Sandeep Kishan: శ్రీ విష్ణు సామజవరగమన సినిమాను వదులుకున్న సందీప్ కిషన్.. ఎందుకో తెలుసా?
తాజాగా మజాకా ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగా హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ సామజవరగమన సినిమాను వదులుకోవడం వెనుక ఉన్న కారణాల గురించి చెప్పుకొచ్చారు.
- By Anshu Published Date - 04:00 PM, Wed - 26 February 25

మామూలుగా సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ రిజెక్ట్ చేసిన సినిమాను మరొక హీరోయిన్ చేయడం,ఒక హీరో రిజెక్ట్ చేసిన సినిమాని మరో హీరో చేయడం అన్నవి కామన్. కొన్ని కొన్ని సార్లు అలా రిజెక్ట్ చేసిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలుస్తూ ఉంటాయి. మరికొన్ని సినిమాలు ఫ్లాప్ అవుతూ ఉంటాయి. అలా అయినప్పుడు కొన్నిసార్లు బాధపడడం నిరాశ పడటం లాంటివి చేస్తూ ఉంటారు. కొందరు మాత్రం తీసుకున్న నిర్ణయాన్ని కరెక్ట్ అని అనుకుంటూ ఉంటారు. అలా ఒక సినిమా విషయంలో అలాంటి నిర్ణయమే తీసుకున్నారట హీరో సందీప్ కిషన్.
సందీప్ హీరోగా నటించిన తాజా చిత్రం మజాకా. ఈ సినిమా తాజాగా ప్రేక్షకులు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగా హీరో సందీప్ కిషన్ చేసిన వాక్యలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలలో భాగంగా సందీప్ కిషన్ మాట్లాడుతూ.. సామజవరగమన సినిమా విషయంలో సరైన నిర్ణయం తీసుకున్నాను అని తెలిపారు. ఈ సినిమాలో హీరోగా నటించిన శ్రీ విష్ణు మంచి సక్సెస్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా కూడా హిట్టుగా నిలిచింది. ఈ చిత్ర నిర్మాతల్లో ఒకడైన అనిల్ సుంకర సందీప్‌కు బాగా క్లోజ్. ఈ విషయం గురించి సందీప్ మాట్లాడుతూ..
సామజవరగమన కథ ముందు నాకే చెప్పారు. నాకు ఆ కథ చాలా బాగా నచ్చింది. నేనే చేద్దామని కూడా అనుకున్నాను. కానీ అదే సమయంలో మైకేల్ మూవీ చేస్తున్నాను. అదొక డిఫెంట్ మూవీ. దానికి ఒక మూడ్ లో ఉండాలి. ఒకలా నటించాలి. ఆ సినిమా చేస్తూ సామజవరగమన లాంటి కామెడీ మూవీ చేయడం కరెక్ట్ కాదు అనిపించింది. అదొక క్రియేటివ్ కాల్. ఆ సమయానికి నేను సరైన నిర్ణయమే తీసుకున్నానని అనుకుంటా. తప్పో ఒప్పో మైకేల్ సినిమా డిస్టర్బ్ అవుతుందని.. సామజవరగమన చిత్రంలో నటించొద్దని నిర్ణయించుకున్నాను. కానీ ఆ సినిమా నాకు చాలా ఇష్టం. దాన్ని వదులుకున్నందుకు బాధ ఏమీ లేదు అని సందీప్ తెలిపాడు.