Keerti Suresh : అక్కడ కీర్తి సురేష్ దూకుడు ఒక రేంజ్ లో ఉందిగా..?
Keerti Suresh సౌత్ స్టార్ హీరోయిన్ గా దూసుకెళ్తున్న కీర్తి సురేష్ ఇప్పుడు బాలీవుడ్ లో కూడా తన ఫాం కొనసాగించాలని చూస్తుంది. ఆల్రెడీ బేబీ జాన్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ
- By Ramesh Published Date - 07:33 PM, Tue - 14 May 24

Keerti Suresh సౌత్ స్టార్ హీరోయిన్ గా దూసుకెళ్తున్న కీర్తి సురేష్ ఇప్పుడు బాలీవుడ్ లో కూడా తన ఫాం కొనసాగించాలని చూస్తుంది. ఆల్రెడీ బేబీ జాన్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న అమ్మడు ఇప్పుడు మరో క్రేజీ ఆఫర్ అందుకున్నట్టు తెలుస్తుంది. బేబీ జాన్ తో వరుణ్ ధావన్ తో జత కడుతున్న కీర్తి సురేష్ ఈసారి ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కు జంటగా ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది. మొదటి సినిమా రిలీజ్ అవ్వకుండానే కీర్తి సురేష్ కు సెకండ్ మూవీ ఛాన్స్ వచ్చింది.
ప్రియదర్శన్ డైరెక్షన్ లో అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. ఈ సినిమా కోసం కీర్తి సురేష్ కి భారీ రెమ్యునరేషన్ ని ఆఫర్ చేశారట మేకర్స్. బేబీ జాన్ సినిమా తర్వాత కీర్తి సురేష్ కి పర్ఫెక్ట్ సినిమా పడిందని చెప్పొచ్చు.
కీర్తి సురేష్ ఓ పక్క సౌత్ లో తన సత్తా చాటుతూనే మరోపక్క బాలీవుడ్ ఆఫర్లను అందుకుంటుంది. మాతృభాష మలయాళం లో కన్నా తెలుగు, తమిళంలో ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్న కీర్తి సురేష్ ఇక మీదట బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటేందుకు సిద్ధమైంది. మరి అమ్మడి బాలీవుడ్ కెరీర్ ఎలా ఉండబోతుంది అన్నది చూడాలి.
తెలుగులో లాస్ట్ ఇయర్ దసరా తో సూపర్ హిట్ అందుకున్న కీర్తి సురేష్ ఆ తర్వాత ఒక్క ఛాన్స్ కూడా అందుకోలేదు. అయితే సందీప్ వంగ ప్రభాస్ కాంబో సినిమాలో కీర్తి కి ఆఫర్ ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. ఆల్రెడీ బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది కాబట్టి స్పిరిట్ సినిమా కూడా కీర్తి సురేష్ కెరీర్ కి సూపర్ బూస్టింగ్ ఇస్తుందని చెప్పొచ్చు.
Also Read : Nagababu – Allu Arjun : నాగబాబు ట్వీట్ పై అల్లు అర్జున్ మిత్రుడు.. వైసీపీ లీడర్ రియాక్షన్..