Keerthy Suresh :, కీర్తి సురేష్ ని పెళ్లాడాలనుకున్న స్టార్ హీరో..?
Keerthy Suresh నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అమ్మడు ఆ సినిమా హిట్ తో తిరిగి చూసుకోలేని విధంగా ఆఫర్లు అందుకుంది.
- By Ramesh Published Date - 05:21 PM, Fri - 6 December 24

మహానటి సినిమాతో నేషనల్ లెవెల్ క్రేజ్ తెచ్చుకున్న కీర్తి సురేష్ తెలుగు, తమిళ సినిమాలతో పాపులారిటీ తెచ్చుకుంది. నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన అమ్మడు ఆ సినిమా హిట్ తో తిరిగి చూసుకోలేని విధంగా ఆఫర్లు అందుకుంది. కీర్తి సురేష్ ఈమధ్యనే బాలీవుడ్ లో ఒక సినిమా చేసింది.
కీర్తి సురేష్ (Keerthy Suresh) త్వరలో పెళ్లి చేసుకోబోతుంది. ఈ నెల 12న కీర్తి సురేష్ తన బోయ్ ఫ్రెండ్ ఆంటోనితో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించనుంది. కీర్తి సురేష్ తో అతనికి 15 ఏళ్ల రిలేషన్ ఉందని తెలుస్తుంది. ఐతే ఒక స్టార్ హీరో కీర్తితో కలిసి నటించి ఆమెతో ప్రేమలో పడి ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడట.
ఆ హీరో ఎవరు..
దాదాపు కీర్తి సురేష్ పేరెంట్స్ దాకా ఈ మ్యాటర్ వెళ్లిందట. ఐతే కీర్తి సురేష్ మాత్రం తన బోయ్ ఫ్రెండ్ నే పెళ్లాడాలని ఫిక్స్ అయ్యింది. అందుకే ఆ హీరో కీర్తి సురేష్ తో పెళ్లి ప్రయత్నాలు విరమించుకున్నాడు. ఐతే ఆ హీరో ఎవరు కీర్తిని పెళ్లాడుదామనుకున్న స్టార్ ఎవరు అంటే కోలీవుడ్ స్టార్ విశాల్ (Vishal) అని తెలుస్తుంది.
ఆయనే వరలక్ష్మి శరత్ కుమార్ (Varalakshmi Sharath Kumar) తో కొన్నాళ్లు ప్రేమాయణం నడిపించాడు. ఐతే ఎంగేజ్ మెంట్ దాకా వెళ్లిన ఈ ప్రేమ జంట విడిపోయింది. ఆ తర్వాత వరలక్ష్మి వేరే అతన్ని పెళ్లాడింది. విశాల్ మాత్రం ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉండిపోయాడు.
Also Read : Mokshagna : మోక్షజ్ఞ, ప్రశాంత్ వర్మ సినిమా క్యాన్సిల్.. అసలేం జరిగింది..?