Thursday: వ్యాపారంలో మంచి లాభాలు రావాలంటే.. గురువారం ఇలా చేయాల్సిందే!
గురువారం రోజు కొన్ని రకాల పరిహారాలు పాటిస్తే తప్పకుండా వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయని చెబుతున్నారు పండితులు.
- By Anshu Published Date - 02:30 PM, Mon - 21 October 24

మామూలుగా వ్యాపారం చేసే ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు వ్యాపారం బాగా జరగాలంటే మంచి లాభాలు రావాలని కోరుతూ ఉంటారు. ఇక వ్యాపారం బాగా జరగడం కోసం ఏవేవో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. అయితే వ్యాపారం బాగా జరగాలి అని కోరుకునేవారు గురువారం రోజు కొన్ని రకాల పరిహారాలు పాటించాలి అని చెబుతున్నారు. మరి గురువారం రోజు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. బృహస్పతి సంపద ఉన్న ఇంట్లో కూర్చోవడం లేదా జాతకంలో బలమైన బుధుడు ఉండటం వల్ల, ఆ వ్యక్తి వ్యాపారంలో ఉన్నత స్థానాన్ని చేరుకుంటాడట. మీ వ్యాపారం లాభాల్లో సాగాలి అనుకుంటే గురువారం రోజు లక్ష్మీ నారాయణుడిని ఆరాధించాలట.
అలాగే విష్ణు మూర్తికి, లక్ష్మీదేవికి ఏకశిలా కొబ్బరి కాయను సమర్పించాలట. వ్యాపారంలో వృద్ధి రావాలని దేవుళ్లను వేడుకోవాలనీ చెబుతున్నారు. అలాగే మీరు డబ్బుకు సంబంధించిన సమస్యలతో బాధపడుతుంటే గురువారం రోజు ఉదయాన్నే స్నానం చేసి ధ్యానం చేయాలట. ఆ తర్వాత పచ్చి పాలలో కుంకుమ పువ్వును కలిపి విష్ణుమూర్తి కి దక్షిణ శంఖంతో అభిషేకం చేయాలట. ఈ పరిహారాన్ని చేయడం వల్ల విష్ణుమూర్తి అనుగ్రహం పొందుతారు. దీంతో మీరు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారని చెబుతున్నారు. అలాగే మీరు మీ కెరీర్ లో ముందుకు వెళ్ళాలి అనుకుంటే గురువారం రోజు తప్పకుండా విష్ణువుమూర్తిని పూజించాలి. అలాగే పూజా సమయంలో గురు కవచాన్ని పఠించాలి.
ఈ పరిహారాన్ని కనీసం 16 గురువారాలు అయిన చేయాలట. ఇలా చేయడం వల్ల కెరీర్ లో మంచి పురోగతిని చూస్తారని పండితులు చెబుతున్నారు. ఒకవేల మీ వివాహానికి ఆటంకం ఏర్పడితే, ప్రతి గురువారం నాడు తలస్నానం చేసి ధ్యానం చేయాలట. ఆ తర్వాత నీటిలో పసుపు వేసి అరటి మొక్కకు అర్ఘ్యం సమర్పించాలని చెబుతున్నారు. ఇలాగే ప్రతి గురువారం చేయాలట. ఇలా చేయడం వల్ల మీకు త్వరలోనే పెళ్లి కుదిరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పండితులు చెబుతున్నారు.