Vijay Devarakonda Rashmika Mandanna : విజయ్ కోసం రష్మిక.. అందుకు రెడీ అవుతుందా..?
Vijay Devarakonda Rashmika Mandanna ఈ సినిమా తో పాటుగా శ్యామ్ సింగ రాయ్ (Syam Singha Roy) డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ డైరెక్షన్ లో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా
- By Ramesh Published Date - 03:22 PM, Mon - 18 November 24

రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ప్రస్తుతం గౌతం తిన్ననూరి (Gowtham Tinnanuri) డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. విజయ్ దేవరకొండ ఈ సినిమా తర్వాత రవి కిరణ్ కోలా డైరెక్షన్ లో మరో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తో పాటుగా శ్యామ్ సింగ రాయ్ (Syam Singha Roy) డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ డైరెక్షన్ లో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా నిర్మిస్తున్నారు.
పీరియాడికల్ మూవీగా రాబోతున్న ఈ సినిమాలో కథానాయిక ఎవరన్నది ఇంకా తేలలేదు కానీ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం రష్మిక మందన్న ని తీసుకుంటున్నారని తెలుస్తుంది. విజయ్ తో రష్మిక (Rashmika) కలిసి జత కడితే ఆ ఇద్దరి ఫ్యాన్స్ కి పండగ అన్నట్టే. విజయ్ దేవరకొండ తో గీతా గోవిందం, డియర్ కామ్రెడ్ సినిమా చేస్తున్నాడు.
రష్మిక నేషనల్ లెవెల్..
విజయ్ దేవరకొండ రష్మిక మళ్లీ కలిసి స్క్రీన్ మీద కనిపిస్తే చూడాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. ఐతే ప్రస్తుతం రష్మిక నేషనల్ లెవెల్ లో భారీ సినిమాలు చేస్తున్నాడు. విజయ్ దేవరకొండ ఒకేసారి మూడు సినిమాలు చేస్తున్నాడు. రష్మిక మందన్న కూడా విజయ్ సినిమా అనగానే మరో మాట ఆలోచించకుండా ఓకే చెబుతుంది.
తప్పకుండా ఈ ఇద్దరు కలిసి నటిస్తే మాత్రం ఫ్యాన్స్ కి కన్నుల పండగ అన్నట్టే లెక్క. విజయ్ దేవరకొండ రాబోతున్న సినిమాలతో భారీ టార్గెట్ పెట్టుకున్నాడు. కెరీర్ లో సరైన సక్సెస్ లేని విజయ్ ఈ సినిమాలతో తిరిగి ఫాం లోకి రావాలని చూస్తున్నాడు.
Also Read : Mahesh : మహేష్ లుక్కు మార్చేశాడు.. న్యూ లుక్ చూశారా..?