Pushpa 2 : టికెట్ ధరలు పెంచడం ఎంత వరకు కరెక్ట్..?
'Pushpa 2' Ticket Price : మిమ్మల్ని ఎవడు భారీ బడ్జెట్ సినిమాలు తీయమన్నారు. తక్కువ బడ్జెట్‌లో మంచి సినిమాలు కూడా తీయొచ్చు కదా...అమరన్, క , లక్కీ భాస్కర్ సినిమాలు తక్కువ బడ్జెట్ తో తీసి ప్రేక్షకులను అలరించలేదా..? కథలో దమ్ము , కొత్తదనం ఉండేలా కానీ హీరోలకు 300 , 400 కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చి , భారీ బడ్జెట్ పెట్టి..ఆ డబ్బులు ప్రేక్షకుల నుండి వసూళ్లు చేయడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు
- By Sudheer Published Date - 12:38 PM, Sun - 1 December 24

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – నేషనల్ క్రాష్ రష్మిక (Allu Arjun-Rashmika) జంటగా..లెక్కల మాస్టర్ సుకుమార్ (Sukumar) డైరెక్షన్లో తెరకెక్కిన మూవీ పుష్ప 2 (Pushpa 2). మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ పాన్ ఇండియా మూవీ డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా టికెట్ ధరలను పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. డిసెంబరు 4న రాత్రి 9:30 గంటల బెనిఫిట్ షోతో పాటు, అర్ధరాత్రి 1 గంటకు అదనపు షోలకు కూడా అనుమతి మంజూరు చేశారు.
డిసెంబరు 5 నుంచి 8 వరకు:
సింగిల్ స్క్రీన్‌లో టికెట్ ధర రూ.150 పెరుగుదల
మల్టీప్లెక్స్‌లలో రూ.200 పెంపు
డిసెంబరు 9 నుంచి 16 వరకు:
సింగిల్ స్క్రీన్‌లో రూ.105 పెంపు
మల్టీప్లెక్స్‌లలో రూ.150 పెంపు
డిసెంబరు 17 నుంచి 23 వరకు:
సింగిల్ స్క్రీన్‌లో రూ.20
మల్టీప్లెక్స్‌లలో రూ.50 అదనంగా ఛార్జ్ చేయడానికి అనుమతి ఇచ్చింది.
ఢిల్లీ, ముంబైలో ధరలు చూస్తే..
పుష్ప 2 ది రూల్ టికెట్ రేట్స్ ఢిల్లీలో రూ.1,800 ఉండగా.. ముంబైలో రూ.1,600కు చేరుకున్నాయి. అలాగే, బెంగళూరులో పుష్ప 2 టికెట్ వెయ్యి రూపాయలు పలుకుతున్నాయి. ఈ క్రమంలో పెరిగిన ధరలు చూసి అభిమానులు , నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టికెట్స్ దారుణంగా పెంచేశారని, ఇలా అయితే కామన్ ఆడియెన్స్ ఎవరు చూస్తారని తిట్టిపోస్తున్నారు. పుష్ప 2 సినిమాను మొదటి రెండు రోజులు అభిమానులే ఎక్కువగా చూస్తారని, ఆ తర్వాత టాక్ బాగుంటేనే సాధారణ ప్రేక్షకులు థియేటర్‌కు వస్తారని, మొదటి రోజుల టికెట్ ధరల బారం అల్లు అర్జున్ ఫ్యాన్స్‌పైనే పడుతుందని నెటిజన్స్ అంటున్నారు.
మిమ్మల్ని ఎవడు భారీ బడ్జెట్ సినిమాలు తీయమన్నారు. తక్కువ బడ్జెట్‌లో మంచి సినిమాలు కూడా తీయొచ్చు కదా…అమరన్, క , లక్కీ భాస్కర్ సినిమాలు తక్కువ బడ్జెట్ తో తీసి ప్రేక్షకులను అలరించలేదా..? కథలో దమ్ము , కొత్తదనం ఉండేలా కానీ హీరోలకు 300 , 400 కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చి , భారీ బడ్జెట్ పెట్టి..ఆ డబ్బులు ప్రేక్షకుల నుండి వసూళ్లు చేయడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు. నిత్యా అవసర ధరలు ఆకాశానికి తాకుతున్న వేళ ..ఇంట్లో ఖర్చులు పెరుగుతున్న తరుణంలో..ఇలా ఒక సినిమా చూసేందుకు ఫ్యామిలీ మొత్తం రూ.5000 ఖర్చు ఎందుకు పెట్టాలని అడుగుతున్నారు..అంత ఖర్చు పెట్టి థియేటర్స్ లలో సినిమా చూసే బదులు..చక్కగా ఐ బొమ్మ , లేదా మూవీ రూల్స్ లలో సినిమా చూస్తే సరిపోదా.. ? లేదంటే OTT ‘లో వచ్చేకే చూస్తే సరిపోతుంది కదా..? అని అంటున్నారు. ఏది ఏమైనప్పటికి టికెట్ ధరలు పెంచడం అనేది సినిమా కలెక్షన్ల పై ప్రభావం పడుతుందని చెప్పొచ్చు.
Read Also : World AIDS Day : నేడు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం.. ఈ రోజు చరిత్ర, ప్రాముఖ్యత గురించి తెలుసుకోండి..!