Vijay Devarakonda : ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ ఎప్పుడంటే.. విజయ్ దేవరకొండ సినిమా శాంపిల్ చూపించేందుకు రెడీ..!
Vijay Devarakonda విజయ్ దేవరకొండ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో పరశురాం డైరెక్ట్ చేసిన సినిమా ఫ్యామిలీ స్టార్. గీతా గోవిందంతో సూపర్ హిట్ అందుకున్న పరశురాం విజయ్ కాంబో మళ్లీ ఈ సినిమాతో
- Author : Ramesh
Date : 23-03-2024 - 10:15 IST
Published By : Hashtagu Telugu Desk
Vijay Devarakonda విజయ్ దేవరకొండ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో పరశురాం డైరెక్ట్ చేసిన సినిమా ఫ్యామిలీ స్టార్. గీతా గోవిందంతో సూపర్ హిట్ అందుకున్న పరశురాం విజయ్ కాంబో మళ్లీ ఈ సినిమాతో రిపీట్ చేస్తున్నారు. సినిమాలో విజయ్ కి జోడీగా మృణాల్ ఠాకూర్ నటించింది. సినిమా నుంచి వచ్చిన టీజర్, సాంగ్స్ ఆడియన్స్ లో బజ్ క్రియేట్ చేశాయి. ఏప్రిల్ 5న రిలీజ్ లాక్ చేసిన ఫ్యామిలీ స్టార్ సినిమా ట్రైలర్ కోసం ఆసక్తికరంగా ఉన్నారు ఆడియన్స్. అయితే ఈ ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్ అయినట్టు తెలుస్తుంది.
మార్చి 25న విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ రిలీజ్ ప్లాన్ చేశారట మేకర్స్. సినిమా ని శాంపిల్ గా చూపిస్తూ ట్రైలర్ తోనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఫ్యామిలీ స్టార్ సినిమా గురించి లేటెస్ట్ గా దిల్ రాజు సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్, ఫ్యామిలీ గురించి ఒక వ్యక్తి పడే కష్టాన్ని చూపించామని. అంతేకాని ఇది విజయ్ ని స్టార్ గా చూపించే ప్రయత్నం కాదని అన్నారు.
సీతారామం, హాయ్ నాన్న సినిమాలతో సూపర్ హిట్ అందుకున్న మృణాల్ ఠాకూర్ హిట్ సెంటిమెంట్ ఫ్యామిలీ స్టార్ కు వర్క్ అవుట్ అవుతుందా లేదా అన్నది చూడాలి. అసలైతే ఏప్రిల్ 5న దేవర రిలీజ్ అవ్వాల్సి ఉండగా ఆ సినిమా ప్లేస్ లో విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ వస్తుంది. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
Also Read : Naga Chaitanya : అక్కినేని ఫ్యాన్స్ ని ఖుషి చేస్తున్న తండేల్ వర్కింగ్ స్టిల్స్..!