Vijay Devarakonda Sai Pallavi : విజయ్ దేవరకొండతో సాయి పల్లవి.. ఓకే అనాలంటే మాత్రం ఆ కండీషన్ తప్పనిసరి..!
Vijay Devarakonda Sai Pallavi కత్తి నేనే.. నెత్తురు నాదే.. యుద్ధం నాతోనే అంటూ విజయ్ దేవరకఒండ నెక్స్ట్ సినిమా పోస్టర్ తోనే వారెవా అనిపించేశాడు. రవి కిరణ్ కోలా డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మిస్తున్న
- By Ramesh Published Date - 07:56 PM, Tue - 14 May 24

Vijay Devarakonda Sai Pallavi కత్తి నేనే.. నెత్తురు నాదే.. యుద్ధం నాతోనే అంటూ విజయ్ దేవరకఒండ నెక్స్ట్ సినిమా పోస్టర్ తోనే వారెవా అనిపించేశాడు. రవి కిరణ్ కోలా డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా పీరియాడికల్ నేపథ్యంతో వస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారన్నది కన్ ఫ్యూజన్ మొదలైంది. అయితే ఫిల్మ్ నగర్ సర్కిల్ సమాచారం మేరకు ఈ సినిమాలో విజయ్ దేవరకొండతో సాయి పల్లవి జత కడుతుందని అంటున్నారు.
ఫిదా తో తెలుగు తెరకు పరిచయమైన సాయి పల్లవి ఆ సినిమా నుణి ఇప్పటివరకు చేస్తున్న ప్రతి సినిమాతో తెలుగు ఆడియన్స్ ని మెప్పిస్తూ వస్తుంది. సినిమాలో తన పాత్ర నచితేనే ప్రాజెక్ట్ ఓకే చేసే సాయి పల్లవి ఈమధ్య గ్యాప్ తీసుకుంది. ఇక లేటెస్ట్ గా నాగ చైతన్య తండేల్ సినిమాకు సైన్ చేసిన సాయి పల్లవి తన నెక్స్ట్ సినిమా కోసం తొందర పడట్లేదు.
Also Read : Keerti Suresh : అక్కడ కీర్తి సురేష్ దూకుడు ఒక రేంజ్ లో ఉందిగా..?
అయితే విజయ్ దేవరకొండ రవికిరణ్ సినిమాలో సాయి పల్లవిని తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారట. సినిమాలో హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యా ఉంటుందని అందుకే ఆమెను తీసుకోవాలని అనుకుంటున్నారని తెలుస్తుంది. ఫైనల్ గా కథ విన్న సాయి పల్లవి సినిమాలో లిప్ లాక్ లేకపోతేనే ఓకే చెబుతానని అన్నదట. అయితే ఈ సినిమా కథ లవ్ స్టోరీ, రివెంజ్ డ్రామాగా ఉంటుందని. సినిమాలో ఇంటెన్స్ ఉంటుందని లిప్ లాక్స్ ఛాన్స్ లేదని చెప్పి మేకర్స్ సాయి పల్లవిని ఒప్పించారట.
విజయ్ దేవరకొండ, సాయి పల్లవి ఇద్దరి కాంబినేషన్ డిఫరెంట్ గా ఉంటుందని చెప్పొచ్చు. ఫ్యామిలీ స్టార్ తర్వాత గౌతం తిన్ననూరితో సినిమా చేస్తున్న విజయ్ దేవరకొండ వరుస క్రేజీ సినిమాలతో ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తున్నాడు.