Puneeth’s Last Film: కర్ణాటకలో ‘జేమ్స్’ వేవ్.. థియేటర్లు హౌస్ ఫుల్!
ఇవాళ దివంగత కన్నడ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ నటించిన చివరి చిత్రం జేమ్స్ థియేటర్లలో సందడి చేస్తోంది.
- By Balu J Published Date - 12:22 PM, Thu - 17 March 22

ఇవాళ దివంగత కన్నడ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ నటించిన చివరి చిత్రం జేమ్స్ థియేటర్లలో సందడి చేస్తోంది. అయితే పునీత్ చివరి సినిమా కావడంతో అభిమానులు ఉదయాన్నే సమీప థియేటర్లకు చేరుకొని పెద్ద టపాసులు పేల్చుతూ.. ఈలల వేస్తూ కేరింతలు కొడుతున్నారు. గత ఏడాది అక్టోబర్‌లో గుండెపోటుతో మరణించిన తర్వాత జేమ్స్ ప్రేక్షకుల ముందుకొస్తోంది. పునీత్‌ను ముద్దుగా పిలుచుకునే అభిమానులు పెద్ద కటౌట్లు, విద్యుత్ లైట్లు, పాత సినిమాల పోస్టర్లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాజవంశ అభిమానుల సంఘం సభ్యులు మార్చి 17 నుండి మార్చి 20 వరకు ప్రజలకు ఉచిత ఆహారాన్ని పంపిణీ చేయనున్నారు.
అభిమానులు పునీత్ శ్మశానవాటికలో 9.30 గంటలకు పూల వర్షం కురిపించారు. రాష్ట్రవ్యాప్తంగా రక్తదానం, అన్నదానం, నేత్రదాన శిబిరాలు కూడా నిర్వహించారు. బెంగళూరు, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోని అనేక సినిమా థియేటర్ల బయట భారీ కటౌట్‌లు కూడా ఏర్పాటుచేశారు. మార్చి 17న మొదటి షోకి ముందు బాణాసంచా పేల్చారు. జేమ్స్ మార్చి 17న ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4,000 స్క్రీన్లలో పెద్ద ఎత్తున రిలీజ్ అయ్యింది. తమిళం, హిందీ, తెలుగు, మలయాళ భాషల్లో ఈ సినిమా సందడి చేస్తోంది. కాగా ఈ మూవీలో ట్రైలర్‌లో పునీత్ సెక్యూరిటీ ఏజెంట్ సంతోష్‌గా కనిపిస్తాడు. ఈ సినిమాకి దర్శకత్వం చేతన్ కుమార్, నిర్మాత కిషోర్ పత్తికొండ నిర్మించారు. ఇందులో ప్రియా ఆనంద్, శరత్ కుమార్, శ్రీకాంత్ ఆదిత్య మీనన్, సాధు కోకిల, అను ప్రభాకర్ తదితరులు నటించారు.
https://twitter.com/lavz9999/status/1504170868972273669?cxt=HHwWioCq6fLb8d8pAAAA