Cyclone Dana : తుఫాన్ ఎఫెక్ట్.. ఒడిశాలోని ఈ ఆలయాలు మూసివేత..
Cyclone Dana : రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్నీ ఏర్పాట్లను పూర్తిచేసింది. ఇందులో భాగంగానే ఈ రెండు ఆలయాలను ఈ నెల 25వ తేది వరకు మూసివేసినట్లు తెలిపింది. ఈ దేవాలయాలతో పాటు రాష్ట్రంలో ప్రసిద్ధిచెందిన మ్యూజియంలు కూడా మూసివేసినట్లు అధికారులు వివరించారు.
- By Latha Suma Published Date - 06:49 PM, Wed - 23 October 24

Odisha : ‘దానా’ తుఫాన్ బంగాళాఖాతం వైపు వేగంగా కదులుతోంది. ఈ తుఫాన్ ప్రభావం ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే, ఈ విషయంపై అక్కడి ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఈ తుఫాన్ ప్రభావంతో ఒడిశా రాష్ట్రంలో ప్రసిద్ధిచెందిన జగన్నాథ ఆలయం, కోణార్క్ ఆలయాలను మూసివేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. అంతేకాక ఇక్కడి స్కూళ్లకు కూడా అధికారులు నాలుగురోజుల పాటు సెలవులు ప్రకటించారు. ‘దానా’ తుఫాను ప్రభావం ఎక్కువగా ఒడిశాపై పడనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఒడిశా ప్రభుత్వం పలు ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలోని రెండు ప్రధాన ఆలయాలైన జగన్నాథ ఆలయం, కోణార్క్ ఆలయాలను కూడా మూసివేయనన్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ నెల (అక్టోబర్) 25వ తేది వరకు ఇది అమలులో ఉండనుందని అధికారులు వివరించారు. ఆ తర్వాత పరిస్థితిని అంచనా వేసి నిర్ణయం తీసుకుంటామన్నారు.
ఒడిశా రాష్ట్రంలోని పూరీ లో వెలసిన ఈ రెండు ఆలయాలను దర్శంచుకునేందుకు నిత్యం భక్తులు తరలి వస్తుంటారు. జగన్నాథ దేవాలయం, కోణార్క్ దేవాలయం ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలుగా ప్రసిద్ధిచెందాయి. దానా తుఫాను ప్రభావంతో ఈ ఆలయాలను మూసివేస్తున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్నీ ఏర్పాట్లను పూర్తిచేసింది. ఇందులో భాగంగానే ఈ రెండు ఆలయాలను ఈ నెల 25వ తేది వరకు మూసివేసినట్లు తెలిపింది. ఈ దేవాలయాలతో పాటు రాష్ట్రంలో ప్రసిద్ధిచెందిన మ్యూజియంలు కూడా మూసివేసినట్లు అధికారులు వివరించారు. ‘దానా’ తుఫాను ఈ నెల (అక్టోబర్) 24వ తేదిన అంటే గురువారం నాడు తీవ్ర తుఫానుగా మారుతుందని ఐఎండీ హెచ్చరించింది. ఈనెల 25వ తేది ఉదయం గంటకు 100 నుండి 120 కిలోమీటర్ల వేగంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాన్ని తాకుతుందని వాతావరణ శాక తెలిపింది. ఈ సమయంలో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని సమాచారం.