Balakrishna Daku Maharaj : బాలయ్య డాకు మహారాజ్ లో ఆ హీరోల క్యామియో..?
Balakrishna Daku Maharaj ఈమధ్య బాలకృష్ణ యువ హీరోలు విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డతో చాలా క్లోజ్ గా ఉంటున్నాడు. బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ షోలో విశ్వక్ సేన్, సిద్ధు అటెండ్
- Author : Ramesh
Date : 06-12-2024 - 6:00 IST
Published By : Hashtagu Telugu Desk
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కె.ఎస్ బాబీ డైరెక్షన్ లో డాకు మహారాజ్ సినిమా చేస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో బాలకృష్ణ (Balakrishna,) సరసన శ్రద్ధ శ్రీనాథ్, ఊర్వశి రౌతెలా నటిస్తున్నారు. థమన్ (Thaman) మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్ టీజర్ అదిరిపోయింది.
బాలయ్య మార్క్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న డాకు మహారాజ్ (Daku Maharaj) సినిమాలో స్పెషల్ సర్ ప్రైజ్ ఉందని టాక్. అదేంటి అంటే యంగ్ హిరోలు ఈ సినిమాలో స్పెషల్ క్యామియోస్ ఇస్తున్నారట. ఈమధ్య బాలకృష్ణ యువ హీరోలు విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డతో చాలా క్లోజ్ గా ఉంటున్నాడు. బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ షోలో విశ్వక్ సేన్, సిద్ధు అటెండ్ కాగా అప్పటి నుంచి వారికి చాలా క్లోజ్ గా ఉంటున్నాడు బాలకృష్ణ.
అందుకే బాలకృష్ణ సినిమాలో వారితో క్యామియో చేయించాలని చూస్తున్నారట. మరి సిద్ధు, విశ్వక్ ఇద్దరూ ఉంటారా లేదా ఒకరు మాత్రమే ఉంటారా అన్నది చూడాలి. కె ఎస్ బాబీ (KS Bobby) ఈ సినిమాను ఫ్యాన్స్ కు మాస్ ఫీస్ట్ అందించేలా తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది.
అసలైతే డిసెంబర్ లో రిలీజ్ అవ్వాల్సిన డాకు మహారాజ్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ లాక్ చేశారు. సంక్రాంతి బరిలో చరణ్, వెంకటేష్ లు కూడా తమ సినిమాలతో వస్తున్నారు.
Also Read : Keerthy Suresh :, కీర్తి సురేష్ ని పెళ్లాడాలనుకున్న స్టార్ హీరో..?