Dream : పాలు తాగుతున్నట్లు కల వచ్చిందా..? అది దేనికి సంకేతమో మీకు తెలుసా?
మామూలుగా స్వప్న శాస్త్ర ప్రకారం కలలు భవిష్యత్తును సూచిస్తాయని చెబుతూ ఉంటారు. కానీ ఈ కలల (Dream) వెనకున్న అర్థం అంత త్వరగా అర్థం కాదు.
- Author : Naresh Kumar
Date : 04-01-2024 - 8:00 IST
Published By : Hashtagu Telugu Desk
Dream of Drinking Milk : మామూలుగా నిద్రపోతున్నప్పుడు మనకు కలలు రావడం అన్నది సహజం. అందులో కొన్ని మంచి కలలు అయితే మరికొన్ని చెడ్డ కలలు. ఒక్కొక్క కల (Dream) ఒక్కొక్క దానికి సంకేతం అన్న విషయం మనందరికీ తెలిసిందే. మామూలుగా స్వప్న శాస్త్ర ప్రకారం కలలు భవిష్యత్తును సూచిస్తాయని చెబుతూ ఉంటారు. కానీ ఈ కలల (Dream) వెనకున్న అర్థం అంత త్వరగా అర్థం కాదు. అయితే మీకు కలలో ఎప్పుడైనా పాలు తాగుతున్నట్లు, లేదా పాలు కనిపించడం లాంటివి జరిగాయా? మరి అది దేనికి సంకేతం అలా కనిపించడం వల్ల ఏం జరుగుతుంది. ఈ విషయాల గురించి ఇప్పుడు మనం చర్చించుకుందాం..
We’re Now on WhatsApp. Click to Join.
స్వప్న శాస్త్రం చెప్పిన దాన్ని బట్టి కలలో పాలు తాగడం లేదా అవి పడిపోవడం కనిపిస్తే శుభసూచకం. శాస్త్రాన్ని అనుసరించి పాలు లక్ష్మీ స్వరూపం. కలలో పాలు కనిపిస్తే దానికి వివిధ రకాల అర్థాలు ఉంటాయి. కలలో మీరు పాలు తాగుతున్నట్టు కల వస్తే అది చాలా శుభప్రదం. కలలో పాలు తాగడం అనేది మీ పురోబివృద్ధికి సంకేతం. సమీప భవిష్యత్తులో మీ కేరీర్ లో మంచి విజయాలు సాధించబోతున్నారనేందుకు ఈ కల ఒక సందేశంగా భావించవచ్చు. స్వప్న శాస్త్రాన్ని అనుసరించి పాలు కొంటున్నట్టు కల వస్తే అది మంచి ఆరోగ్యానికి సంకేతం. దీర్ఘకాలికంగా ఆనారోగ్యంతో ఉన్న వారికి పాలు కొంటున్నట్టు కల వస్తే అది చాలా శుభ సంకేతం. త్వరలో వారు ఆరోగ్యవంతులు అవుతారని అర్థం. అలాగే మీరు కాస్తున్న పాలు విరిగిపోయినట్టుగా కల వస్తే అది శుభప్రదం కాదు.
కలలో పాలు విరిగిపోతే రాబోయే కష్టకాలానికి సూచన. జీవితంలో ఏదో పెద్ద సంక్షోభం ఏర్పడబోతోందని అర్థ. ఆర్థిక లేదా సామాజిక లేదా ఏదైనా కెరీర్ కు సంబంధించి ఇబ్బందుల్లో పడనున్నారని అర్థం. మీకు కలలో మీరు ఆవు పాలు పితుకుతున్నట్టు కల వస్తే అది చాలా శుభప్రదమైన కల. త్వరలో మీ జీవితంలోకి ఆనందం, సమృద్ధి రానున్నాయని చెప్పే సంకేతం. అంతేకాదు చాలా పెద్ద మొత్తంలో మీకు ధనం చేతికంద బోతోందని ఈ కల సందేశాన్నిస్తుంది.
కలలో పాలు కాస్తున్నట్టు కనిపిస్తే అది కూడా శుభసూచకమే. మరుగుతున్న పాలు శుభవార్తలు వింటారని అనడానికి సూచన. త్వరలో మీ జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయని అనేందుకు సంకేతం. అంతేకాదు పాలలో చక్కెర కలుపుతున్నట్టు కనిపస్తే త్వరలో మీరు పడ్డ కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారని అనేందుకు ఇదొక సందేశంగా భావించాలి.
Also Read: Face Wash Tips : దీంతో ఒక్కసారి ఫేస్ వాష్ చేసుకుంటే చాలు.. ముఖం అందంగా మెరిసి పోవాల్సిందే..