Vijay Deverakonda: ఫ్యాన్స్ కు మరిచిపోలేని జ్ఞాపకాలు అందించిన రౌడీ హీరో!
తన అభిమానులకి సంతోషాన్ని పంచే విజయ్ ఈ సంవత్సరం 100 మందికి జీవితాంతం గుర్తుంచుకునే జ్ఞాపకాలు అందించాడు.
- By Balu J Published Date - 11:29 AM, Tue - 28 February 23

ఓవైపు నటనలో శిఖరాలు దాటుతూనే అభిమానులకి వీలైనంత ప్రేమని అందిస్తూ ఉన్నాడు హీరో విజయ్ దేవరకొండ. ప్రతి సంవత్సరం దేవర సాంటా గా మారి తన అభిమానులకి సంతోషాన్ని పంచే విజయ్ ఈ సంవత్సరం 100 మందికి జీవితాంతం గుర్తుంచుకునే జ్ఞాపకాలు అందించాడు. తన స్నేహితులతో చిన్నప్పుడు ట్రిప్ కి వెళ్లిన స్మృతులని గుర్తుచేసుకుంటూ తన దగ్గర సరైన సంపాదన లేనప్పుడు ఆ ట్రిప్ కి తన స్నేహితులు తనని తీసుకెళ్లడం ఎంత సంతోషాన్నిచ్చిందో చెప్పాడు.
అలాంటి సంతోషాన్ని పంచాలనే ఎంపిక చేయబడిన 100 మంది సామాన్యులని తన సొంత ఖర్చు తో మనాలి ట్రిప్ కి తీసుకెళ్లడమే కాకుండా తన తల్లితండ్రులతో పాటు వెళ్లి వారితో సమయం గడిపాడు. తాజాగా ఆ ట్రిప్ కి సంబంధించిన గ్లింప్స్ ని విజయ్ తన హ్యాండిల్ లో పోస్ట్ చేయగా అందులో, ట్రిప్ లో భాగమైన ఆనందం, విజయ్ మీద తమ ప్రేమ, కృతజ్ఞత, తమ జీవితం లో ఈ ట్రిప్ ఎంత ముఖ్యమో తెలియజేసారు. చివర్లో అందరూ ఎమోషనల్ అయి విజయ్ ని హగ్ చేసుకోవడం ఆ 100 మంది ఒకరికొకరు ఎమోషనల్ గా దగ్గరవ్వడం చూడచ్చు.
Also Read: New Zealand beat England: టెస్టు క్రికెట్‌లో సంచలనం.. 1 పరుగు తేడాతో కివీస్ సంచలన విజయం