Vijay Devarakonda Family Star : ఫ్యామిలీ స్టార్ మంత్ ఎండింగ్ కి ముగిస్తారా..?
Vijay Devarakonda Family Star విజయ్ దేవరకొండ మృణాల్ ఠాకూర్ కలిసి నటిస్తున్న ఫ్యామిలీ స్టార్ సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ లాక్ చేశారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాను పరశురాం డైరెక్ట్
- By Ramesh Published Date - 08:29 AM, Wed - 14 February 24

Vijay Devarakonda Family Star విజయ్ దేవరకొండ మృణాల్ ఠాకూర్ కలిసి నటిస్తున్న ఫ్యామిలీ స్టార్ సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ లాక్ చేశారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాను పరశురాం డైరెక్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ గీతా గోవిందంతో సూపర్ హిట్ అందుకున్న ఈ కాంబో మళ్లీ అదే హిట్ సెంటిమెంట్ తో రిపీట్ చేసేలా చూస్తున్నారు. ఫ్యామిలీ స్టార్ సినిమా ఇంకా షూటింగ్ పూర్తి చేయాల్సి ఉందట. ఈ నెల చివర దాకా షూటింగ్ ఉందని తెలుస్తుంది. మంత్ ఎండింగ్ కల్లా సినిమా షూటింగ్ పూర్తి చేస్తే మార్చిలో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేస్తారట.
ఏప్రిల్ 5న అసలైతే ఎన్.టి.ఆర్ దేవర రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ ఆ సినిమా లేట్ అయ్యేలా ఉందని ఆ సూపర్ డేట్ ని విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ కి ఫిక్స్ చేశారు. గోపీ సుందర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలోని మొదటి సాంగ్ నందనందన ఇప్పటికే ట్రెండింగ్ లో ఉంది. సినిమాలో హీరోయిన్ గా చేసిన మృణాల్ ఠాకూర్ ఈ సినిమాతో హ్యాట్రిక్ అందుకోవాలని చూస్తుంది.
ఆల్రెడీ సీతారామం తో సూపర్ హిట్ కొట్టిన మృణాల్ హాయ్ నాన్నతో కూడా సూపర్ సక్సెస్ అందుకుంది. ఇక ఫ్యామిలీ స్టార్ కూడా హిట్ అయితే అమ్మడు హ్యాట్రిక్ అందుకున్నట్టే అవుతుంది. ఖుషి తర్వాత విజయ్ దేవరకొండ చేస్తున్న ఈ సినిమా విషయంలో రౌడీ ఫ్యాన్స్ అంతా కూడా సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు. విజయ్ దేవరకొండ ఈ సినిమాలో ఫ్యామిలీ మ్యాన్ గా కనిపిస్తున్నాడు.
విజయ్ దేవరకొండ ఈ సినిమా తర్వాత గౌతం తిన్ననూరి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. స్పై థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది.
Also Read : Pushpa 2 : ఫోటో షూట్స్ కే బికినీ వేస్తుంది.. పుష్ప ఐటం సాంగ్ అంటే రచ్చ రంబోలానే..!