Corona virus: ఇండియాలో కరోనా.. లేటెస్ట్ అప్‌డేట్ ఇదే
- By HashtagU Desk Published Date - 11:54 AM, Thu - 10 February 22

ప్రపంచ వ్యాప్తంగా పంజా విసిరిన కరోనా మహమ్మారి క్రమంగా శాంతిస్తోంది. ఇండియాలో కూడా కరోనా జోరు రోజు రోజుకీ తగ్గుతూ వస్తుంది. ఈ క్రమంలో తాజాగా గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 67,084 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక కరోనా కారణంగా గడచిన 24 గంటల్లో 1,241 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ఇప్పటికు భారత్‌లో 4,24,78,060 మంది కరోనా బారిన పడగా, 4,11,80,751 మంది కరోనా నుండి కోలు కున్నారని, ప్రస్తుతం దేశంలో 7,90,789 కరోనా యాక్టీవ్ కేసులు ఉన్నాయి.
ఇక దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా కారణంగా 5,06,520మంది మరణించారని, తాజా హెల్త్ బులెటిన్ ద్వారా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా కరోనా కారణంగా ఐదు లక్షల మందికి పైగా మరణాలు సంభవించిన మూడో దేశంగా భారత్ నిలిచింది. ఒకవైపు కరోనా యాక్టీవ్ కేసులు తగ్గుతున్నా, మరణాల సంఖ్య పెరుగుతుండడం ఆందోళణ కల్గిస్తోంది. ఇకపోతే నిన్న ఒక్కరోజే 46,44,382 మందికి కొవిడ్ వ్యాక్సిన్లు పంపిణీ జరిగిందని, దీంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,71,28,19,947 టీకా డోసులు వేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. ప్రస్తుతం ఇండియాలో కరోనా పాజిటివిటీ రేటు 4.44 శాతంగా ఉంది.