Kingdom Team : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న విజయ్ దేవరకొండ
Kingdom Team : “ఈ ఒక్కతూరి ఏడుకొండలసామి నా పక్కన ఉండి నన్ను నడిపించాడా.. చానా పెద్దోడినై పోతా సామి” అంటూ విజయ్ భావోద్వేగంతో చేసిన వ్యాఖ్యలు భక్తుల్లో ఆసక్తిని రేపాయి
- By Sudheer Published Date - 12:55 PM, Sun - 27 July 25

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ (Vijaydevarakonda) తన తాజా సినిమా ‘కింగ్డమ్’ (Kingdom ) ప్రచార కార్యక్రమాల్లో భాగంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో హీరోయిన్ భాగ్యశ్రీ భోర్సేతో కలిసి ఆయన శ్రీవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మూవీ టీం మొత్తం ఆలయ రంగనాయకుల మండపంలో ప్రత్యేక వేదాశీర్వచనాలను స్వీకరించింది. ఈ పూజా కార్యక్రమం సందర్భంగా ఆలయ అధికారులు వారికి తీర్థ ప్రసాదాలు, పట్టువస్త్రాలు అందజేశారు.
విజయ్ దేవరకొండ ఈ సందర్భంగా ఎంతో ఆధ్యాత్మికంగా కనిపించారు. “ఈ ఒక్కతూరి ఏడుకొండలసామి నా పక్కన ఉండి నన్ను నడిపించాడా.. చానా పెద్దోడినై పోతా సామి” అంటూ విజయ్ భావోద్వేగంతో చేసిన వ్యాఖ్యలు భక్తుల్లో ఆసక్తిని రేపాయి. తిరుమల పర్వతాన్ని ఎంతో భక్తితో చూస్తున్న విజయ్, గతంలోనూ అనేకసార్లు తన కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే.
RBI Gold Reserves : RBI వద్ద రూ.7.26 లక్షల కోట్ల బంగారం
‘కింగ్డమ్’ సినిమా జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే తిరుపతిలో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు మంచి స్పందన లభించింది. సినిమాపై అంచనాలు పెరుగుతున్న నేపథ్యంలో, శ్రీ వేంకటేశ్వరుడి ఆశీస్సులు తీసుకోవడానికి విజయ్ దేవరకొండ తిరుమలపై ఆశ్రయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దేవాలయం వద్ద ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో చేరి సెల్ఫీలు తీసుకునే ప్రయత్నం చేయడం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ సినిమాలో విజయ్ దేవరకొండ నటనతో పాటు కథ, నిర్మాణ విలువలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండనున్నాయని చిత్ర బృందం చెబుతోంది.