం చేసే చిన్న చిన్న పొరపాట్లే మనం అనుభవించే కష్టాలకు కారణాలు కావచ్చు అంటున్నారు పండితులు. ముఖ్యంగా కొన్ని రకాల పనులు కొన్ని సమయాలలో చేయడం నిషేధం అంటున్నారు. ఇందులో రాత్రిపూట కొన్ని రకాల పనులు చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి లోనవ్వడంతో పాటు ఇల్లు వదిలి వెళ్ళిపోతుందట.
మరి రాత్రి పూట ఎలాంటి పనులు చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. సాయంత్రం సమయంలో గోళ్లు కత్తిరించకూడదని మన ఇంట్లో పెద్దలు చెప్పినా కూడా వాటిని పెడచెవిన పెట్టి మరి గోళ్లు కత్తిరిస్తూ ఉంటారు. అందుకే రాత్రిపూట స్త్రీలు కానీ పురుషులు కానీ గోళ్లు కత్తిరించడం లాంటివి చేయకూడదు. ఈ విధంగా చేయడం వల్ల ఆర్థికపరమైన సమస్యలు తలెత్తుతాయట. అదేవిధంగా రాత్రి పూట పురుషులు కానీ మహిళలు కానీ పరిమళ ద్రవ్యాలు అనగా పర్ఫ్యూమ్ లు సెంట్లు వంటివి వాడకూడదట. పెర్ఫ్యూమ్ ధరించడం వల్ల ఇంట్లో నెగిటివిటీ పెరుగుతుందట. ప్రతి ఒక్కరికి డబ్బు అన్నది చాలా అవసరం. ఒకవేళ మీరు అప్పు చేయాల్సి వస్తే రాత్రిపూట మాత్రం ఎప్పుడూ అప్పు చేయకూడదట.
అలాగే ఎప్పుడూ రాత్రిపూట అప్పు ఇవ్వకూడదట. ఈ విధంగా చేస్తే లక్ష్మీదేవి ఇల్లు వదిలి పోతుందని చెబుతున్నారు పండితులు. సూర్యా స్తమయం తర్వాత పొరపాటున కూడా తులసి ఆకులను తెంపడం తులసి మొక్కను ముట్టుకోవడం లాంటివి అస్సలు చేయకూడదు. తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుంది. కాబట్టి తులసి ఆకులను తెంపడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవ్వక తప్పదు అంటున్నారు పండితులు. అలాగే వండిన పాత్రలు ఖాళీగా ఉంచవద్దు రాత్రి పడుకునే ముందు వంటగదిలో ఆహార పాత్రలను ఖాళీగా ఉంచవద్దు. వాస్తు ప్రకారం, అటువంటి ఖాళీ పాత్రలను ఉంచడం అశుభం. ఇలా ఉంచితే అన్నపూరాణి, లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు. ఫలితంగా ఇంట్లో ఆహార కొరత ఏర్పడుతుంది. డబ్బు సమస్యలు పెరుగుతాయి. అదేవిధంగా రాత్రిపూట జుట్టు విప్పి పడుకోవడం మంచిది కాదు.