HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Gangulys Daughter Missed A Big Accident

Kolkata : గంగూలీ కూతురికి తప్పిన పెనుప్రమాదం..

ఈ ప్రమాదంపై సనా గంగూలీ అధికారికంగా ఫిర్యాదు ఇంకా అందలేదని పోలీసులు వివరించారు. యాక్సిడెంట్ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

  • Author : Latha Suma Date : 04-01-2025 - 12:38 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Ganguly's daughter missed a big accident..
Ganguly's daughter missed a big accident..

Kolkata : బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరభ్ గంగూలీ కూతురు సనాకు పెను ప్రమాదమే తప్పింది. సనా గంగూలీ ప్రయాణిస్తున్న కారును ఓ బస్సు వెనకనుంచి ఢీ కొట్టింది. కోల్ కతాలోని డైమండ్ హార్బర్ లో శుక్రవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే, ఈ ప్రమాదంలో సనా కారుకు డ్యామేజీ అయిందని, సనాకు మాత్రం గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంలో కారును గంగూలీ డ్రైవర్ నడుపుతుండగా సనా పక్క సీటులో కూర్చుందని వివరించారు.

బెహలా చౌరస్తాలో సనా కారును ఢీ కొట్టిన బస్సు డ్రైవర్ ఆగకుండా వెళ్లిపోయాడని చెప్పారు. డ్రైవర్ తో కలిసి సనా బస్సును వెంటాడి కొంతదూరం వెళ్లిన తర్వాత అడ్డగించిందన్నారు. తమకు సమాచారం అందించడంతో వెంటనే అక్కడికి చేరుకుని బస్సు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై సనా గంగూలీ అధికారికంగా ఫిర్యాదు ఇంకా అందలేదని పోలీసులు వివరించారు. యాక్సిడెంట్ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

సౌరవ్ గంగూలీ అతని భార్య, ప్రఖ్యాత ఒడిస్సీ డ్యాన్సర్ డోనా యొక్క ఏకైక సంతానం సనా గంగూలీ. తన విద్యా ప్రయాణాన్ని కోల్‌కతాలోని లోరెటో హౌస్‌లో ప్రారంభించింది. యూనివర్శిటీ కాలేజ్ లండన్ నుండి ఎకనామిక్స్‌లో డిగ్రీని పొందింది. ప్రస్తుతం, ఆమె లండన్‌కు చెందిన బోటిక్ కన్సల్టింగ్ సంస్థ అయిన INNOVERVలో కన్సల్టెంట్‌గా పని చేస్తోంది.

Read Also: Tamil Nadu : బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఆరుగురు మృతి

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bus hits car
  • kolkata
  • road accident
  • Sana Ganguly
  • sourav ganguly

Related News

Bus Accident

Accident : ఇబ్రహీంపట్నంలో తప్పిన పెను ప్రమాదం.. డివైడర్‌పైకి ఎక్కిన సితార ట్రావెల్స్ బస్సు

ఇబ్రహీంపట్నం కూలింగ్ కెనాల్ వంతెన వద్ద పెను ప్రమాదం తృటిలో తప్పింది. విజయవాడ వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి డివైడర్‌పైకి ఎక్కడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే బస్సులో ఉన్న 38 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. AP 39 TK 3741 నంబర్ గల సితార ట్రావెల్స్ బస్సు విజయవాడ వైపు ప్రయాణిస్తుండగా.. ఇబ్రహీంపట్నం కూలిం

  • Accident

    Road Accident : నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

  • Bus Accident

    Road Accident : కోదాడ స‌మీపంలో లారీని ఢీకొట్టిన ప్ర‌వేట్ ట్రావెల్స్ బ‌స్సు

Latest News

  • CM Revanth Reddy : రెండ‌వ ద‌శ ఇందిర‌మ్మ ఇళ్లు మంజూరు .. జూన్ 1న ప్రారంభించ‌నున్న సీఎం రేవంత్

  • Karnataka New CM : కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్.. జూన్ 3న ప్రమాణ స్వీకారం

  • TDP : టీడీపీ చూపిన బాటలో దేశ రాజకీయాలు మారబోతున్నాయి: ఎమ్మెల్యే మాధవిరెడ్డి

  • T- SAT : ALP అభ్యర్థులకు గుడ్ న్యూస్.. టి-సాట్‌లో ప్ర‌త్యేక త‌ర‌గ‌తులు

  • CM Revanth Reddy : ప్రజల భద్రతే లక్ష్యం.. కఠిన నిర్ణయాలతో ముందుకు సాగుతున్న రేవంత్ స‌ర్కార్‌

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd