Pawan Kalyan: పవన్ కళ్యాణ్ మరో రీమేక్ సినిమా ఓకే చెప్పాడా..?
కెరీర్ లో ఎప్పుడూ లేని విధంగా వరుసగా కొత్త ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. మామూలుగా ఓ సినిమా చేస్తున్నప్పుడు కుదిరితే మరో సినిమా గురించి చెబుతుంటాడు.
- By Hashtag U Published Date - 12:18 AM, Tue - 21 December 21

కెరీర్ లో ఎప్పుడూ లేని విధంగా వరుసగా కొత్త ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. మామూలుగా ఓ సినిమా చేస్తున్నప్పుడు కుదిరితే మరో సినిమా గురించి చెబుతుంటాడు. కానీ ఈ సారి ఏకంగా నాలుగైదు సినిమాలు ఓకే చేసి పెట్టాడు. అన్నీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా జరుపుకుంటున్నాయి. మరోవైపు పొలిటికల్ గానూ బిజీగా ఉన్నాడు. దీంతో ఇప్పుడు ఒప్పుకున్న సినిమాలే పూర్తవుతాయా అనే డిస్కషన్స్ జరుగుతుండగా ఇప్పుడు మరో కొత్త సినిమాకూ ఓకే చెప్పాడనే వార్తలు వచ్చాయి. అయితే అవి నిజమే అని లేటెస్ట్ గా తేలిపోయింది. ఈ చిత్రానికి ప్రొడ్యూసర్స్ కూడా ఈ విషయాన్ని కన్ఫార్మ్ చేశారు. మరి దర్శకుడు ఎవరు అనే కదా డౌట్.
దర్శకుడుగా ఎన్నో సంచలన విజయాలు అందించి ఇప్పుడు నటుడుగా బిజీ అయిన సముద్ర ఖని తెలుసు కదా..? తెలుగులోనూ అతను చాలా బిజీ అయిపోతున్నాడు నటుడుగా. అతని చివరగా దర్శకత్వం చేసిన చిత్రాన్నే పవన్ కళ్యాణ్ రీమేక్ చేయబోతున్నాడనే వార్తలు గత కొన్ని రోజులుగా వస్తున్నాయి కదా..? ఇప్పుడు అవే నిజం కాబోతున్నాయనేది తాజా సమాచారం. విశేషం ఏంటంటే.. ఈ సినిమాలో పాటలు ఉండవు. హీరోయిన్ పాత్రకూ పెద్దగా ప్రాధాన్యం ఉండదు. కథాబలం ఉన్న సినిమా. వర్కింగ్ డేస్ కూడా చాలా తక్కువ. తమిళ్ లో విడుదలైన ఈ చిత్రానికి విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు కూడా వచ్చాయి. పవన్ ఒప్పుకోవడానికి ఇది కూడా ఓ కారణం అంటున్నారు. కాకపోతే ఇదే చిత్రం చేస్తున్నాడా లేదా అనేది ఇంకా కన్ఫార్మ్ కాలేదు.
ఇక ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ సంస్థలో జె భగవాన్ పుల్లారావు నిర్మించబోతున్నారు. ఈ మేరకు నిర్మాతలకు పవన్ నుంచి కన్ఫర్మేషన్ వచ్చింది. ఇక కథా వేట సాగాలి అంటే అంత టైమ్ లేదు. అందుకే ఎలాగూ ఇప్పుడు చేస్తున్న చిత్రం కూడా రీమేకే కదా.. అందుకే ఈ తమిళ్ చిత్రాన్ని సముద్రఖని దర్శకత్వంలో చేస్తే ఎలా ఉంటుంది..? అనే ఆలోచనలో ఉణ్నాడట పవన్. మరి ఇదే నిజమైతే ఈ కథ కూడా పవన్ ఇమేజ్ కు తగ్గట్టుగా పాటలు, ఫైట్లతో ముస్తాబవుతుందని చెప్పొచ్చు.