Maha Kumbh Mela 2025 : 32 ఏళ్లుగా స్నానం చేయకుండా మహా కుంభమేళాలో పాల్గొంటున్న స్వామీజీ
Maha Kumbh 2025 : అందులో 32 ఏళ్లుగా స్నానం (Without bathing for 32 years)చేయకుండా ఉన్న 58 ఏళ్ల గంగాపురి మహారాజ్ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు
- By Sudheer Published Date - 12:50 PM, Sat - 4 January 25

మహా కుంభమేళా (Maha Kumbh Mela 2025) కోసం ప్రయాగ్ రాజ్ (Prayag Raj) సిద్ధమవుతోంది. ఏర్పాట్లకు సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈనెల 13 నుంచి మహా కుంభమేళా ప్రారంభం కానుంది. ఈక్రమంలో ఇందులో పాల్గొనేందుకు సాధువులు అక్కడికి చేరుకున్నారు. అందులో 32 ఏళ్లుగా స్నానం (Without bathing for 32 years)చేయకుండా ఉన్న 58 ఏళ్ల గంగాపురి మహారాజ్ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. ఈయన అస్సాంలోని కామాఖ్య పీఠానికి చెందిన చోటూ బాబా (Chhotu Baba). తన కోరిక తీరకపోవడంతో స్నానం చేయడం మానేశారని చెప్పుకొచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచారు. “నా జీవితంలో నాకు కావలసిన కోరిక ఇప్పటివరకు నెరవేరలేదు. అందుకే ఈ నియమాన్ని పాటిస్తున్నాను” అని గంగాపురి మహారాజ్ పేర్కొన్నారు.
Kolkata : గంగూలీ కూతురికి తప్పిన పెనుప్రమాదం..
కామాఖ్య పీఠానికి చెందిన గంగాపురి మహారాజ్, సాధువుల మధ్య చోటూ బాబా అనే పేరుతో ప్రసిద్ధి చెందారు. ఆయన తన జీవితాన్ని ఆధ్యాత్మిక సాధనకు అంకితం చేశారు. మహా కుంభమేళాలో ఈ సాధువు ప్రత్యేక ఆకర్షణగా నిలవడంతో, భక్తులు, మీడియా వారి జీవిత విధానంపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మహా కుంభమేళా అనే మహా ప్రాచీన ఆధ్యాత్మిక ఉత్సవం ప్రపంచంలోని అనేక సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక విశేషాలను చాటుతోంది. ఇందులో భాగస్వామ్యమయ్యే సాధువుల నడవడిక, ధ్యానం, సాధన ప్రపంచవ్యాప్తంగా ప్రజలలో ఆశ్చర్యం రేకెత్తిస్తున్నాయి. గంగాపురి మహారాజ్ లాంటి వ్యక్తులు కుంభమేళాకు ప్రత్యేకతను జోడిస్తారు. ఇక మహా కుంభమేళ ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఈ ఏడు జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ప్రయాగ్‌రాజ్‌లో ఈ మహా కుంభమేళా జరగనుంది. ఇందులో జనవరి 14 (మకర సంక్రాంతి), జనవరి 29 (మౌని అమావాస్య), ఫిబ్రవరి 3 (వసంత పంచమి)నషీహి స్నాన్ జరుగుతుంది. కనుక భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది. అందుకే ప్రభుత్వం అన్ని భద్రతా ఏర్పాట్లు చేస్తోంది.
Mukesh Chandrakar : కాంట్రాక్టరు సెప్టిక్ ట్యాంకులో జర్నలిస్టు డెడ్‌బాడీ.. ఎవరీ ముకేశ్ చంద్రకర్ ?
సాధారణ కుంభ మేళా ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అర్ధ కుంభమేళా అనేది ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి హరిద్వార్ లేక ప్రయాగలలో జరుగుతుంది. పూర్ణ కుంభ మేళా అనేది ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ప్రయాగ, (అలహాబాద్), హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్ లలో జరుగుతుంది. పన్నెండు పూర్ణ కుంభ మేళాలు పూర్తి అయిన తరువాత అంటే నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి అలహాబాద్ లో మహా కుంభ మేళా నిర్వహించబడుతుంది. జనవరి 2007లో చివరగా ప్రయాగలో 45 రోజుల పాటు జరిగిన అర్ధ కుంభ మేళాలో 17 మిలియన్ లకు పైగా హిందువులు హాజరవగా అన్నింటిలోకి పవిత్రంగా భావించే మకర సంక్రాంతి అయిన జనవరి 15 ఒక్క రోజే 5 మిలియన్ లకు పైగా హాజరయ్యారని ఒక అంచనా. 2001లో జరిగిన చివరి మహా కుంభ మేళాకు దాదాపు 60 మిలియన్ లకు పైగా ప్రజలు హాజరయ్యారు. ఎటువంటి సందర్భంలోనైనా ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరవడం ప్రపంచ చరిత్రలోనే తొలిసారి కావడం విశేషం.