King Nagarjuna : కింగ్ నాగార్జున ఇది కరెక్ట్ టైం..!
King Nagarjuna వెండితెర మీద మైథలాజికల్ సినిమాలకు ఒక రేంజ్ డిమాండ్ ఏర్పడింది. ఇతిహాస కథలను తెర మీద ఆవిష్కరిస్తున్న తీరు.. అది ప్రేక్షకుల మనసుల్లో స్థానాన్ని సంపాదిస్తున్నాయి. ఐతే పీరియాడికల్, సోషల్, మైథలాజికల్, డివోషనల్ ఇలా జోనర్ ఏదైనా ఫైనల్ గా ప్రేక్షకుడికి
- Author : Ramesh
Date : 04-07-2024 - 7:50 IST
Published By : Hashtagu Telugu Desk
King Nagarjuna వెండితెర మీద మైథలాజికల్ సినిమాలకు ఒక రేంజ్ డిమాండ్ ఏర్పడింది. ఇతిహాస కథలను తెర మీద ఆవిష్కరిస్తున్న తీరు.. అది ప్రేక్షకుల మనసుల్లో స్థానాన్ని సంపాదిస్తున్నాయి. ఐతే పీరియాడికల్, సోషల్, మైథలాజికల్, డివోషనల్ ఇలా జోనర్ ఏదైనా ఫైనల్ గా ప్రేక్షకుడికి నచ్చడమే కావాలి. వాళ్లని మెప్పిస్తేనే ఆ సినిమా సూపర్ హిట్ అయినట్టు లెక్క.
ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో మైథలాజికల్ సినిమాలకు మంచి క్రేజ్ ఉంది. ప్రభాస్ కల్కి సినిమాలో మహాభారతాన్ని టచ్ చేసి నాగ్ అశ్విన్ అదరగొట్టేశాడు. ఐతే టాలీవుడ్ లో మరిన్ని ఇలాంటి సినిమాలు రావాలని ప్రేక్షకులు కోరుతున్నారు. ముఖ్యంగా ఒకప్పుడు డివోషనల్ సినిమాలు చేసిన కింగ్ నాగార్జున కూడా ఇలాంటి సినిమా ఒకటి చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుతున్నారు.
కెరీర్ పీక్స్ లో ఉన్న టైం లోనే అన్నమయ్య, రామదాసు, ఓ నమశీఅయ ఇలా డిఫరెంట్ అటెంప్ట్స్ చేశాడు నాగార్జున. తప్పకుండా నాగార్జున మరోసారి డివోషనల్, మైథలాజికల్ సినిమా చేస్తే ఈసారి వాటి అప్పీల్ పాన్ ఇండియా లెవెల్ లో ఉంటుందని అంటున్నారు. అన్నమయ్య తరహాలో పాన్ ఇండియా రిలీజ్ సినిమా ఒకటి చేస్తే చాలు నాగార్జున స్టామినా ఏంటో అందరికీ అర్ధమవుతుంది. మరి కింగ్ ప్లాన్స్ ఎలా ఉన్నాయో కానీ ప్రస్తుతం నడుస్తున్న ఈ మైథలాజికల్ ట్రెండ్ ని ఆయన గురి పెడతాడా లేదా అన్నది చూడాలి.
Also Read : NTR Devara : దేవర ఏమాత్రం తేడా వచ్చినా సరే..!